- ఎన్నారైలకు నాయిని పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని అమెరికాలోని భారతీయులకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడంతో పాటు వర్షాలు సమృద్ధిగా పడేందుకు హరితహారం పేరిట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయండి
Published Fri, Jul 8 2016 2:16 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement
Advertisement