సూర్యాపేట, న్యూస్‌లైన్: భారత దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేటలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వివే కానందుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందు సాగాలన్నారు.
సూర్యాపేటలో త్వరలో యువజనోత్సవాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి జనవరి 12వ తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఆర్ ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార కర్త దేవెందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి మతాచారాలను పాటిస్తూ ఇతరుల్లో ఉన్న మంచిని చాటి చెప్పాలని వివేకానందుడు సూచించిచారని తెలి పారు. యువకులు సామాజిక సేవ చేసి దేశ ఉన్నతికి పాటు పడాలని కోరారు.
అంతకు ముందు స్వామి వివేకానంద చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 3కే రన్‌ను ప్రారంభించారు. మెయిన్ రోడ్డు, పూలసెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, రాఘవప్లాజా, వాణిజ్య భవన్‌సెంటర్, శంకర్‌విలాస్ సెంటర్, గాంధీ విగ్రహం నుంచి నిర్మల ఆసుపత్రి రోడ్డు మీదుగా తిరిగి జూనియర్ కళాశాల వరకు 3కే రన్ నిర్వహించారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఆర్డీఓ వి.నాగన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ, నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, వైస్ చైర్మన్ శ్రీరంగం గణేష్, కార్యక్రమ నిర్వాహకులు గోపగాని వెంకటనారాయణ, అంగిరేకుల నాగార్జున, తీకుళ్ల సాయిరెడ్డి, నాగవెళ్లి ప్రభాకర్, కొల్లు మధుసూదన్‌రావు, తహసీల్దార్ జగన్నాథరావు, నాయకులు అబ్దుల్ రహీం, సయ్యద్ సలీం, ఉప్పల సంపత్‌కుమార్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, బండపల్లి పాండురంగాచారి, చల్లమళ్ల నర్సింహ్మ, కుంట్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
యువజన ఉత్సాహం
Published Thu, Sep 12 2013 1:46 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement