'ఢిల్లీ పార్టీ.. గల్లీ పార్టీగా మాట్లాడుతోంది'
హైదరాబాద్: బీజేపీపై తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే కాళ్లు, చేతులు విరగ్గొడతామన్నారు. ఢిల్లీలో బీజేపీని చీపురుతో ఉడ్చేశారని.. అదే గతి ఇక్కడ కూడా పడుతుందని నాయిని విమర్శించారు. ఢిల్లీలో పార్టీ.. గల్లీలో పార్టీగా మాట్లాడుతుందన్నారు.
కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో పుట్టగతులుండవన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఏపీకి నీరు వెళ్లకుండా తమరాష్ట్ర పోలీసులే అడ్డుకున్నారన్నారు.