సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉండటం మన కర్మ అని, ప్రజలు చేసుకున్న పాపం అని ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ఉండాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరించి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలివేస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో కార్మికులు సమ్మెచేసే పరిస్థితి లేదని వాపోయారు.
జగన్ నిర్ణయం సరైనదే..:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొనగాడు అని నాయిని కితాబు ఇచ్చారు. జగన్ ప్రైవేట్ రంగంలో లోకల్ వారికి 75 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ కూడా అది అమలు చేయాలని కోరారు. 3 రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ బినామిలే అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment