సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పొలిటికల్ లీడర్‌లే లక్ష్యంగా ఈ దాడులు జరగడం రాజకీయంగా పెను దుమారం రేగింది. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడుల సందర్భంగా కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్ద డ్రామానే జరిగింది.
అయితే, రాష్ట్రంలో ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసే వార్తల్లో నిలిచారు. కాగా, మల్లారెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు చేయించేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను మినహాయింపు ఇస్తాము. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా పన్నులు చెల్లించేలా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకువస్తారు. అప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తాము. కేసీఆర్ నా వెంట ఉన్నంత వరకు నేను ఏ రైడ్లకు భయపడను’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment