Telangana Minister Malla Reddy Tongue Slip On RTC Merge - Sakshi
Sakshi News home page

మాట జారిన మంత్రి మల్లారెడ్డి.. ఆర్టీసీ విలీనంపై సంచలన కామెంట్‌

Published Wed, Aug 2 2023 4:06 PM | Last Updated on Wed, Aug 2 2023 6:35 PM

Telangana Minister Malla Reddy Tongue Slip on RTC Merge - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి కామెంట్లతో వార్తల్లోకెక్కారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్యానించారాయన. టీఎస్సార్సీటీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంపై ఉద్యోగుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ క్రమంలో బుధవారం పీర్జాదిగూడ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. 

ఈ సందర్భంగా.. TSRTC కార్మికులకు డబుల్కా మీటాలాగా.. ఊహించని విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా?అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఆ వెంటనే సవరించుకుని.. ‘‘ఎన్నికల కోసమే అయినా కార్మికులకు మంచి జరిగింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే దమ్ము, ఫండ్స్‌ ఉండాలి. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారాయన. 

 ఇదీ చదవండి: మెట్రో విస్తరణ వాళ్ల లబ్ధి కోసమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement