'హైదరాబాద్ నేతల స్వార్థంతో పార్టీ బలి' | party going to un ethical due to hyderabad leaders | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ నేతల స్వార్థంతో పార్టీ బలి'

Published Thu, Jan 21 2016 9:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

party going to un ethical due to hyderabad leaders

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర నేతలు వ్యక్తిగత స్వార్థంకోసం పార్టీని బలిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు, బి-ఫారాల పంపిణీ పూర్తయిన తర్వాత ఆయన సాక్షితో మాట్లాడుతూ బీజేపీలో రాష్ట్ర నాయకులుగా ఉన్న హైదరాబాద్ నేతల వ్యక్తిగత స్వార్థం, స్వంత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపించారు.

హైదరాబాద్, రంగారెడ్డిలో పార్టీ బలంగా ఉన్నా కేవలం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని డివిజన్లనే బీజేపీకి తీసుకున్నారని మల్లా రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని డివిజన్లను తీసుకోవడానికి రంగారెడ్డి జిల్లా పార్టీని బలిపెట్టారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే లేరని, దీనివల్ల పార్టీ బలోపేతానికి తీవ్ర విఘాతమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement