సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలల తర్వాత తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో కేంద్రంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
తాజాగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మట్లాడుతూ..‘కేంద్రంలోని బీజేపీ నేతలు బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేశారు. వాళ్ల జిమ్మిక్కులు, మానసికంగా, రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారు. నా మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. కానీ, ఏమైంది. రాజకీయాల్లో అదొక పార్ట్ మాత్రమే. వాళ్ల చేతిలో ఐటీ, ఈడీలు మాత్రమే ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు.
ఇదే సయమంలో తెలంగాణలో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అయ్యింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగింది. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐటీలో కూడా మనం బెంగళూరును మించిపోయాం. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఈడీ హీట్.. సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత
Comments
Please login to add a commentAdd a comment