సైబరాబాద్ కమిషనరేట్‌పై బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పునర్విభజనలో భాగంగా ఏర్పాటు చేసిన జోన్లు, డివిజన్లు అశాస్త్రీయంగా ఉన్నాయని, ప్రజల సౌకర్యార్థం తగిన మార్పులు చేయాల ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివా రం సచివాలయంలో హోంమంత్రికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి నేతృత్వంలోని బృందం వినతిపత్రం సమర్పిం చింది.
సైబరాబాద్‌ను తూర్పు, పశ్చిమ కమిషనరేట్లుగా విభజించారని, అయితే జోన్లు, డివిజన్ల ఏర్పాటులో మరింత దృష్టిని పెట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు కోరారు. భువనగిరికి బదులు ఘట్‌కేసర్ జోన్ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారి, ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ కారణంగా ఇది అందరికీ అందుబాటులో ఉంటుందంది. దీనిపై డీజీపీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని మల్లారెడ్డి విలేకరులకు తెలిపారు.
పునర్విభజనలో మార్పులు చేయాలి
Published Sun, Jul 17 2016 1:01 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement