ట్రేడ్‌ యూనియన్లలో రాజకీయాలొద్దు | Do not politicize trade unions | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ యూనియన్లలో రాజకీయాలొద్దు

Published Tue, May 2 2017 12:41 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

ట్రేడ్‌ యూనియన్లలో రాజకీయాలొద్దు - Sakshi

ట్రేడ్‌ యూనియన్లలో రాజకీయాలొద్దు

మేడే ఉత్సవాల్లో హోంమంత్రి నాయిని

సాక్షి, హైదరాబాద్‌: ట్రేడ్‌ యూనియన్లలో రాజకీయాలకు తావు లేకుండా, పరిశ్రమలు పరిపుష్టం చేసుకొని తద్వారా ఆర్థిక వృద్ధిని సాధించుకునేందుకు కార్మిక సంఘాలు, యాజమాన్యాలు సమష్టిగా కృషి చేయాలని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కార్మిక శాఖ రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే ఉత్సవా ల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అండ దండలతో యాజమాన్యాలు, కార్మికులు, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేశామని, త్వరలోనే ఈ బోర్డు సిఫారసులను పరిశీలించి తుది నివేదికను ఖారారు చేస్తామన్నారు. ముఖ్యంగా యాజమాన్యాలు.. కార్మికులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్న సంక ల్పంతో ప్రభుత్వం కంపెనీలపై చట్టాలను ప్రయోగించడం లేదన్నారు. ఇవే కాకుండా పక్క రాష్ట్రాలు, ముఖ్యంగా ఒరిస్సా నుంచి రాష్ట్రానికి ఇసుక బట్టీలు తదితర యూనిట్లలో పని చేసేందుకు వచ్చే కార్మికుల సంక్షేమానికి హెల్ప్‌ డెస్క్‌ను సోమవారం ప్రారంభిం చామన్నారు. దేశంలో తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా పరిగణిస్తున్నారన్నారు.

మన పరిశ్రమలు తన్నుకెళ్లేందుకు ఏపీ కుట్ర
ఈ ఏడాది లక్షమందికి, వచ్చే రెండేళ్లలో దాదా పు మూడు లక్షల మందికి ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబ డి ఉందని నాయిని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.6 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం కలిగితే రూ.4 లక్షల సహాయం, మహిళా కార్మికులకు ప్రసూతికి రూ.30వేలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం తన్నుకపోయేందుకు కుట్రలు చేస్తోందని, ఈ ప్రమాదం నుంచి బయటపడా లంటే కార్మికులంతా శక్తివంతంగా తయారు కావాలని సూచించారు. ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ... అమెరికాలో వంశపారంపర్య ఆస్తులపై పన్ను ఉంటుందని, అటువంటి విధానం మన దేశంలో తేస్తే ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 90 శాతం కార్మికుల కోసం కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

22 మందికి శ్రమశక్తి అవార్డులు...
ఈ సందర్భంగా 22 మంది వివిధ యూని యన్ల ప్రతినిధులకు శ్రమశక్తి అవార్డులు, 10 కంపెనీలకు బెస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ సి.రాములు నాయక్, రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్‌ సామ వెంకట్‌రెడ్డి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, కమిషనర్‌ మహమ్మద్‌ నదీమ్, ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ కిషన్‌ పాల్గొన్నారు.

సింగరేణి సీఎండీ హర్షం...
మేడే ఉత్సవాల్లో భాగంగా తనకు బెస్ట్‌ మేనే జ్‌మెంట్‌ పురస్కారం ప్రకటించడం పట్ల సింగరేణి బొగ్గు గనుల సంస్థల సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, నాయినికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement