సాక్షి, హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. కాగా నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత)
నాయిని నర్సింహారెడ్డి ప్రస్థానం....
- నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము
- 1944లో నాయిని నర్సింహారెడ్డి జననం
- నాయిని తండ్రి దేవారెడ్డి, తల్లి సుభద్రమ్మ
- నాయిని సోదరుడు మాధవరెడ్డి.. చెల్లెల్లు ధమయంతి, సుధేష్న
- మేనమామ కూతురు అహల్యను వివాహమాడిన నాయిని
- నాయినికి దేవేందర్‌రెడ్డి, సమతా రెడ్డి సంతానం
- పెద్దమునగల్, ఎడవెల్లిలో నాల్గవ తరగతి వరకు చదువు
- 5వ తరగతి నుంచి దేవరకొండలో విద్యాభ్యాసం
- కుటుంబ బాధ్యతలతో హెచ్‌ఎస్‌సీ మధ్యలోనే ఆపేసిన నాయిని
- సొంతూరులో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న నాయిని
- సోషలిస్టు పార్టీకి ఆకర్శితులైన నాయిని
- సోషలిస్టు పార్టీ కేంద్ర నాయకులు రామ్ మనోహర్ లోహియా,..
- రాష్ట్ర నాయకుడు బద్రి విశాల్ పిట్టి మాటతో 1962లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాయిని
- సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు
- వెయ్యి మంది సభ్యులున్న మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఐఎన్‌టీయూసీ నుంచి..
- సోషలిస్టు పార్టీలోకి తీసుకురావడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయిని
- 1969లో సోషలిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయిని
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నాయిని
- ఉద్యమం సమయంలో ఓ 30సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి నాయిని
- 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు
- ప్రముఖ నాయకుడు టి.అంజయ్యపై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం
- ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు
- టీడీపీలో చేరాలని ఎన్టీఆర్ కోరగా తిరస్కరించిన నాయిని
- 1983లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి
- 307 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలుపు
- 1984లో ఉపఎన్నికల్లో జనతాపార్టీ తరపున హిమాయత్‌నగర్ నుంచి ఓటమి
- 1985లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 10,500 ఓట్ల మెజార్టీతో గెలుపు
- 1989లో జనతాదళ్ పార్టీ తరపున పోటీచేసి నాయిని ఓటమి
- 1995లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నుంచి మరోసారి నాయినికి ఆహ్వానం
- కార్యకర్తల ఒత్తిడితో టీడీపీలో చేరిక.. నాయినికి ముషీరాబాద్ టికెట్
- పొత్తులో భాగంగా ముషీరాబాద్ టికెట్ కోసం బీజేపీ పట్టు
- సనత్‌నగర్ నుంచి పోటీచేయాలని నాయినిని కోరిన టీడీపీ
- టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించి ఎన్నికలకు దూరంగా ఉన్న నాయిని
- 2001లో కేసీఆర్ నుంచి నాయినికి ఆహ్వానం
- 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం
- 2004లో టీఆర్‌ఎస్ నుంచి ముషీరాబాద్‌లో పోటీ చేసి గెలుపు
- వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పనిచేసిన నాయిని
- 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment