ramreddy damodar reddy
-
తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ
-
‘నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు’
సాక్షి, సూర్యాపేట జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని, కొంతమంది కావాలనే తనపై ఈ రకమైన ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనికట్టుకుని బీఆర్ఎస్తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరం. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదు. నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు. నా పుట్టుక కాంగ్రెస్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నా. టికెట్ నాదే.. గెలుపు నాదే ఇందులో ఎలాంటి అనుమానంలేదు. లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదు. ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచా. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశా. ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చా. నాకు గ్రూపులు లేవు నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా’ అని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?.. ట్రాఫిక్ రూల్స్ మారాయ్.. కొత్త స్పీడ్ లిమిట్స్ ఇవిగో -
ఈ నెల 16 నుంచి మునుగోడులో కాంగ్రెస్ యాక్టీవ్ గా పనిచేస్తుంది
-
30 ఏళ్లపాటు సేవలు.. డ్రైవర్ పాడె మోసిన మాజీ మంత్రి
సాక్షి, ఖమ్మం: వాహనం డ్రైవర్‌గానే కాకుండా కుటుంబానికి ఆప్తుడిగా ముప్పై ఏళ్ల పాటు సేవలందించిన వ్యక్తి మృతి చెందడంతో... ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మాజీ మంత్రి కృతజ్ఞత చాటుకున్నారు. కామేపల్లికి చెందిన సిద్ధబోయిన కృష్ణ(59) మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి డ్రైవర్‌గా పనిచేశాడు. అంతేకాకుండా ముప్పై ఏళ్ల ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. కాగా, కృష్ణ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలియగానే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు చేరుకుని నివాళులర్పించారు. కృష్ణ అంత్యక్రియల్లో పాడె మోసిన దామోదర్‌రెడ్డి.. తమ కుటుంబానికి కృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీటీసీ బానోత్ వెంకటప్రవీణ్‌కుమార్, నాయకులు నర్సింహారెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్, లక్కినేని సురేందర్, డాక్టర్ భూక్యా రాంచందర్‌నాయక్, జి.రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆదిలాబాద్: ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సులు -
కాంగ్రెస్‌లో తుంగతుర్తి లొల్లి ముగిసేనా?
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పరిష్కారానికి టీపీసీసీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్. సంపత్‌కుమార్, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ నియోజకవర్గంలో పార్టీ పరంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తూ టీపీసీసీకి నివేదిక అందించనుంది. తుంగతుర్తిలో రెండుగా చీలిన కాంగ్రెస్ ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలి ఒకవర్గంపై మరొకవర్గం ఆరోపణలు చేసుకోవడం తారస్థాయికి వెళ్లింది. గత ఎన్నికల్లో నియోజకర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అద్దంకి దయాకర్ ఇటీవల మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి(ఆర్డీఆర్)పై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. తనను, తన వర్గాన్ని నియోజకవర్గంలో ఆర్డీఆర్ తిరగనివ్వడంలేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను దామోదర్‌రెడ్డి దూషించాడని హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్‌లో కూడా అద్దంకితో పాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్డీఆర్ వర్గం కూడా అగ్గివీుద గుగ్గిలమైంది. అద్దంకి దయాకర్‌పై నియోజకవర్గ వ్యాప్తంగా బాహాటంగా విమర్శలు గుప్పించింది. అలాగే అద్దంకిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో సయోధ్య కుదుర్చేందుకు టీపీసీపీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోనైనా రెండు వర్గాల మధ్య రాజీకుదురుతుందోలేదో వేచి చూడాల్సిందే. -
కారు బోల్తా.. మాజీ మంత్రికి గాయాలు
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సుజాత నగర్ మండలం డేగల మడుగు వద్ద ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మరో కారు దామోదర్‌రెడ్డి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన కారు బోల్తా కొట్టడంతో.. స్వల్ప గాయాలతో దామోదర్‌రెడ్డి బయటపడ్డారు. ఇది గమనించిన స్థానికులు దామన్నకు స్థానిక వైద్యులతో ప్రథమ చికిత్స అందించి అనంతరం మరో వాహనంలో లింగాలకు పంపించారు. మాజీ మంత్రికి పెను ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. (నా చావుకు ఎమ్మెల్యేనే కారణం) -
బడ్జెట్ ఓ అంకెలగారడీ
సాక్షి, సూర్యాపేట : శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఓ అంకెల గారడీ అని డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రూ. 1.2లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం నేడు సుమారు రూ. 36లక్షల కోట్ల బడ్జెట్ తగ్గించి సంక్షేమ పథకాల్లో ప్రజలకు కోత విధించేదిలా ఉందన్నారు. బడ్జెట్ కుందించడమంటే సంక్షేమ పథకాలను ఆటకెక్కించడానికే అనడానికి నిదర్శనమన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆనాడు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నాయకత్వంలో పోరాడి రెండో దశ కాల్వలకు నాటి రైతాంగానికి శ్రీరాంసాగర్ జలాలను కాల్వల ద్వారా విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో 2 లక్షల 50వేల ఎకరాలకు శ్రీరాంసాగర్ రెండో దశ కాల్వల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంద న్నారు. రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాల బారినపడి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆసుపత్రులను సందర్శించి రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వల్లనే ఆసుపత్రిని మంగళవారం రాష్ట్ర మంత్రులు సందర్శించారని తెలిపారు. ఈనెల 13న టీపీసీసీ పిలుపుమేరకు రైతుబంధు, రైతురుణమాఫీ చేయకుండా ప్రభుత్వం చేపడుతున్న రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, నాయకులు ధరావత్ వీరన్ననాయక్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బంటు చొక్కయ్య, నరేందర్‌నాయుడు, నాగుల వాసు, ఆలేటి మాణిక్యం, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ ప్రధాని కావడం ఖాయం
సాక్షి, తిరుమలాయపాలెం: దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయని ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అత్యధిక పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని, డబ్బు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని, దేశంలో రాహుల్ ప్రభంజనం నడుస్తుందని భావి ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని, ఖమ్మం ఎంపీ సీటు రేణుకాచౌదరి గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పాలేరులో ఈసారి అత్యధిక మెజార్టీ సాధించబోతున్నామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రాధాకిషోర్, ఆర్.నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనువాస్, సంకీర్త్‌రెడ్డి, అరవిందరెడ్డి పాల్గొన్నారు. -
రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
సాక్షి, పెన్‌పహాడ్(సూర్యాపేట) : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఓటర్లను డబ్బు సంచులతో కొనుగోలు చేసి గెలవాలని కలలు కంటున్నారన్నారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీద్వారానే సాధ్యమవుతుందన్నారు.కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కార్పొరేట్ వ్యక్తులకు లబ్ధిచేకూరే విధంగా చట్టాలు తీసుకొచ్చి వారిని కుబేరులుగా మార్చాడని ఆయన ఆరోపించారు. దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సినఅవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తనను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినట్లయితే కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలంలో సాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం రాయిచెరువును రిజర్వాయర్‌గా మార్చడంతోపాటు లిప్టుల నిర్మాణం చేపడుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 16స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్న కేసీఆర్ కేంద్రంలో ప్రధాన మంత్రి ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ, కేసీఆర్‌లు రహస్య ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై అక్కసు వెల్లగక్కుతున్నారని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల పేరుతో దోచుకున్న సొమ్మును రాహుల్ గాంధీ ప్రధాని అయిన తరువాత కక్కిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, టీపీసీసీ కార్యదర్శి తూముల భుజంగరావు, కొప్పుల వేణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పిన్నెని కోటేశ్వర్రావు, నాయకులు తండు శ్రీనివాస్‌యాదవ్, తూముల సురేష్‌రావు, బచ్చుపల్లి నాగేశ్వర్రావు, నాతాల జానకిరాంరెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, బెల్లకొండ శ్రీరాములు, మండలి జ్యోతి, రామినేని పుష్పావతి, పొనుగోటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దామోదర్‌రెడ్డి విజయ చండీయాగం
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విజయ చండీయాగం ప్రారంభించారు. మంగళవారంతో ఈ యాగం ముగియనుంది. అయితే దామోదర్‌రెడ్డి తాను సీఎం కావాలని ఈ యాగం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసింది. విజయ చండీ యాగం వల్ల తనకు శాసనసభ్యుడిగా విజయం కలగాలని, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా లేదా సీఎంగా పదవీ యోగం కలగాలని కాంక్షిస్తున్నట్టు ఆయన పేరిట సూర్యాపేట, హైదరాబాద్‌లో ఉన్న నివాస గృహాల అడ్రస్‌తో ఉన్న పత్రిక సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే సోమవారం ఆయన దీనిని ఖండించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాను యాగం చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. తనపై గిట్టని వాళ్లే ఇలా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల ఈ యాగానికి సూర్యాపేటలోని ప్రముఖులను, పలు పార్టీల నేతలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. యాగం విషయంలో ఎలాంటి అపోహలు సృష్టించవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, టీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పెన్‌పహాడ్(సూర్యాపేట) : టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కార్యకర్తలను కోరారు. మంగళవారం మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ఆటో యూనియన్, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 2019సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సారధ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కొప్పుల వేణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సూదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, మండలి జ్యోతి, పిచ్చయ్య, నారాయణ శ్రీనివాస్‌రెడ్డి, కళింగారెడ్డి, దేవయ్య, నాగయ్య, ఇంద్రయ్య పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం.. అవినీతిలో కూరుకుంది
తిరుమలగిరి (తుంగతుర్తి) : టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతు న్న భాష వింటుంటే తెలంగాణ రాష్ట్రం పరువు పోతుందన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించడం అవివేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కషి చేసిందని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూజేఏసీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళన చేస్తుంటే రా ష్ట్ర ముఖ్యమంత్రి డీఎస్సీ గురించి హేళనగా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన అహంకారం పతనానికి పునాదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాం రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, చెవిటి వెం కన్న, డాక్టర్ వడ్డెపల్లి రవి, గుడిపాటి నర్సయ్య, ఎస్.కొండల్‌రెడ్డి, రాంబాబు, చంద్రశేఖర్, జాటోతు సోమన్న, విశ్వేశ్వర్, నరేష్ పాల్గొన్నారు. -
‘కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది అందుకే’
సూర్యాపేట: పెద్ద నోట్ల రద్దు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ వెళ్లారను కోవడం పొరపాటని, ఆయన వద్ద ఉన్న బ్లాక్ మనీని మార్చుకునేందుకు ప్రధాన మంత్రి మోదీని కలిశారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విసుగు చెందిన ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధవుతోందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పెద్ద మనుష్యులు మాత్రం తమ డబ్బును దర్జాగా మార్చుకున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతోప్రజల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈనెల ఏడో తేదీన సూర్యాపేటలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకులు జానారెడ్డి తదితరులు హాజరవుతారని అన్నారు. -
ఐబీ తప్పుడు నివేదిక పంపే అవకాశం: దామోదర్ రెడ్డి
హైదరాబాద్ : రాయల తెలంగాణ అంశంపై కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు .....పార్టీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవడం సరైంది కాదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... ఇది తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నమేనన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలంతా మొదటినుంచి పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపే అవకాశం ఉందని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ అంశాన్ని హైకమాండ్ గేమ్ ప్లాన్‌లో భాగమని అనుకోవటం లేదన్నారు. అదే అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతోపాటు, కేంద్ర కేబినెట్ నిర్ణయంలోనూ రాయల తెలంగాణ ప్రస్తావన ఎందుకు ఉందని ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలని జీవోఎంను కోరేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. -
'తెలంగాణను వ్యతిరేకిస్తే ద్రోహులుగా ప్రకటిస్తాం'
నల్గొండ : తెలంగాణలో గానీ... సీమాంధ్ర ప్రాంతంలోకానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ద్రోహులుగా ప్రకటిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం సూర్యాపేటలోని తన నివాసంపై ఇంటిపై జాతీయ జెండాతో పాటు, తెలంగాణ, కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. -
రేణుక రాకపై రగడ!
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి కలకలం రేపారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నేతల సమావేశానికి ఎంపీ రేణుకాచౌదరి రావడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రేణుకాచౌదరి రాకపట్ల సమావేశం ఆరంభంలోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెను సమావేశానికి ఎందుకు పిలిచారని నిర్వాహకులను నిలదీశారు. ‘కనీసం ఆత్మ గౌరవం లేకుంటే ఎలా? పిలిస్తే మాత్రం ఎందుకు వచ్చినట్లు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు? సిగ్గూ, జ్ఞానం ఉన్నవారెవరూ రారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా సమావేశానికి రావడం అవివేకం’ అని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో వారిద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వగా జానారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సర్దిచెప్పారు. ఇంత జరుగుతున్నా రేణుకా చౌదరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని సమాచారం. కాగా, సమావేశం జరుగుతుండగానే ఉస్మానియా జేఏసీ విద్యార్థులు అక్కడికి వచ్చారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు. -
యువజన ఉత్సాహం
సూర్యాపేట, న్యూస్‌లైన్: భారత దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేటలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వివే కానందుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందు సాగాలన్నారు. సూర్యాపేటలో త్వరలో యువజనోత్సవాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి జనవరి 12వ తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఆర్ ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార కర్త దేవెందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి మతాచారాలను పాటిస్తూ ఇతరుల్లో ఉన్న మంచిని చాటి చెప్పాలని వివేకానందుడు సూచించిచారని తెలి పారు. యువకులు సామాజిక సేవ చేసి దేశ ఉన్నతికి పాటు పడాలని కోరారు. అంతకు ముందు స్వామి వివేకానంద చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 3కే రన్‌ను ప్రారంభించారు. మెయిన్ రోడ్డు, పూలసెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, రాఘవప్లాజా, వాణిజ్య భవన్‌సెంటర్, శంకర్‌విలాస్ సెంటర్, గాంధీ విగ్రహం నుంచి నిర్మల ఆసుపత్రి రోడ్డు మీదుగా తిరిగి జూనియర్ కళాశాల వరకు 3కే రన్ నిర్వహించారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వి.నాగన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ, నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, వైస్ చైర్మన్ శ్రీరంగం గణేష్, కార్యక్రమ నిర్వాహకులు గోపగాని వెంకటనారాయణ, అంగిరేకుల నాగార్జున, తీకుళ్ల సాయిరెడ్డి, నాగవెళ్లి ప్రభాకర్, కొల్లు మధుసూదన్‌రావు, తహసీల్దార్ జగన్నాథరావు, నాయకులు అబ్దుల్ రహీం, సయ్యద్ సలీం, ఉప్పల సంపత్‌కుమార్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, బండపల్లి పాండురంగాచారి, చల్లమళ్ల నర్సింహ్మ, కుంట్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టలేరు: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేతల సహకారం వల్లే ఏపీఎన్జీవోల సంఘం హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిం చగలిగిందని, అదే తెలంగాణవాదులు తలచుకుంటే ఇక్కడ అడుగుకూడా పెట్టేవారుకాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే.. ఆ తరువాత ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వస్తే సీఎం సహా ఎవరైనా హైకమాండ్ చెప్పినట్లు వినాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.