సాక్షి, సూర్యాపేట జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని, కొంతమంది కావాలనే తనపై ఈ రకమైన ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పనికట్టుకుని బీఆర్‌ఎస్‌తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరం. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదు. నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు. నా పుట్టుక కాంగ్రెస్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నా.
టికెట్ నాదే.. గెలుపు నాదే ఇందులో ఎలాంటి అనుమానంలేదు. లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదు. ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచా. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశా. ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చా. నాకు గ్రూపులు లేవు నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా’ అని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?.. ట్రాఫిక్ రూల్స్ మారాయ్.. కొత్త స్పీడ్ లిమిట్స్ ఇవిగో
Comments
Please login to add a commentAdd a comment