greater elections 2016
-
'రిగ్గింగ్ కోసం ఎంఐఎం రౌడీలతో దాడి చేయించింది'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎంఐఎం నేతలు రౌడీ మూకల్లా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు మొదలు పెట్టినప్పటినుంచి ఎంఐఎం చార్మినార్ ప్రాంతంలో ఎన్నో ఆగడాలు చేస్తోందని జానారెడ్డి అన్నారు. సాక్షాత్తు ఎన్నికల జరిగే రోజున రిగ్గింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నించిందని చెప్పారు. అందుకే హఠాత్తుగా తమ అభ్యర్థిని 2గంటల ప్రాంతంలో అరెస్టు చేయించి పోలీసు స్టేషన్ కు పంపించారని, ఈ విషయం తెలిసి ఆయనను విడిపించేందుకే తమ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అక్కడికి వెళ్లారని జానారెడ్డి చెప్పారు. పోలీసులతో మాట్లాడి, అతడిని విడిపించుకొని బయటకు తీసుకొస్తుండగా, ఎంఐఎం కార్యకర్తలు, గూండాలు దాడికి దిగారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో లా ఆర్డర్ ఉందా లేదా, చట్టబద్ధపాలన చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి చర్యలు ప్రజస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ్ పై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ ను కూడా ఉల్లంఘించి సైకిలు, మోటారు సైకిళ్లతో తిరుగుతూ ఎన్నికల రోజు కూడా ర్యాలీ మాదిరిగా తిరిగిన అసదుద్దీన్ ఓవైసీ, ఆయన అనుచరులపై చట్టబద్ధ చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారో లేదా తన అధికారమే ముఖ్యమని అనుకుంటారో ఆయన తదుపరి చర్యల ద్వారా స్పష్టం అవుతుందని అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సంఘటనను ఖండించారు. ఎన్నికల కమిషన్, పోలీసులు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా చోద్యం చూశాయని అన్నారు. సాక్షాత్తు ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి రౌడీ ముఠాను వేసుకొని అసదుద్దీన్ ఎలా తిరిగారని ప్రశ్నించారు. -
'మేం ఓడితే బీఫ్ మర్చిపోవాల్సిందే'
-
'మేం ఓడితే బీఫ్ మర్చిపోవాల్సిందే'
హైదరాబాద్: ఇటీవల కాలంలో సర్దుమణిగిన బీఫ్ వివాదం మరోసారి రాజుకునే అవకాశం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ అంశానికి మరోసారి తెరలేపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 'మీకో విషయం చెప్తున్నాను.. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే.. మైనార్టీ వర్గ ప్రజానీకమంతా బీఫ్ తినడం మర్చిపోవాల్సిందే' అని అన్నారు. అలా జరగకుండా ఉండాలంటే తమకు ఓటేసి గెలిపించాలని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ సర్కార్ ను ఆయన టార్గెట్ చేశారు. మహారాష్ట్రలో పేద ముస్లింలను, దళితులను టార్గెట్ చేసి బీఫ్ నిషేధించిందని ఆరోపించారు. 'వారు మహారాష్ట్రలో బీఫ్ నిషేధించి ఉండొచ్చు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అధికార బాధ్యతలు చేపట్టి నుంచి భారత్ నుంచి విదేశాలకు బీఫ్ మాంసం ఎగుమతి అమాంతం పెరిగింది, నాకు తెలిసిన సమాచారం మేరకు 17 శాతానికి బీఫ్ ఎగుమతి పెరిగింది. దీనిపై మోదీ ఏం చేస్తారు' అని ఆయన ప్రశ్నించారు. మోదీ సాధారణంగా ఎక్కడ మాట్లాడినా మిత్రో(స్నేహితులు) అనే పదాన్ని ఉపయోగిస్తారని, అయితే, ఆపదం ఎక్కడైనా పనిచేయోచ్చేమోగానీ, హైదరాబాద్‌లో మాత్రం బడా (బీఫ్) ఒక్కటే పనిచేస్తుందని గత వారంలో నిర్వహించిన ర్యాలీలో అన్న విషయం తెలిసిందే. -
టికెట్ రాలేదని తిండిమాని ఆస్పత్రిపాలు
జీడిమెట్ల: గ్రేటర్ ఎలక్షన్లలో టీడీపీ టిక్కెట్ అశించి భంగపడిన రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆరోగ్యం క్షిణించి అస్పత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే జీడిమెట్ల జనప్రియ అపార్ట్మెంట్లో ఉండే సాయి తులసి గత 3 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 2016 గ్రేటర్ ఏన్నికల్లో సుభాష్‌నగర్ డివిజన్ మహిళా రిజర్వేష్‌న్ కాగా ఈ స్థానం నుండి ఆమె పార్టీ టికెట్ అశించారు. గత మూడు సంవత్సరాలుగా ఆమె డివిజన్లో పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ దఫా టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని ఆశించగా పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించారు. అయినప్పటికి పట్టు వదలకుండా పార్టీ ఆఫీస్ వద్ద ఆమె ధర్నా చేసి పోరాడారు. చిట్టచివరకు పొత్తు వికటించగా తనకే బీఫామ్ ఇస్తారని ఆశించగా అనూహ్యంగా టీడీపీ హైకమాండ్ టీడీపీ నేత రంగారావు సతీమణి సుజాతకు బీఫామ్ ఇవ్వడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పటి నుంచి తిండితప్పలు లేకుండా మదన పడుతూ వస్తోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాయితులసి కుప్పకూలి కింద పడిపోయింది. దీంతో కుమారుడు దీపక్, భర్త శ్రీనివాస్ లు వెంటనే సాయి తులసి ని ఐడీపీఎల్ లోని సౌజన్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
'హైదరాబాద్ నేతల స్వార్థంతో పార్టీ బలి'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర నేతలు వ్యక్తిగత స్వార్థంకోసం పార్టీని బలిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు, బి-ఫారాల పంపిణీ పూర్తయిన తర్వాత ఆయన సాక్షితో మాట్లాడుతూ బీజేపీలో రాష్ట్ర నాయకులుగా ఉన్న హైదరాబాద్ నేతల వ్యక్తిగత స్వార్థం, స్వంత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డిలో పార్టీ బలంగా ఉన్నా కేవలం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని డివిజన్లనే బీజేపీకి తీసుకున్నారని మల్లా రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని డివిజన్లను తీసుకోవడానికి రంగారెడ్డి జిల్లా పార్టీని బలిపెట్టారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే లేరని, దీనివల్ల పార్టీ బలోపేతానికి తీవ్ర విఘాతమన్నారు. -
సమరానికి సై...
గ్రేటర్ ఎన్నికలకు శంఖారావం పూరించిన టీడీపీ-బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో నిండిన నిజాం కాలేజీ గ్రౌండ్ సిటీబ్యూరో : గ్రేటర్ హైదారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా టీడీపీ- బీజేపీ మిత్రపక్షాలు సంయుక్తంగా పూర్తించిన ‘ ఎన్నికల శంఖారావం’ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. బల్దియా ఎన్నికల సమరానికి సై అంటూ అగ్రనేతలు చేసిన ప్రసంగాలు పార్టీ శ్రేణులను ఆకట్టుకొన్నాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ టీడీపీ-బీజేపీ మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘గ్రేటర్ ఎన్నికల శంఖారావం సభ’ విజయవంతమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జగత్ ప్రకాశ్‌నడ్డా, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి హాజరయ్యారు. సభకు ప్రత్యేకించి మహిళలను రప్పించడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. నగరంలో 2002నాటి పరిస్థితులను పునరావృతం చేయాలని అగ్రనాయకులు పేర్కొన్నారు. అయితే... వారి ప్రసంగాలకు తగ్గట్టు సభికుల నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో మోత్కుపల్లి నర్సింహులు వంటివారు సభికుల పైనే చలోక్తులు విసిరి... జోష్‌ను తెచ్చేందుకు ప్రయత్నించారు. ‘మీరు ఇలా మౌనంగా ఉండటం వల్లే... కేసీఆర్ మాయ మాటలు చెబుతుండు’ అని సభికుల్లో వేడి రగిలించేందుకు ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తున్నంత సేపు కాస్త హడావుడి కన్పించింది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తింటడు... ఫాం హౌస్‌లో పంటడు’ ముఖ్యమంత్రి చేయాల్సింది ఇదేనా... మీరే చెప్పండి అంటూ సభికులను ప్రశ్నించారు. ‘షహర్ హమారా... మేయర్ హమారా’ అంటూ పలువురు నాయకులు తమ ్రపసంగాల్లో పదేపదే వల్లెవే శారు. టిఆర్ఎస్- మజ్లిస్ పార్టీ నేతల తీరును ఎద్దేవా చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మన్, నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి, మీసాల చంద్రయ్య, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ప్రకాష్‌గౌడ్‌లు చేసిన ప్రసంగాలు ఆకట్టుకొన్నాయి. ఎన్టీఆర్ వేషధారణలో ఉప్పల్‌కు చెందిన వి.రాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉర్రూతలూగించిన పాటలు : కేసీఆర్ పాలనను తూర్పారబడుతూ కళాకారుల పాటలు ఉర్రూత లూగించాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు 18 నెలలైనా నెరవేర్చలేని తీరును ఎద్దేవా చేస్తూ పాడిన పాటలు సభికులను ఆలోచింపజేశాయి. ‘అయ్యా ఓ కేసీఆరూ... నీకెట్ట వాస్తుబాగాలేదు సారూ...’ అంటూ ముఖ్యమంత్రి వాస్తునమ్మకాన్ని ఎద్దేవా చేశారు. ‘దళితుడూ ముఖ్యమంత్రని దండోరా వేశావు... ఊరూరా తిరిగినప్పుడు ఓట్లల్లో జెప్పావు ’ అంటూ దళితుడిని ముఖ్యమంత్రి చేయని తీరును విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వని తీరు, ఇంటికో ఉద్యోగం అన్న హామీ తుంగలో తొక్కిన వైనం, బీసీ కులాల జాబితాలో 26కులాలను తొలగించన వైనం, సీమాంధ్ర విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వని వైఖరిని ఎండగడుతూ కళాకారులు తమ పాటల ద్వారా సభికులకు వివరించారు. -
జనవరి 16 భలే మంచి రోజు
సప్తమి పూట మంచిదని... 16నే ముహూర్తం బాగుంది ఆ రోజే మంచి తిథి.. నక్షత్రం నామినేషన్లకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తొలి రోజు 14 దాఖలు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలిరోజైన మంగళవారం కేవలం 14 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. టికెట్లు ఖరారు కాకపోవడం.. అన్ని పార్టీలూ బలమైన అభ్యర్థుల కోసం భూతద్దం వేసి వెతుకుతుండటం.. మిత్రపక్షాలతో పొత్తులు తేలకపోవడం.. వార్డుల రిజర్వేషన్లలో కొందరి అంచనాలు తలకిందులవడం... పొరుగు వార్డుల్లో ఏది ఎంచుకోవాలో తేలకపోవడం.. వంటివి నామినేషన్ల జాప్యానికి ఓ కారణం. సరైన ముహూర్తం లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో అందరూ ముందుగా ముహూర్త ‘బలం’ చూసుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు నామినేషన్లకు గడువు. దీనిలో ఒక రోజు గడిచిపోయింది. 14, 15 తేదీల్లో సంక్రాంతి సందర్భంగా నామినేషన్లు స్వీకరించరు. మిగిలింది 13, 16, 17 తేదీలు. వీటిలో ఏ రోజైతే బాగుంటుందోనని కొందరు అభ్యర్థులు జ్యోతిష్యులను, సంఖ్యా శాస్త్ర నిపుణులను సంప్రదిస్తున్నారు. వారు చెబుతున్న దాన్ని బట్టి 16వ తేదీ మాత్రమే అత్యద్భుతంగా ఉంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చూసినా 16వ తేదీ శనివారమే మంచి రోజని చెబుతున్నారు. 13న చవితి కావడంతో హిందూ క్యాలెండర్ ప్రకారం మంచిరోజు కాదు. 14 పంచమి మంచిరోజైనప్పటికీసెలవు వల్ల నామి నేషన్ వేయలేని పరిస్థితి. 15 సెలవుతో పాటు షష్టి కూడా మంచి తిథి కాదు. 16నసప్తమి అన్ని విధాలా బ్రహ్మాండమైన రోజని ఇటు హిందూ, అటు ఇస్లాం క్యాలెండర్ల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. 16న సప్తమి, రేవతీ నక్షత్రం కలిసి రావడంతో అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతున్నారు. దీంతో చాలామంది అభ్యర్థులు ఆ రోజే నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. 17నఅష్టమి... మంచిరోజు కాదని...16నే నామినేషన్లకు చాలామంది మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఈలోగా బలమైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి చేయవచ్చునని వివిధ పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. మహిళల రిజర్వేషన్ కారణంగా అవకాశం కోల్పోయిన కొందరు ఆశావహులు తమ కుటుంబానికే టికెట్ కేటాయించాలని అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొందరు తమకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బోరుమంటున్నారు. అవివాహితులు పెళ్లి చేసుకొని తమ అర్ధాంగికి టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇలా వివిధ కారణాలతో దాదాపు 90 శాతం మంది అభ్యర్థులు 16నే నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016వ సంవత్సరం ఎన్నికలకు 16వ తేదీ నామినేషన్ మంచి జ్ఞాపకంగా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు నామినేషన్ కేంద్రాలు కిటకిటలాడనున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1310 మంది పోటీ చేశారు. ఈ సంఖ్య ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారమే మంచి రోజు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నెలవంక దర్శనంతో నెల ప్రారంభమవుతుంది. క్యాలెండర్ ప్రకారం రబ్బీసాని నెల మంగళవారం (జనవరి 12వ తేదీ) ప్రారంభమైంది. ప్రతి రోజూ మంచి రోజే. ఇస్లాం మతంలో బేసి సంఖ్యకు ప్రాధాన్యం ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల గడువును బట్టి... ర బ్బీసాని నెల 3వ తేదీ గురువారం (జనవరి 14) బలమైన ముహూర్తం. ఆ రోజు సెలవు కావడంతో రబ్బీసాని 5వ తేదీ శనివారం (జనవరి 16) నామినేషన్‌కు ముహూర్తం పెట్టుకోవచ్చు. - అబుల్ ఫతే సయ్యద్ బందగి బాషా ఖాద్రీ,జాయింట్ సెక్రటరీ, ఆల్ ఇండియా కుల్ హింద్ జమైతుల్ మాషాయిక్, హైదరాబాద్ 16న శుభ ముహూర్తం ఉత్తరాయణ పుణ్యకాలం 15వ తేదీ సాయంత్రం ప్రారంభమ వుతుంది. 16వ తేదీ సప్తమి, 17న అష్టమి. 17వ తేదీ కంటే 16న ముహూర్తబలం ఉంది. అందుకే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. వీలుపడని వారు 17న అష్టమి రోజు కూడా వేసుకోవచ్చు. - విఠల్ శర్మ -
'హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే'
హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం బీజేపీ-టీడీపీ ఘనతే అని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం నిజాం కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ, టీడీపీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్రం సాయంతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అన్నారు. కేంద్రం నిధులిస్తున్నా టీఆరెఎస్ చెప్పడం లేదని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కు వంద సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.