విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దామోదర్‌రెడ్డి
సాక్షి, తిరుమలాయపాలెం: దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయని ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అత్యధిక పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని, డబ్బు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని, దేశంలో రాహుల్ ప్రభంజనం నడుస్తుందని భావి ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని, ఖమ్మం ఎంపీ సీటు రేణుకాచౌదరి గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పాలేరులో ఈసారి అత్యధిక మెజార్టీ సాధించబోతున్నామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రాధాకిషోర్, ఆర్.నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనువాస్, సంకీర్త్‌రెడ్డి, అరవిందరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment