సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని, సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఆర్టీసీపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్ సహా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రతీ అంశంపైనా విపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని, పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే కొందరు అత్యు త్సాహంతో సమ్మెకు దిగారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేయగా.. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ఏకంగా రద్దు చేసిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తలసాని వారికి సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment