
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సుజాత నగర్ మండలం డేగల మడుగు వద్ద ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మరో కారు దామోదర్‌రెడ్డి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన కారు బోల్తా కొట్టడంతో.. స్వల్ప గాయాలతో దామోదర్‌రెడ్డి బయటపడ్డారు. ఇది గమనించిన స్థానికులు దామన్నకు స్థానిక వైద్యులతో ప్రథమ చికిత్స అందించి అనంతరం మరో వాహనంలో లింగాలకు పంపించారు. మాజీ మంత్రికి పెను ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. (నా చావుకు ఎమ్మెల్యేనే కారణం)
Comments
Please login to add a commentAdd a comment