Labor unions
-
అద్దె బస్సులతో ఆర్టీసీ ఆగమాగం!
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సులు ఆర్టీసీని కబళించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అద్దె బస్సులు సమకూరితే, ఆర్టీసీ సొంత బస్సుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. క్రమంగా ఇది సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచటంపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని నిధుల వినియోగంపై ప్రభుత్వం అనధికారికంగా పరిమితులు విధిస్తుండటంతో, సొంతంగా కొత్త బస్సులు కొనటం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అద్దె బస్సులకు గేట్లు బార్లా తెరిచేస్తోంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి నిర్వాహకులే నియమిస్తారు. డ్రైవర్ల జీతాల పద్దు తగ్గుతుండటంతో ఆర్టీసీ దీనివైపు మొగ్గు చూపుతోంది. 30 శాతానికి చేరిన అద్దె బస్సులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 17 శాతం మాత్రమే. అద్దె బస్సుల సంఖ్యపై పరిమితి ఉన్నందున, అంతకు మించి వాటిని సమకూర్చుకునేందుకు వీలుండేది కాదు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు బకాయి పడటం, గ్రాంట్లు ఇవ్వకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటి సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సులు 2,800 ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’పథకం కింద సమకూరి హైదరాబాద్ విమానాశ్రయానికి తిప్పుతున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒలెక్ట్రా అన్న సంస్థ అద్దెకిచ్చినవే. అదే సంస్థ ఇటీవల మరో 100 బస్సులు సమకూర్చింది. ఇటీవల ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ మరో 90 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చింది. అలాగే మరో 40 బస్సులు కూడా కొత్తగా వచ్చాయి. వీటిని ప్రారంభించాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం మొత్తం బస్సుల్లో అద్దె బస్సుల వాటా దాదాపు 30 శాతానికి చేరింది. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఆర్టీసీ, అద్దె బస్సుల సంఖ్య చెరి సగం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముంచెత్తనున్న అద్దె బస్సులు హైదరాబాద్‌లో తిరిగేందుకు మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని వచ్చాయి. ఏడాది కాలంలో మరో 400 సమకూరుతాయి. జేబీఎం సంస్థ కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటికి కొన్ని బస్సులే రాగా మరో 400 బస్సులను సమకూర్చాల్సి ఉంది. దశలవారీగా అవి కూడా వస్తాయి. ఇక హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు మొత్తం బ్యాటరీ బస్సులనే తిప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ–డ్రైవ్’పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలంటూ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. దేశవ్యాప్తంగా ఆ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు కేంద్రం 9 నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే ఆర్టీసీ దరఖాస్తు మేరకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయి. తాజాగా మహిళా సంఘాలు 1,000 బస్సులను ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో అద్దె బస్సుల సంఖ్య 8 వేలకు చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ సొంత బస్సులు 6 వేల లోపే ఉంటాయి. అయితే అప్పటికి చాలా బస్సులు పాతబడి తుక్కుగా మారిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా సొంత బస్సులు రాకపోతే ఆర్టీసీ సొంత బస్సుల సంఖ్య 4 వేలకు తగ్గుతుంది. అద్దె బస్సులు భారీగా వస్తున్నందున సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని అంటున్నారు. డ్రైవర్ల నియామకం అంతేనా? ఆర్టీసీలో ప్రస్తుతం డ్రైవర్లకు కొరత ఉంది. దీంతోఇటీవలే దాదాపు 2 వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించి రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలిచ్చి0ది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ వాటి ఊసే లేకుండాపోయింది. భవిష్యత్తులో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతున్నందున సొంత డ్రైవర్ల అవసరం అంతగా ఉండదన్న ఉద్దేశంతోనే ఎంపిక ప్రక్రియను వాయిదావేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థ మనుగడకేప్రమాదం: సంఘాల నేతలు ‘ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య విచ్చలవిడిగా పెరగటం సంస్థకు మంచిది కాదు. భవిష్యత్తులో సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రైవేటీకరణను ప్రేరేపిస్తుంది. గతంలోలాగా అద్దె బస్సుల సంఖ్యపై సీలింగ్ విధించి కావాల్సినన్ని బస్సులను ప్రభుత్వమే కొనాలి..’అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నరేందర్, నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. -
ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీతో కార్మిక సంఘాలు శనివారం భేటీ అయ్యాయి. కార్మిక సంఘాల నేతలతో సీఎండీ అరుణ్ భక్షీ సంచలన విషయాలు చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు రూ.2500 కోట్లు నిధులు విడుదల చేశారన్నది అవాస్తవమని తెలిపారు. నిధుల విడుదల అయినట్టు నాకు సమాచారం లేదు. ఢిల్లీలో ఉక్కు శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం నేను చెప్పలేను. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నా’’ అంటూ సీఎండీ స్పష్టం చేశారు.కాగా, స్టీల్‌ప్లాంట్ సీఎండీతో పోరాట కమిటీ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ముడిసరుకు సరఫరా చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అరకొరగా నిధులు విడుదల చేసినా.. మళ్లీ గడ్డు పరిస్థితి తప్పదని కార్మికులు వివరించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు.. కూటమి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్‌పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం.. స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ
ఉక్కు నగరం (విశాఖ): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది. తమకు అవసరమున్న పోస్టులు, విధివిధానాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు నగర్నార్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖ ద్వారా బయటకు పొక్కాయి. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చేపడుతున్న అనేక పొదుపు చర్యల్లో భాగంగా 500 మంది అధికారులు, ఉద్యోగులను నగర్నార్ ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. తద్వారా ప్లాంట్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యం ప్రకటించింది. దశలవారీగా డిప్యుటేషన్దశలవారీగా పంపనున్న జాబితాలో మొదటి విడతగా 100 మంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్కు యాజమాన్యం నగర్నార్ ప్లాంట్ యాజమాన్యానికి ఈ నెల 11న లేఖ రాసింది. ఆ లేఖపై స్పందిస్తూ నగర్నార్ ప్లాంట్ యాజమాన్యం తమకు కావాల్సిన సిబ్బంది, విధివిధానాలపై విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి లేఖ రాసింది. అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ ఓ నమూనాను పంపింది. అధికారులకు కావాల్సిన విభాగాలు, గ్రేడ్లకు చెందిన సిబ్బంది వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూలు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యుటేషన్ అంశాన్ని మొదటి నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు నగర్నాగర్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఖలోని విధి విధానాల్లో క్లారిటీ లేదని, ఉద్యోగుల వ్యక్తిగత అంగీకారంతో డిప్యుటేషన్ అంటే.. జరిగే పని కాదని ఉక్కు అధికారుల సంఘం (సీ) నాయకులు వ్యాఖ్యానించారు.డిప్యుటేషన్ ప్రతిపాదనను విరమించుకోవాలిస్టీల్ప్లాంట్లో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 12,600 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోంచి కూడా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తామంటే మేం ఎలా అంగీకరిస్తాం. ఉన్న ఉద్యోగులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి సాధించాలి గానీ.. డిప్యుటేషన్‌కు పంపడమేంటి. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. యాజమాన్యం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ -
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్ కేంద్రంగా యూరప్ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్ నాయకులు 8 పని గంటల డిమాండ్‌తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చ డాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్ ఒకటిని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మే డేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! – జంపన్న ‘ మార్క్సిస్ట్–లెనినిస్ట్ నాయకుడు(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే) -
రేపే ‘సింగరేణి’ ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈనెల 27న జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. పాతికేళ్ల కిందట మొదలైన ఎన్నికల పోరు దక్షిణ భారత్‌లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 39 వేల మంది కార్మికులు పని చేస్తు న్నారు. 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట రెండేళ్లు ఉండగా తర్వాత నాలుగేళ్లకు పెంచారు. చివరి సారిగా 2017 అక్టోబర్‌లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాల పరిమితి 2021 అక్టోబర్‌తో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 6న నోటిఫికేషన్ వచ్చినా.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ 6న వెలువడింది. అదేనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు ఈనెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రచారంలో ఉధృతి పెంచాయి. మొత్తం 39,773 మంది కార్మికులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లెందులో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు సా«ధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు. ‘గుర్తింపు’ఎవరికో..? తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్ తొమ్మిది ఏరియాల్లో గెలుపొందగా, ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ.. ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒక దశలో పోటీకి టీజీబీకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురి పెట్టింది. -
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు. -
సింగరేణి ఎన్నికలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గురింపు సంఘం ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న యాజమాన్యం అభ్యర్థనకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని, నవంబర్ 30లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఈ ఎన్నికలకు సహకరించాలని, ఆ మేరకు కార్మిక సంఘాలకు స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమన్న యాజమాన్యం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావాలంటూ యాజమాన్యం గత నెల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. వరుస పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వానికి అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమని వారు పేర్కొన్నట్లు వివరించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. గతంలో అక్టోబర్‌లో నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని తేల్చిచెప్పారు. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం అప్పీల్‌కు వెళ్లింది. అలాగే సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర అప్లికేషన్(ఐఏ) దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రక్రియ మాత్రం కొనసాగించండి.. ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాల(కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి) పరిధిలోని 13 నియోజకవర్గాల్లోని 15 ట్రేడ్ యూనియన్లకు ఎలక్షన్లు అక్టోబర్‌లో నిర్వహించడం సాధ్యం కాదు. ఇందులో మూడు జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. దాదాపు 43,000 మంది ఓటర్లు ఉంటారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌తో పాటు ఇతర పలు శాఖల అధికారులు అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉన్నారు. వీరి సహకారం లేకుండా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. 700 మంది అధికారులు, సిబ్బంది సాయం కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిల్లో కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు మరి కొంత సమయం ఇవ్వాలి’ అని సింగరేణి యాజమాన్యం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్ 27 వరకు సమయం ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తుల కేటాయింపు తదితర ప్రక్రియను మాత్రం కొనసాగించాలని, నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. -
ఈ మార్పు మంచికేనా?
ప్రజాందోళన పెరిగితే దాన్ని నీరుగార్చడానికైనా పాలకులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కనీసం వేసినట్టు కనిపిస్తారు. మూడు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతెన్యాహూ ఆ పనే చేశారు. ప్రభుత్వమే జవాబుదారీ అంటూ ఆ దేశ న్యాయమూర్తులకు ఇప్పటి దాకా అనేక అధికారాలున్నాయి. వాటిని నిర్వీర్యపరిచేలా న్యాయ వ్యవస్థలో మార్పులకు దిగిన ఆయన, చివరకు ప్రజాగ్రహంతో ఆగాల్సి వచ్చింది. రక్షణమంత్రిపై వేటు ప్రకటన గత వారాంతంలో కథలో ఈ కొత్తమలుపునకు దారి తీసింది. ప్రధాని చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘం సమ్మెకు దిగేసరికి, ఆస్పత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విదేశాల్లో ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు – అన్నీ సోమవారం మూతబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, సొంత దేశాధ్యక్షుడితో పాటు అమెరికా సహా అంత ర్జాతీయ సమాజదృష్టి పడడంతో ఒత్తిడి పెరిగి నెతెన్యాహూ మనసు మార్చుకున్నట్టు కనిపించారు. మిత్రదేశమైన అమెరికా సైతం నెతెన్యాహూకు సుద్దులు చెప్పాల్సి వచ్చింది. రక్షణమంత్రి ఉద్వాసన వార్తలందాక కలవరపడి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని ఇజ్రాయెల్‌ను పదే పదే హెచ్చరించింది. మార్పులకు విరామమిచ్చినట్టు నెతెన్యాహూ ప్రకటించగానే, ఆయనను అమెరికా అధ్యక్షుడితో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు అమెరికన్ రాయబారి వెల్లడించడం గమనార్హం. ప్రధానిగా నెతెన్యాహూ పదవి చేపట్టి 3 నెలలు దాటినా, ఇంతవరకూ కలవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు హుటాహుటిన భేటీ జరపనుండడం ఆసక్తికర పరిణామమే. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి. వాషింగ్టన్, జెరూసలేమ్‌ల సైనిక భాగస్వామ్యంపైనే దాని దృష్టి. నిజానికి మార్పుల్ని వ్యతిరేకించిన రక్షణమంత్రిని ఇంటికి పంపి, తన పంతం నెగ్గించుకోవచ్చని నెతెన్యాహూ తప్పుగా అంచనా వేశారు. ఇజ్రాయెలీ సైనికదళాలకు వెన్నెముక లాంటి సైనిక రిజర్వి స్టులు సైతం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో దేశ భద్రతకే ముప్పొచ్చింది. ఎగసిన వ్యతిరేకతకు తలొగ్గి, మార్పులకు సర్కార్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. 73 ఏళ్ళ నెతన్యాహూ మాట నమ్మి, కార్మిక సంఘం సమ్మె విరమించింది. అలా మంగళవారం ఇజ్రాయెలీ వీధులు పైకి ప్రశాంతంగా కనిపించాయి. కానీ, సంక్షోభం పరిష్కారమైందనుకోలేం. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నెతెన్యాహూ జడ్జీల ఎంపిక వ్యవస్థపై పట్టు బిగించే ప్రతిపాదిత బిల్లుకు పూర్తిగా స్వస్తి పలికారనుకోలేం. మిత జాతీయవాదులు, ఛాందసులు, అతి మితవాదుల కలగాపులగమైన సంకీర్ణ సర్కారు ఆ బిల్లు తుది రూపాన్ని మంగళవారం పరిశీలనకు చేపట్టడమే అందుకు ఉదాహరణ. జనం ఎన్నుకొనని శిష్టవర్గీయుల చేతిలో, వామపక్షం వైపు మొగ్గే వ్యవస్థగా జ్యుడీషియరీ మారిందనేది ప్రభుత్వ ఆరోపణ. సుప్రీం కోర్ట్ నిర్ణయాల్ని సైతం సాధారణ మెజారిటీతో పార్లమెంట్ కొట్టిపారేసే వీలు కల్పించాలనీ, జడ్జీల నియామక సంఘంలో ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలనీ, న్యాయ సలహాదారుల సలహాను మంత్రులు శిరసావహించాలనే చట్టాన్ని ఎత్తేయా లనీ... ఇలా పలు మార్పులు చేద్దామని ప్రభుత్వ యోచన. కానీ, ఈ మార్పులు చివరకు న్యాయ వ్యవస్థను నీరుగార్చి, పాలకుల వైపే మొగ్గుతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళన. ప్రభుత్వం మాత్రం పాలకులకు మరింత జవాబుదారీగా ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలనే తమ ప్రయత్నం అంటోంది. దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామిక మని నెతెన్యాహూ బృందం వాదిస్తోంది. వెరసి, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు కథ మళ్ళీ పైకి రావచ్చు. ఈ 2 నెలల జాప్యంతో భారీ పౌర నిరసనపై నీళ్ళు జల్లి, ఏకాభిప్రాయం పేర ఏదో ఒక రూపంలో బిల్లుకు ముద్ర వేయాలనేది పాలకుల ప్రస్తుత వ్యూహం. అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం నెతెన్యాహూ స్వభావం కాబట్టి, కుట్రలకు ఆయన తెర దించేవరకూ ప్రజా ఉద్యమంతో ఒత్తిడి పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో నెతెన్యాహూకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రాజకీయ బుద్ధి సూక్ష్మతకూ, అవసరమైతే రాజీపడే నేర్పుకూ గట్టి దెబ్బే తగిలింది. పరస్పర విరుద్ధ ఎన్నికల హామీ లిచ్చిన పార్టీల్ని సైతం కలుపుకొని, పంచకూట కషాయమైన సంకీర్ణ సర్కార్‌ను ఆయన ఏర్పాటుచేసి నిండా 4 నెలలైనా కాలేదు. న్యాయవ్యవస్థను తిరగదోడే పని ఆయన కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఆపేస్తే సంకీర్ణంలో అతి మితవాద పక్షాలు వైదొలగుతాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. దీన్నెలా దాటతారన్న దాన్నిబట్టి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో తేలుతుంది. వరుస సంక్షోభాలతో, గత నాలుగేళ్ళలో 5 సార్లు ఎన్నికలతో ఇజ్రాయెల్ రాజకీయ అని శ్చితితో సతమతమవుతోంది. మళ్ళీ వెంటనే మరో ఎన్నికను భరించలేని ఇజ్రాయెల్‌కూ, అక్కడి ప్రజాస్వా మ్యానికీ తాజా సంక్షోభం మరో అగ్నిపరీక్ష. కాకపోతే మూడు నెలలుగా లక్షలాది ప్రజలు వీధికెక్కి, తెలుపు – నీలం రంగుల జాతీయ పతకాన్ని చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా హింసాకాండ చెలరేగకపోవడం, చుక్క రక్తం చిందకపోవడం చెప్పుకోవాల్సిన విశేషం. జీవం తొణికిస లాడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ప్రజలకు దక్కింది తాత్కాలిక విజయమే కావచ్చు. లక్షలాది జనం పార్లమెంట్ ముంగిట చేస్తున్న ‘డెమోక్రాషియా’ (ప్రజాస్వామ్యం) నినాదాలు, ప్రతిధ్వనిస్తున్న జెరూసలేమ్ వీధుల ప్రజాచేతన... ప్రపంచానికి ఆశాకిరణాలు. -
గల్ఫ్ గోడు వినిపించేందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా గల్ఫ్ వలస కార్మిక సంఘాలు అడుగులు వేస్తున్నాయి. తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తమకంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ అవసరమని ఆయా సంఘాలు అంటున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నవారు సుమారు 15 లక్షల మంది ఉంటారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు, గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చి స్థానికంగానే ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే గల్ఫ్‌తో ముడిపడి ఉన్నవారి సంఖ్య కోటి ఉంటుందని అంచనా. వీరు రాష్ట్రంలోని 30 శాసనసభ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువమంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం వారి సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీలు.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీరి సమస్యలేమిటి? ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది కార్మికులు రాష్ట్రం నుంచి వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నా.. వారి సంక్షేమాన్ని పట్టించుకునే ఓ ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఉపాధిపై ఆశతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు వెళుతున్నవారు పలు సందర్భాల్లో వీసా మోసాలకు గురవుతుండటంతో పాటు, అక్కడ ఆశించిన విధంగా లేక అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాల తరఫున ఎలాంటి సాయం అందడం లేదు. కార్మికులు చనిపోతే ప్రభుత్వాలు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. మృతదేహాలు స్వదేశం చేరుకోవడం కష్టమవుతోంది. కొన్నిసార్లు అక్కడే అంత్యక్రియలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, ఎన్ఆర్ఐ పాలసీ లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి వినిపిస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తున్నా.. విదేశాలకు వలస వెళ్లిన వారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కేవలం గల్ఫ్ వలస కార్మికుల ద్వారానే ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేరుతోంది. అందువల్ల గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత నిధులను కేటాయించాలనే డిమాండ్ ఉంది. అయితే ఏ బడ్జెట్లోనూ నిధులు కేటాయించిన సందర్భాలు లేవు. దీంతో ఎన్నో ఏళ్లుగా విసిగి వేసారిపోయిన గల్ఫ్ వలస కార్మికులందరినీ ఒక్క తాటిపై తీసుకురావడానికి కార్మిక సంఘాలు రాజకీయాల బాట పడుతున్నాయి. తమ లక్ష్యాలను చేరుకోవాలంటే తాము సభ్యులుగా ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం తప్పనిసరి అని ముక్త కంఠంతో చెబుతున్నాయి. హుజూరాబాద్‌తో షురూ హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటడానికి గల్ఫ్ వలస కార్మికుల సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోషియేషన్ల అధ్యక్షులు స్వదేశ్ పరికి పండ్ల, నంగి దేవేందర్‌రెడ్డిల నాయకత్వంలో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొదటగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. దశల వారీగా గల్ఫ్ వలస కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దళిత బంధు మాదిరిగానే గల్ఫ్ బంధు ను అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు గల్ఫ్ వలస కార్మికుల కోసం రాజకీయ పార్టీని స్థాపించడం వల్ల మంచే జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం గల్ఫ్ కార్మికులకు హామీల ఎర వేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడం లేదు. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు రాజకీయ పార్టీ ద్వారానే గుర్తింపు గల్ఫ్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్నా రు. ఇప్పుడు వారి సమస్యలే ఎజెండాగా రాజకీయ పార్టీ స్థాపించడమనే ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామం. గల్ఫ్ కార్మికులకు గుర్తింపు లభించాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. – నంగి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా సత్తా ఏమిటో చూపిస్తాం గల్ఫ్ కార్మికుల సత్తా ఏమిటో ప్రభుత్వాలకు తెలియజేయడానికే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం. కార్మికుల కుటుంబాలను ఏకం చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం. మా సత్తాను చాటి చెబుతాం. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ -
కార్మిక సంఘాలు ఎందుకు తగ్గుతున్నాయి?
ఇదివరకే తగ్గుముఖం పట్టిన యూనియన్లను సర్వీసు రంగ పెరుగుదల, కాంట్రాక్టు కార్మికులు, ఇప్పుడు కొత్త కార్మిక చట్టాలు మరింత ప్రాధాన్యత లేనివిగా మార్చాయి. ఈ రోజుల్లో ఇండియాలో కార్మిక సంఘాల గురించి పెద్దగా వినబడటం లేదు. సరళీకరణకు ముందటి పారిశ్రామిక మార్కెట్లో కార్మిక లేదా ట్రేడ్ యూనియన్లు చాలా ప్రాధా న్యత కలిగివుండేవి. కానీ కార్మిక మార్కెట్లో ఇటీవల వస్తున్న భారీ మార్పులవల్ల అవి వాటి ప్రాసంగికతను కోల్పోతున్నాయి. సంఘంగా జట్టుకట్టడం ఎందుకు తగ్గు తుందో తెలుసుకోవాలంటే, కార్మిక సంఘాల ఆర్థిక శాస్త్రాన్ని తెలుసుకోవడం అవశ్యం. డిమాండ్, సప్లయ్ రెండూ కూడా ఒక లేబర్ మార్కె ట్లో సంఘానికి చోటివ్వగల ఉద్యోగాలను నిర్ణయిస్తాయి. అధిక వేతనం, నిరుద్యోగిత లేకుండా చేయడాన్ని గనక యూనియన్ వాగ్దానం చేస్తే కార్మికులు యూనియన్ కాగ లిగే ఉద్యోగాలను డిమాండ్ చేస్తారు. కార్మికశక్తిని వ్యవస్థీ కృతం చేయడానికయ్యే ఖర్చులు, కొన్ని తరహా యూని యన్ కార్యక్రమాలను నియంత్రించే లేదా నిషేధించే చట్టసంబంధ వాతావరణం, ఉమ్మడి బేరసారాల్ని ఎంత బలంగా కంపెనీ నిరోధించగలదన్న సంగతి, సంస్థకు వచ్చే అధిక లాభాలను యూనియన్ ఎంత సమర్థతతో పొంద గలదు– అన్నవి సప్లయ్లవైపు కారకాలు అవుతాయి. నిర్మాణం, తయారీ, రవాణా లాంటి రంగాలు కార్మిక సంఘాలుగా కూడటానికి అనువుగా ఉంటాయి. వ్యవ సాయం, ఆర్థిక రంగాల్లో ఈ వీలు తక్కువ. అత్యధిక అవుట్‌పుట్‌ను కొన్ని కంపెనీలే ఉత్పత్తి చేసే పక్షంలోనూ సంఘాలకు వీలుంటుంది. ఎందుకంటే కంపెనీల మార్కెట్ శక్తి చాలావరకు కార్మిక సంక్షేమానికి నష్టకరం గానే ఉంటుంది కాబట్టి. అలాంటి చోట సంస్థలు పొందే అధిక లాభాల్లో కొంత వాటాను యూనియన్లు తమ కార్మి కుల కోసం రాబట్టగలవు. స్థూల ఆర్థిక పరిస్థితులు, న్యాయ వాతావరణం కూడా సంఘాలు కాగలగడాన్ని ప్రభావితం చేస్తాయి. నిరుద్యో గిత శాతం ఎక్కువగా ఉండి, కార్మికులు ఉద్యోగ అభద్రత నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు సంఘం ఏర్పడా లన్న డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, వాస్తవిక వేతనాలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా సంఘంగా కూడే శాతం పెరుగుతుంది. ఇక సంస్థ– యూనియన్ సంబంధాన్ని నియంత్రించే కార్మిక చట్టాలు కూడా యూనియన్ కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ముందు చెప్పినవన్నీ కూడా 1960–70 మధ్య కాలంలో యూనియన్లు వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. సరళీకరణ అనంతర దశలో అన్ని పరిశ్రమల్లోనూ కార్మిక సంఘాలు తగ్గిపోవడానికి చాలా కారణాలు పని చేశాయి. ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మార్పులకు లోనై సర్వీసు రంగం ముందువరుసలోకి వచ్చింది. ఈ మూడవ రంగంలో యూనియన్లు తమ ప్రాధాన్యతను దాదాపుగా కోల్పోయాయి. సంఘంగా జట్టు కాలేని ఉద్యోగాలను సంఘపు ఉద్యోగాలుగా మార్చడం కష్టతరం అవుతున్న కొద్దీ కూడా యూనియన్ల శాతం తగ్గిపోయింది. పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుండటం కూడా కార్మిక సంఘాల పాత్రను పరిమితం చేస్తోంది. గత కొన్ని దశా బ్దాలుగా ఎన్నో వస్తూత్పత్తి సంస్థలు కార్మిక హక్కులకు రక్షణ కల్పించే కార్మిక చట్టాలను తప్పించుకోవడానికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను నియమించుకు న్నాయి. అనిశ్చితి కలిగిన కాంట్రాక్టు గుణంవల్ల ఈ కార్మి కులు ఒక సంఘంగా ఏర్పడలేరు. 2020 వరకూ కూడా ఈ కారణాలు కార్మిక సంఘా లను దాదాపుగా ప్రభావశీలం కానివిగా మార్చేశాయి. దీనికితోడు గతేడాది కేంద్ర ప్రభుత్వం శాసనం చేసిన కొత్త కార్మిక చట్టాలు వారి సమస్యలను మరింత పెంచాయి. ఎన్నో వెసులుబాట్లతో కూడిన ఈ చట్టాలు ఇక యూని యన్లను ఉండీ లేనట్టుగా మార్చేశాయి. ఉదాహరణకు, మేనేజ్మెంట్తో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో సమ్మె అనేది ఒక గట్టి ఆయుధంగా ఉండేది. కానీ కాలక్రమంలో చట్టాలు, విధివిధానాలు కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్ల గలిగే శక్తిని తీవ్రంగా నీరుగార్చాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(ఐఆర్సీ) 2020లో ప్రభుత్వం సమ్మెల మీద చాలా ఆంక్షలను విధిస్తూ, లేఆఫ్‌లు, ఉద్యోగుల తగ్గింపు విషయంలో మాత్రం పరి శ్రమల వైపు మొగ్గుచూపింది. దీనివల్ల ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తీసుకోవడం, తీసేయడం (హైరింగ్ అండ్ ఫైరింగ్) సులభతరం అవుతుంది. ఐఆర్సీ ప్రతిపాదన ప్రకారం, ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఏ వ్యక్తి కూడా 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా; ట్రిబ్యునల్ లేదా నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ముందు వాదనలు పెండింగులో ఉన్నప్పుడూ; ఆ వ్యవహారం ముగిసిన 60 రోజుల వరకూ కూడా సమ్మెకు దిగకూడదు. గతంలో కార్మికులు రెండు నుంచి ఆరు వారాల నోటీసు ఇచ్చి సమ్మెకు దిగగలిగేవాళ్లు. ఇప్పుడు మెరుపు సమ్మెలు చట్టవ్యతిరేకం. మొదటిసారిగా కార్మిక సంఘాలను అధికారికంగా గుర్తించిన ఐఆర్సీలో, సంప్రదింపుల యూనియన్ లేదా సంప్రదింపుల సమితి పేరుతో కొత్త భావనను పరిచయం చేశారు. ఒకవేళ ఆ కంపెనీలో ఒకే యూనియన్ కర్తృత్వంలో ఉన్న పక్షంలో, దాన్ని కార్మికుడి తరఫున సంప్రదింపులు జరిపే ఏకైక యూనియన్‌గా కంపెనీ గుర్తిస్తుంది. ఎక్కువ సంఘాలు గనక ఉనికిలో ఉంటే, కంపెనీ హాజరు పట్టీలోని 51 శాతం ఉద్యోగులతో సంబంధం ఉన్నది మాత్రమే కార్మి కుడి తరఫున చర్చలు జరిపే ఏకైక యూనియన్ అవు తుంది. ఒకవేళ ఏ యూనియన్లోనూ సంస్థ హాజరు పట్టీ లోని 51 శాతం ఉద్యోగులు లేనిపక్షంలో ఆ సంస్థే ఒక చర్చల సమితిని నియమిస్తుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు ఎలా కార్మికుల హక్కులను కాపాడతాయి అనేది స్పష్టంగా తెలియకపోయినా, వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడంలోనూ, కాంట్రాక్టు లేబర్‌ను పెంచడంలోనూ మాత్రం పని కొస్తాయి. కాంట్రాక్ట్ లేబర్లకు సంబంధించిన నియమావళి మరింతగా కార్మిక సంఘాల ఉనికిని కుంచింపజేస్తోంది.అయితే ఈ కొత్త తరం నవీన ఆర్థిక వ్యవస్థలో కూడా కార్మిక సంఘాలు ప్రాధాన్యత గల పాత్ర పోషించే అవ కాశం ఉంది. ఆఖరికి భారీ ఏనుగుల్లాంటి అమెజాన్, గూగుల్లోనూ యూనియన్లు ఉన్నాయి. ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి కార్మిక సంఘాలు కొత్త వ్యవహార పద్ధతు లను అవలంబించాలి, సాంకేతికంగా తమను కాలాను గుణంగా మార్చుకోవాలి, రాజకీయంగా తక్కువ ప్రభా వితం కావాలి. అలాగే పాత ప్రపంచ సంప్రదాయాలు, పనితీరు విషయంలో పూర్తి భిన్నంగా ఉన్న కొత్త తరం కార్మికుడి పరిభాషను మాట్లాడాలి. -సీతాకాంత్ పాండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఐఐటీ భిలాయ్ -
ప్రైవేటీకరణను ఆపాల్సిందే..
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం భేషజానికి పోకుండా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి.. కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ర్యాలీలో కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, సి.హెచ్.నర్శింగరావు, జె.వెంకటేశ్వరరావు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కె.ఎస్.ఎన్.రావు, వై. మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ కార్మికులు పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో లాభదాయక బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 6 నుంచి 10 బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. వీటిని కేటాయిస్తే రానున్న ఐదేళ్లలో సింగరేణి ఏడాదికి 85 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో గుర్తింపు కార్మిక సంఘం నేతలతో జరిగిన 37వ సీఎండీ స్థాయి స్ట్రక్చర్డ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడతూ రానున్న 5 ఏళ్ల కాలంలో బొగ్గు పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కోనుందని, 50కి పైగా ప్రైవేటు బొగ్గు సంస్థలతో సింగరేణి, కోలిండియా సంస్థలు పోటీ పడాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకుంటేనే మార్కెట్లో నిలబడి మనుగడ సాధించగలమని తెలిపారు. సింగరేణి సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్‌తోపాటు సోలార్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 130 మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 80 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. సంస్థ మనుగడ, వృద్ధికి సహకరించాలి.. కార్మికులకు కంపెనీకి సంబంధించిన వాస్తవాలు వివరించాలని, తద్వారా నిర్మాణాత్మక ఆలోచనలతో కంపెనీని ముందుకు తీసుకుపోవాలని కార్మికులకు, కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ఎప్పుడూ సానుకూల వైఖరితోనే ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో అనేక దీర్ఘకాలిక సమస్యలపై పలు చారిత్రక ఒప్పందాలు చేసుకుని అమలు చేసిందని తెలిపారు. ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘంతో కొత్త కేడర్ స్కీం, బదిలీ రెగ్యులరైజేషన్, అలవెన్సుల పెంపుదల వంటి వాటిపై చారి త్రక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఒప్పం దాల్లో అన్ని అంశాలు వెంటనే అమలు చేశామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులు దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలిచ్చామని తెలి పారు. సీఎండీ ముందు డిమాండ్లు.. గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిరియాల రాజి రెడ్డి మాట్లాడుతూ దేశంలో నంబర్ 1గా నిలిచిన సింగరేణిని ఇలాగే ముందుకు తీసుకెళ్లడంలో కార్మికులను సమాయత్తం చేస్తామన్నారు. పెర్కు మీద ఇన్‌కంటాక్స్ రీయింబర్స్మెంట్, సర్ఫేస్కు అన్‌ఫిట్ మీద వచ్చిన ఉద్యోగులకు డిపెండెంట్ ఉద్యోగాల అవకాశం, సీపీఆర్ఎంఎస్ స్కీంకు డబ్బు చెల్లింపును కార్మికుడి ఇష్టానికి వదిలేయడం వంటి డిమాండ్లను కార్మిక నాయకులు వినిపించారు. -
ఆర్టీసీకి మొండిచెయ్యేనా!?
సాక్షి, అమరావతి: తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం ఆదుకోకుంటే దాని మనుగడకు పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏపీఎస్ ఆర్టీసీలో నెలకొంది. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటకలలో ప్రజా రవాణా వ్యవస్థకు అక్కడి ప్రభుత్వాలు ఊతమిస్తున్నా ఇక్కడ ఆ ఛాయలేమీ కనిపించడంలేదు. మోటారు వాహన చట్టం పన్ను మొత్తం భరించడంతోపాటు ఇంధనంపై వ్యాట్ శాతం కూడా పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు భరిస్తున్నాయి. నష్టాలు వస్తే బడ్జెట్లో కేటాయింపులు చేసి ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నాయి. కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ బాగోగులేవీ పట్టడంలేదు. సంస్థను ప్రభుత్వం ఆదుకోవాలని, దాని మనుగడ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) స్పష్టంచేసినా సర్కారులో ఎలాంటి చలనంలేదు. ఏటా ఏఎస్ఆర్టీయూ స్టడీ టూర్‌కు రాష్ట్ర అధికారులను ఎంపిక చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు పంపుతున్నా.. అక్కడి సంస్కరణలను ఏ మాత్రం అందిపుచ్చుకోవడంలేదు. దీంతో ఏ ఏటికాయేడు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.460 కోట్లు వరకు నష్టాలను మూటగట్టుకుంది. కార్మికుల పనితీరుతో గతేడాది కంటే రూ.400 కోట్ల అధికంగా ఆదాయం వచ్చిందని, ఆక్యుపెన్సీ రేషియో 82 శాతానికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ, నష్టాలను పూర్తిగా అధిగమించి, కార్మికులకు మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలంటే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే మార్గమన్న డిమాండ్‌ను ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 50 శాతం ఫిట్మెంట్ ప్రధాన డిమాండ్లతో ఈ నెల 6 నుంచి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసిచ్చాయి. అయితే, సర్కారు ఇంతవరకు సమస్యల పరిష్కారంలో ఎలాంటి చొరవ చూపలేదు. అలాగే, గతేడాది ఆర్టీసీ ఛైర్మన్, అధికారులు గుజరాత్ వెళ్లి అక్కడ ప్రజా రవాణా వ్యవస్థను అధ్యయనం చేశారు. ఇతర రాష్ట్రాలు, ఆస్ట్రేలియా అధ్యయన నివేదికలను ఆర్టీసీ అధికారుల బృందం యాజమాన్యానికి, ప్రభుత్వానికి అందించినా ఇంతవరకు సర్కారు పట్టించుకోలేదు. ఇలా అయితే సంస్థ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని ఏఎస్ఆర్టీయూ పేర్కొన్నా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంవీ ట్యాక్స్‌నూ తగ్గించాలి మోటారు వాహన పన్ను ఆర్టీసీకి భారంగా పరిణమించడంతో పలుమార్లు పన్ను తగ్గించాలని కార్మికులు, యాజమాన్యం ప్రభుత్వానికి విన్నవించినా ఫలితంలేదు. గతంలోనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంవీ ట్యాక్స్ ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దానిని ఏడుకు తగ్గించారు. ప్రస్తుతం మరింత నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ ఇంకా తగ్గించాలని కార్మికులు కోరుతున్నారు. పన్ను భారంవల్ల ఆర్టీసీ ఏటా రూ.300 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. అదే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే పన్ను భారం ఉండదు. ఆస్ట్రేలియాలో ఇలా.. - రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రజా రవాణా వ్యవస్థకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏకంగా 80 శాతం నిధుల్ని రాయితీ రూపంలో అందిస్తోంది. - అక్కడి ప్రజా రవాణా డ్రైవర్లు సిమ్యులేటర్‌పై డ్రైవింగ్ నేర్చుకుని రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సున్నా శాతం ప్రమాదాలను నమోదు చేస్తున్నారు. - అక్కడి ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. - బస్ డిపోల పర్యవేక్షణ, టికెట్ టెక్నాలజీ, ట్రాన్స్‌లింక్ మాత్రం బస్ డిపోల అధికారులు నిర్వహిస్తారు. - లాభనష్టాలతో బస్ డిపోల అధికారులకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆర్టీసీకి మొత్తం ఉన్న నష్టాలు :రూ.3,700 కోట్లు - ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఉన్న నష్టాలు : రూ.460 కోట్లు - ఆర్టీసీలో గతేడాది వచ్చిన ఆదాయం : 5,500 కోట్లు - కార్మికులవల్ల గతేడాది కంటే పెరిగిన ఆదాయం : రూ.400 కోట్లు - 50 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏటా అదనపు భారం : రూ.1,500 కోట్లు - 20 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏటా పడే భారం : రూ.650 కోట్లు -
మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా... ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు తెలిపాయి. ఈ వివరాలను ఐడీబీఐ బ్యాంకు బీఎస్ఈకి తెలియజేసింది. సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. అయితే కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. బీవోబీ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చింది. ప్రైవేటు రంగ కరూర్ వైశ్యా బ్యాంకు సైతం ఉద్యోగుల సమ్మె కారణంగా తమ కార్యకలాపాలకు విఘాతం కలగొచ్చని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగులు గత నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు సమ్మె చేపట్టారు. -
ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్లలో గోల్మాల్?
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వ్యవహారం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. అయినవారికి కట్టబెట్టేందుకే యాజమాన్యం టెండర్ల నిబంధనల్లో మార్పులు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల గడువు పొడిగించేందుకు.. పాత బస్సులను తిప్పుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం అనుమతించడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సుల్లో సింహభాగం ప్రభుత్వంలో కీలక మంత్రి బినామీవేననే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా అద్దె బస్సులకు టెండర్లు పిలిచినప్పుడు కొత్త బస్సులను తీసుకునేందుకు మాత్రమే యాజమాన్యం అనుమతివ్వాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా 2014 నుంచి కొనుగోలు చేసిన బస్సులనూ అనుమతించేలా టెండర్ల నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో బస్సులు కొనుగోలు చేసి కిస్తీలు కట్టని వాటిని ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేశాయి. 2014 నుంచి ఇప్పటివరకూ ఇలాంటి బస్సులు 400 వరకు ఉన్నాయి. వీటిని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుకునేలా ఓ ఫైనాన్స్ సంస్థ ఆర్టీసీ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని, అందువల్లే పాత బస్సులను టెండర్లలో అనుమతిస్తూ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత బస్సుల్ని అనుమతించడం ద్వారా బస్సుల ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. అద్దె ప్రాతిపదికన 250 బస్సులకు టెండర్లు ఆర్టీసీలో రెండు విడతలుగా అద్దె ప్రాతిపదికన 250 బస్సుల్ని సమకూర్చుకునేందుకు యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దఫా 150 బస్సులకు, రెండో దఫా మరో వంద బస్సులకు టెండర్లు పిలిచింది. మొదటి విడతలో 50 బస్సులకు మాత్రమే టెండర్లు ఖరారు చేశారు. ఈ 50 బస్సుల్లోనూ 20 బస్సులకు మాత్రమే అద్దె బస్సుల నిర్వాహకులు కొత్త ఛాసిస్ నెంబర్లు ఆర్టీసీకిచ్చారు. మిగిలిన 30 బస్సులను ఆర్టీసీలో తిప్పుతారా లేదా? అన్నది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. రెండో దఫా పిలిచిన వంద బస్సుల టెండర్లలోనూ యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు.. సొంతంగా బస్సుల్ని సమకూర్చుకోకుండా అద్దె బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ఆర్టీసీ తాపత్రయపడడంపైనా విమర్శలు వస్తున్నాయి. టెండర్ల ఖరారుకు వాయిదాల పర్వం అద్దె బస్సుల టెండర్ల ఖరారుకు ఆర్టీసీ వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. టెండర్ల దాఖలుకు గడువు ముగిసినా మంగళవారం వరకు గడువిచ్చింది. పాత బస్సులను తిప్పేందుకు అనుమతివ్వడం.. అదీ ఏళ్ల కిందట సీజ్ చేసిన బస్సుల్ని టెండర్ల ద్వారా తీసుకునేందుకు యాజమాన్యం కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. దీనిద్వారా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకుల భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చేసిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
-
ప్రగతి చక్రం.. తిరోగమనం!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో సిబ్బంది సంఖ్యను యాజమాన్యం ప్రతిఏటా గణనీయంగా తగ్గిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఆర్టీసీలో 2011–12లో 64,639 మంది ఉద్యోగులు పని చేసేవారు. ఈ ఏడాది జూన్ నాటికి ఈ సంఖ్య 54,489కు పడిపోయింది. అంటే దాదాపు 10 వేల మందికి పైగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇంకా చాలామంది ఉద్యోగులను తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అవసరానికి మించి ఉన్నారట! రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించారు. గత రెండేళ్లలోనే 7,317 మంది ఉద్యోగుల కుదింపు జరిగింది. సంస్థలో సిబ్బంది అవసరానికి మించి ఉన్నారనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించడానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పదవీ విరమణలతో ఖాళీ అయ్యే పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. 2015–16లో సంస్థలో 59,372 మంది ఉండగా, కేవలం ఏడాది కాలంలో ఆ సంఖ్య 56,592కి తగ్గిపోయింది. గత మూడేళ్ల కాలంలో 650 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 350 మంది కాంట్రాక్టు కండక్లర్లను తొలగించారు. గత ఆరేళ్లలో ఆర్టీసీలో 9,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అంతేనా? ఆర్టీసీలో కారుణ్య నియామకాలను యాజమాన్యం నిలిపివేసింది. ప్రస్తుతం దాదాపు 1,500 కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయడం లేదు. సంస్థలో చివరిసారిగా 2007లో రిక్రూట్మెంట్లు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్లుగా ఖాళీల భర్తీ ఊసే ఎత్తడం లేదు. అమలు కాని 60 ఏళ్ల వయో పరిమితి ఆర్టీసీలో పదవీ విరమణ వయసు పెంపు విషయంలో టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం పెంపును వర్తింపజేయడం లేదని మండిపడుతున్నారు. సంస్థలో పదవీ విరమణ వయోపరిమితి పెంపును అమలు చేస్తే సిబ్బంది కొరత కొంతవరకు తీరుతుందని అంటున్నారు. అధికార పార్టీ నేతలకు ఉపాధి కేంద్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని టీడీపీ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది. సంస్థలో ఖాళీలను భర్తీ చేయకపోగా, అధికార పార్టీ నేతల కోసం జోనల్ ఛైర్మన్ల వ్యవస్థను పునరుద్ధరించింది. వారికి ఛాంబర్లు, ఆర్భాటాల కోసం రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్టీసీలో ఆశ్రయం పొందుతున్న టీడీపీ నేతల హంగూ ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న నిధులతో ఎన్నో కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చని కార్మికులు చెబుతున్నారు. సిబ్బందిని కుదించడం దారుణం ‘‘నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఆర్టీసీలో సిబ్బంది సంఖ్యను కుదించడం అన్యాయం. గత రెండేళ్లలోనే 6,000 మందిని తొలగించారు. సంస్థకు నష్టాలు వస్తే ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి గానీ ఉద్యోగులను తొలగించడం దారుణం. జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామంటున్నారు. విమానాల్లో తిరిగేది పేదలు కాదుకదా. పేదల కోసం బస్సులు నడిపే ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచాలి’’ – పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఈయూ ప్రైవేటీకరణకు సర్కారు కుట్ర ‘‘ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అందుకోసమే సంస్కరణల పేరుతో సిబ్బందిని తొలగిస్తోంది. టిమ్ మిషన్లు, ఓడీ డ్యూటీలు ప్రవేశపెట్టి సిబ్బంది సంఖ్యను తగ్గిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 డిపోలకు మేనేజర్లు కొరత ఉంది. బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచి ఆర్టీసీని బలోపేతం చేయాలి’’ – సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్‌డబ్యూఎఫ్ -
సింగరేణిలో కొత్త కేడర్
సాక్షి, హైదరాబాద్: దశాబ్ద కాలంగా నలుగుతున్న సింగరేణి ఉద్యోగుల కేడర్ స్కీం సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ఉద్యోగులకు కొత్త కేడర్ స్కీం అమలు, 11 రకాల అలవెన్సులను 30 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు, 2017 డిసెంబర్ వరకు బదిలీ వర్కర్లుగా పనిచేసిన 900 మంది కార్మికులను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం మధ్య గురువారం జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల 20 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నట్లు సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందాలను సెప్టెంబర్ 1 నుంచి అమలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు కార్మిక సంఘం విజ్ఞప్తి మేరకు కార్మిక సంఘాలు, అధికారుల కమిటీతో కోలిండియాలో అమలు చేస్తున్న కేడర్ స్కీంపై యాజమాన్యం అధ్యయనం జరిపించి కొత్త కేడర్ స్కీంకు రూపకల్పన చేసింది. 14 కేడర్లలో 35 హోదాలకు వర్తింపు సింగరేణిలోని 14 రకాల కేడర్ల పరిధిలోని 35 హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త కేడర్ స్కీంతో లబ్ధి కలగనుంది. ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, జేఎంటీఈలు, డ్రిల్లర్లు, ఫోర్మెన్లు, పారామెడికల్ సిబ్బంది, సివిల్ శాఖ ఉద్యోగులు.. ఇలా 14 కేడర్లలో 35 హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తదుపరి ప్రమోషన్, అలవెన్సుల వర్తింపుతోపాటు పై కేడర్‌కు పదోన్నతి పొందేందుకు 2 నుంచి 3 ఏళ్లనిరీక్షణ సమయం తగ్గనుంది. ఏళ్ల తరబడి ఎదుగూ బొదుగూ లేక ఒకే కేడర్‌లో ఉన్న వారికి ఇప్పుడు త్వరితగతిన ప్రమోషన్లు రానున్నాయి. గత కొన్నేళ్లుగా పెరుగుదలకు నోచుకోని 11 రకాల అలవెన్సులను సమగ్ర అధ్యయనం తర్వాత వాటి స్థాయిను బట్టి 30 శాతం నుంచి 100 శాతం వరకు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో సంస్థపై ఏటా రూ.5 కోట్ల అదనపు భారం పడనుంది. ఒకేసారి 900 మందికి జనరల్ మజ్దూర్ గుర్తింపు సింగరేణి గనుల్లో కార్మికుల ఉద్యోగ ప్రస్థానం బదిలీ వర్కర్ స్థాయి నుంచి ప్రారంభం అవుతుంది. బదిలీ వర్కర్‌కు ఏడాది తర్వాత జనరల్ మజ్దూర్ హోదా కల్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాక ముందు దాదాపు నాలుగైదు ఏళ్లుగా బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్‌గా పదోన్నతి కల్పించలేదు. సీఎం కేసీఆర్ హామీ మేరకు గతేడాది 2,178 మందికి జనరల్ మజ్దూర్లుగా గుర్తించారు. 2017లో 190–240 మస్టర్లు ఉన్న మరో 900 మంది బదిలీ వర్కర్లను సైతం జనరల్ మజ్దూర్లుగా గుర్తించేందుకు తాజాగా యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది శిక్షణ కాలం పూర్తి చేసుకున్న జేఎంటీఈ, ఫోర్‌మెన్ లాంటి ట్రైనీలకు కూడా బోనస్ చెల్లించాని సింగరేణి సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. రూ.3 కోట్ల లాభాల బోనస్ రూపంలో వీరికి చెల్లించనున్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పెండింగ్‌లో ఉంచబోమని, సత్వరమే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. -
పట్టు సడలని హోదా పోరు
ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. వివిధ వర్గాల ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలు బంద్‌కు సంఘీభావం తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. బంద్‌పై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బంద్ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బంద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టనున్న బంద్‌లో బాలినేని పాల్గొననున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జిల్లాలో సంపూర్ణంగా బంద్ చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బాలినేని ఇప్పటికే పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని బంద్ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ హోదాను తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద సాగిలపడిన విషయాన్ని క్షేత్ర స్థాయిలో వివరించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ద్వంద్ధ వైఖరి వల్లే రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ప్రజలకు తెలియజెప్పనున్నారు. హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, హోదా కోసం వైఎస్సార్ సీపీ చివరి వరకూ పోరాడుతుందని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. బంద్‌కు ఉద్యోగ, కార్మిక సంఘాలతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు కూడగట్టారు. ఆది నుంచి హోదా పోరు ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పెట్టుబడి రాయితీలు లభిస్తాయని, తద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన జగన్మోహన్రెడ్డి యువభేరీలు, సభలు, సమావేశాలు నిర్వహించి హోదాతో కలిగే ప్రయోజనాలకు విద్యార్థులు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలకు వివరించారు. హోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయినా స్పందించకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. జిల్లా నుంచి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడైన వైవీ సుబ్బారెడ్డి తన పదవిని వదులకున్నారు. ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్ రూపంలో వస్తాయి. మిగిలిన పది శాతం నిధులు మాత్రమే లోన్‌గా ఇస్తారు. ప్రధానంగా ఇన్‌కం ట్యాక్స్‌లో రాయితీ ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు తరలివచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. హోదా వస్తే ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, మార్కాపురం పలకల పరిశ్రమలు మరింత విస్తరించి వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పొగాకు కాబట్టి సిగరెట్ కంపెనీలు జిల్లాకు తరలిస్తాయి. సుబాబుల్, జామాయిల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నందున పేపర్ పరిశ్రమ నెలకొల్పేందుకు అనుకూలంగా ఉంటుంది. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో రైతులు టమోటా, కనిగిరి ప్రాంతంలో బత్తాయి, నిమ్మ అత్యధికంగా పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశంలో జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న ప్రతిపాదన సాకారమయ్యే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టుతోపాటు కోస్తా కారిడార్‌లో భాగంగా తీరప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్జ్ ఓ కొలిక్కి వస్తాయి. ఒంగోలు నాన్‌మెట్రో విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చరల్ యూనివర్సిటీ, మినరల్ యూనివర్సిటీ మన దరికొస్తాయి. -
ఆర్టీసీ కార్మికులకు అందని వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికుల వేతనాల చెల్లింపుల్లో మరోసారి తీవ్ర జాప్యం జరగడం కలకలం సృష్టిస్తోంది. చేతిలో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. సిబ్బందికి వేతనాలివ్వడం కష్టంగా మారింది. కొంతకాలంగా నాలుగైదు రోజులు ఆలస్యంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందాల్సి ఉన్నా.. గురువారం రాత్రి వరకు కూడా అందకపోవడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గుర్తింపు కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చాయి. అన్ని బస్ డిపోలు, బస్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు అశ్వత్థామరెడ్డి, ధామస్‌రెడ్డి, రాజిరెడ్డి, బాబు, హనుమంతు, సుధాకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రంలోగా వేతనాలు అందకుంటే శనివారం నుంచి బస్సులు తిప్పేది లేదని హెచ్చరించారు. కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని యాజమాన్యాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో కార్మికుల భవిష్యనిధి నుంచి దాదాపు రూ.500 కోట్లు, పరపతి సహకార సంఘం నుంచి రూ.250 కోట్లు, పదవీ విరమణ బెనిఫిట్, కార్మికులు మృతి చెందితే సాయం ఇచ్చే నిధి నుంచి కూడా ఆర్టీసీ సొంతానికి డబ్బులు వాడుకుంది. వీటిని చెల్లించాలని కార్మిక సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో యాజమాన్యం చేతులెత్తేసింది. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కార్మికులు.. తాజాగా వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తడంతో మరింత మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.35 కోట్లు విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
సంగారెడ్డి క్రైం: దేశవ్యాప్తంగా ఈ నెల 17న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ అన్నారు. సంగారెడ్డిలోని సుందరయ్యభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 28 రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెట్టారని, అందులో లక్షలాది స్కీం వర్కర్లు పని చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వీరిని కార్మికులుగా గుర్తించలేదని ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించేది స్కీం వర్కర్లు అన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. చాలిచాలనీ వేతనాలతో కుటంబాలను వెళ్లదీస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇప్పటికి రెండుసార్లు వేతనాలను పెంచారని, కష్టించే స్కీం వర్కర్లకు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. కనీస వేతనం రూ.18 వేలు ఇచ్చి, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న సంగారెడ్డిలోని ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి యాదవరెడ్డి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక సంఘాల ధర్నా
మందమర్రి: మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. విలేకరులతో తమ్మినేని మాట్లాడుతూ..అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. అక్రమ అరెస్ట్‌లు సమ్మెను ఆపలేవన్నారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తే ప్రభుత్వానికే నష్టమన్నారు. ధర్నాలో పాల్గొన్న తమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చర్చలు విఫలం కాలేదు
ఈ నెల 23వ తేదీకి వాయిదా పడ్డాయి - సమ్మె పిలుపు చట్ట వ్యతిరేకం.. విధులకు రండి - డైరెక్టర్ (ఫైనాన్స్, పా) జె.పవిత్రన్ కుమార్ పిలుపు - 23న చర్చలకు నోటీసు జారీ చేసిన డిప్యూటీ సీఎల్సీ సాక్షి, మంచిర్యాల: వారసత్వ ఉద్యోగాలపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కాలేదని, ఈనెల 23వ తేదీకి వాయిదా పడ్డాయని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) జె.పవిత్రన్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో కార్మికు లెవ్వరూ సమ్మెలో పాల్గొనవద్దని, యథాతథంగా విధులకు హాజరు కావాలని ఆయన బుధవా రం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధర ణపై ఈనెల 13న డిప్యూటీ సీఎల్సీ శ్యాం సుందర్ సమక్షంలో జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు కొన్ని కొత్త ప్రతిపాదనలు అందిం చాయని, వాటి మీద న్యాయ నిపుణులతో చర్చించేందుకు వారం రోజుల సమయం కోరినట్లు చెప్పారు. అయితే కార్మిక సంఘాలు కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిం చకుండా తమంత తామే చర్చలు విఫల మైనట్లు ప్రకటించుకొని చర్చల నుంచి వెళ్లిపోయారని తెలిపారు. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ మాత్రం చర్చలు విఫలమైనట్లు అంగీకరిం చలేదని, కేవలం 23వ తేదీకి వాయిదా వేసినట్లుగానే నోటీసు జారీ చేశారని వివరిం చారు. పారిశ్రామిక సం బంధాల చట్టం ప్రకారం చర్చలు మధ్యలో కొనసాగు తుండగా, సమ్మెకు పోవడం పూర్తిగా చట్ట విరుద్ధమని, ఈ నేపథ్యంలో సమ్మె యోచన ను విరమించాలని ఆయన కార్మికులకు, కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో యూనియన్లు గత నెల 25వ తేదీన కొన్ని ప్రతిపాదనలు అందజేశాయని, వీటిపై కంపెనీ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న పరిస్థితుల్లో 13వ తేదీ చర్చల్లో సరికొత్త ప్రతిపాదనలు వచ్చాయని , వాటిపై 24 గంటల్లోనే నిర్ణయం వెల్లడించాలని పట్టుప ట్టాయని ఆయన చెప్పారు. సమస్య తీవ్రత, కోర్టు తీర్పుల నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొత్త ప్రతిపాదనలపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరని భావించిందని, దీనికి వారం రోజుల గడువు కోరినట్లు చెప్పారు. తమ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎల్సీ ఏకీభవించారని, కార్మిక సంఘాలు మాత్రం వాస్తవాన్ని అవగాహన చేసుకోకుండా ఒక్కరోజులోనే నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేస్తూ వెళ్లిపోవడం విచారకరమన్నారు. -
3 లక్షల కొత్త పీఎఫ్ ఖాతాలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల కొత్త పీఎఫ్ (భవిష్య నిధి) ఖాతాలు తెరిచినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 67 లక్షల మంది పీఎఫ్ ఖాతాలు తెరిచారని, ఉద్యోగ భవిష్య నిధిలో రూ.11.50 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ఆదివారం పీఎఫ్ కార్యాల యంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగ భవిష్య నిధిలో 4.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. మొత్తం భవిష్య నిధుల్లో 10 శాతం లోపు నిధులనే స్టాక్ ఎక్సే్చంజ్‌లో పెట్టుబడి పెట్టామని, వాటి ద్వారా ఇప్పటివరకు 13.72 శాతం వడ్డీ వచ్చిందన్నారు. ఎక్సే్చంజ్‌లో పెట్టుబడులను కార్మిక సంఘాలు మొదట్లో వ్యతిరేకించినా, శనివారం పుణేలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ విధానాన్ని స్వాగతించాయన్నారు. సమర్థవంతమైన నిర్వహణతో రూ.234.86 కోట్లు డివిడెండ్ లభించిందన్నారు. ట్రేడెడ్ ఫండ్స్ నిర్వహణలో సమర్థంగా పని చేస్తున్న బ్రెజిల్, కెనడా, అమెరికా, సింగపూర్లలో పర్యటించి అధ్యయనం చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. యూఏఎన్‌తో ఉద్యోగుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ 50 శాతం పూర్తయిందని, త్వరలో వంద శాతం సీడింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈపీఎఫ్ఓ పెట్టుబడులు రూ. 20వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మార్కెట్లో ఎంప్లాయీస్ ప్రావి డెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పెట్టుబడులు రూ. 20,000 కోట్లకు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. శనివారం పుణేలో సమావేశమైన ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు.. ఈక్విటీల్లో పెట్టుబడుల ను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. 2015 ఆగస్టు నుంచి ఈక్విటీ పెట్టుబడులు ప్రారంభించగా, ఈటీఎఫ్‌లో తమ పెట్టుబడులపై వార్షిక రాబడి 13.72 శాతంగా ఉందని దత్తాత్రేయ తెలిపారుు. ఈ పెట్టుబడులపై డివిడెండ్ల రూపంలో రూ. 235 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు. -
ట్రేడ్ యూనియన్లలో రాజకీయాలొద్దు
మేడే ఉత్సవాల్లో హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: ట్రేడ్ యూనియన్లలో రాజకీయాలకు తావు లేకుండా, పరిశ్రమలు పరిపుష్టం చేసుకొని తద్వారా ఆర్థిక వృద్ధిని సాధించుకునేందుకు కార్మిక సంఘాలు, యాజమాన్యాలు సమష్టిగా కృషి చేయాలని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కార్మిక శాఖ రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే ఉత్సవా ల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అండ దండలతో యాజమాన్యాలు, కార్మికులు, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేశామని, త్వరలోనే ఈ బోర్డు సిఫారసులను పరిశీలించి తుది నివేదికను ఖారారు చేస్తామన్నారు. ముఖ్యంగా యాజమాన్యాలు.. కార్మికులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్న సంక ల్పంతో ప్రభుత్వం కంపెనీలపై చట్టాలను ప్రయోగించడం లేదన్నారు. ఇవే కాకుండా పక్క రాష్ట్రాలు, ముఖ్యంగా ఒరిస్సా నుంచి రాష్ట్రానికి ఇసుక బట్టీలు తదితర యూనిట్లలో పని చేసేందుకు వచ్చే కార్మికుల సంక్షేమానికి హెల్ప్ డెస్క్‌ను సోమవారం ప్రారంభిం చామన్నారు. దేశంలో తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా పరిగణిస్తున్నారన్నారు. మన పరిశ్రమలు తన్నుకెళ్లేందుకు ఏపీ కుట్ర ఈ ఏడాది లక్షమందికి, వచ్చే రెండేళ్లలో దాదా పు మూడు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబ డి ఉందని నాయిని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.6 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం కలిగితే రూ.4 లక్షల సహాయం, మహిళా కార్మికులకు ప్రసూతికి రూ.30వేలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం తన్నుకపోయేందుకు కుట్రలు చేస్తోందని, ఈ ప్రమాదం నుంచి బయటపడా లంటే కార్మికులంతా శక్తివంతంగా తయారు కావాలని సూచించారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... అమెరికాలో వంశపారంపర్య ఆస్తులపై పన్ను ఉంటుందని, అటువంటి విధానం మన దేశంలో తేస్తే ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 90 శాతం కార్మికుల కోసం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. 22 మందికి శ్రమశక్తి అవార్డులు... ఈ సందర్భంగా 22 మంది వివిధ యూని యన్ల ప్రతినిధులకు శ్రమశక్తి అవార్డులు, 10 కంపెనీలకు బెస్ట్ మేనేజ్ మెంట్ అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ సి.రాములు నాయక్, రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, కమిషనర్ మహమ్మద్ నదీమ్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కిషన్ పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ హర్షం... మేడే ఉత్సవాల్లో భాగంగా తనకు బెస్ట్ మేనే జ్మెంట్ పురస్కారం ప్రకటించడం పట్ల సింగరేణి బొగ్గు గనుల సంస్థల సీఎండీ ఎన్.శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి, నాయినికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్టీసీ గుండెల్లో దడ!
కొత్త వేతన సవరణ కోసం డిమాండ్ చేస్తున్న కార్మికులు పెండింగులోనే గత ఫిట్మెంట్ బకాయిలు సరిగ్గా నెల జీతాలే ఇవ్వలేని దుస్థితిలో సంస్థ సాక్షి, హైదరాబాద్: వేతన సవరణతో ఒక్కసారిగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆర్టీసీలో అప్పుడే తదుపరి వేతన సవరణ డిమాండ్లు ఊపందుకున్నాయి. వచ్చే మార్చితో ప్రస్తుత వేతన సవరణ గడువు పూర్తి కానున్నందున వెంటనే కొత్త వేతన సవరణ ప్రకటించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత వేతన సవరణ ఆలస్యంగా అమలైనప్పటికీ, కార్మికులు 43 శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటనతో కార్మికుల్లో ఆనందం నిండినా, ఆర్టీసీ మాత్రం కోలుకోని విధంగా దెబ్బతింది. మొత్తం దాదాపు రూ.1,500 కోట్లు భారం పడగా, వేతన సవరణ ఆలస్యంగా జరగడంతో సంబంధిత బకాయిలు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో ఏ నెలకానెల జీతాలు చెల్లించేందుకే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అందని వేతనాలు.. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఒకటో తేదీన జీతాలు చెల్లించటంలో యాజమాన్యం విఫలమవుతోంది. గత నెల రెండో తేదీ రాత్రికి గానీ కార్మికుల ఖాతాల్లో జీతాలు పడలేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలన్నరగా ఆర్టీసీకి రోజుకు రూ.80 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా నవంబర్‌లో రూ.61 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. నవంబర్‌లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా భారీగా నమోదు కావాలి. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయానికి బదులు భారీ నష్టాన్నే మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో జీతాలు చెల్లించేందుకే యాజమాన్యం నానాపాట్లు పడుతోంది. కాగా, వేతన సవరణ భారంతో కుదేలైన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు ఫలితమిచ్చిన చర్యలేమీ లేవు. దీంతో సీఎం కూడా ఆర్టీసీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో కొత్త వేతన సవరణ డిమాండ్ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. కాగా, కార్మికుల ముందస్తు అనుమతి లేకుండా వారి జీతం నుంచి రూ.వంద చొప్పున కోత పెట్టి సైనిక సంక్షేమ నిధికి సంస్థ వితరణ చేసింది. బ్యాంకు ఖాతాలో జీతాలు పడ్డ తర్వాత గానీ విషయం కార్మికులకు తెలియలేదు. ముందు చెప్పకుండా కోత పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలి: ఎన్ఎంయూ గత వేతన సవరణ కాలపరిమితి వచ్చే మార్చితో ముగుస్తున్నందున ప్రభుత్వం వెంటనే కొత్త వేతన సవరణ కసరత్తు మొదలుపెట్టాలని ఆర్టీసీ ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. ఈసారి ఆలస్యం కాకుండా చూడాలని సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, కమాల్‌రెడ్డి, మౌలానా, రఘురాం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత సవరణకు సంబంధించిన బకాయిలతో పాటు ఐదేళ్ల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు, 4 నెలల కాలానికి పెరిగిన డీఏ బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
‘కోడ్ ఆఫ్ డిసిప్లేన్ సవరించాల్సిందే...
► నేడు హైదరాబాద్‌లో సీఎల్సీ వద్ద సమావేశం గోదావరిఖని : సింగరేణిలో అమలవుతున్న కోడ్ ఆఫ్ డిసిప్లీన్ లో మార్పులు తప్పనిసరిగా చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. గత నవంబర్ 26న డెప్యూటీ సీఎల్సీ శ్రీ వాస్తవ సమక్షంలో తొలి సమావేశం జరగగా శనివారం హైదరాబాద్‌లో సెంట్రల్ లేబర్ కమిషనర్ అనిల్‌కుమార్‌నాయక్ సమక్షంలో ద్వితీయ సమావేశం జరగనుంది. దేశంలో 1968లో సిమ్లాలో జరిగిన జాతీయ కార్మిక సంఘాల సమావేశంలో కోడ్ ఆఫ్ డిసీప్లీన్ ను రూపొందించారు. దాని ప్రకారం ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనైనా రెండేళ్ల కాలపరిమితికే ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ యూనియన్ అయినా గేట్ మీటింగ్‌లు, కార్మికుల నుంచి సభ్యత్వం సేకరించే వీలు కల్పించారు. ఆయా కంపెనీల్లో జరిగిన ఎన్నికల్లో 15 శాతం ఓట్లు సాధించిన కార్మిక సంఘానికి యాజమాన్యంతో రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. సింగరేణిలో మాత్రం 1998లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన సంఘంతో సంప్రదించకుండా యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లీన్ ను తయారుచేసి అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం గెలుపొందిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలే గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై గేట్‌మీటింగ్‌లు నిర్వహించాలని, గెలిచిన సంఘాలే కార్మికుల వద్ద నుంచి వార్షిక సభ్యత్వాన్ని సేకరించాలని, ఏ ఒప్పందం జరిగినా గుర్తింపు సంఘంతోనే చేయాలని తదితర నిర్ణయాలను కోడ్ ఆఫ్ డిసిప్లీన్లో పొందుపర్చారు. దీనివల్ల ఓడిపోయిన ఇతర కార్మిక సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. ఓడిపోయిన లేక ఇతర డివిజన్లలో ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన చాలా కార్మిక సంఘాలకు గనులపైకి వచ్చిన ప్రతీసారి యాజమాన్యం నుంచి పరాభవమే ఎదురైంది. గేట్లు మూసివేసి వెళ్లగొట్టిన సంఘటనలు, గేట్మీటింగ్లను వీడియోలు, ఫొటోలు తీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. కార్మికుల వేతనాలు, ఇతర సౌకర్యాలు, అలవెన్స్ లకు సంబంధించి జేబీసీసీఐ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను కార్మికులకు చెప్పడానికి, ఆ నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయించేలా చర్చించడానికి జాతీయ కార్మిక సంఘాలకు వీలులేకుండా పోయింది. దీంతో కోడ్‌ఆఫ్ డిసిప్లీన్ లో మార్పులు చేయాలని సెంట్రల్ లేబర్ కమిషనర్‌కు జాతీయ సంఘాలు మొరపెట్టుకున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తి కావడం, ఎన్నికలకు సంబంధించి అధికారిని నియమించకపోవడంతో ఆయాకార్మిక సంఘాలు కోడ్ ఆఫ్ డిసీప్లీన్ లో మార్పులు చేయాలని పట్టుబడుతున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. ఎన్నికలపై ఎంపీ కవిత కేంద్ర కార్మిక శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎన్నికల గురించి కార్మిక సంఘాలతో సెంట్రల్ లేబర్ కమిషనర్ చర్చించే అవకాశం ఉంది. -
నామమాత్రపు పెంపు
- రూ.4 వేతనం పెంపు - యాజమాన్యాలతో ముగిసిన కార్మిక సంఘాల చర్చలు - బీడీ కార్మికుల్లో నిరాశ కోరుట్ల: బీడీ కంపెనీల యాజమాన్యాలు ఎట్ట కేలకు చేయి విదిల్చాయి. నామమాత్రపు వేతన పెంపుతో బీడీ కార్మికులు సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం బీడీ యాజ మాన్యాలు కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం 2016 మే నెలతో ముగి సింది. మళ్లీ వేతన పెంపు కోసం కార్మిక సంఘాలుజాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీడీ కంపెనీలకు నోటీసులిచ్చి ఉద్య మించాయి. మంగళవారం హైదరాబాద్‌లో యాజమాన్యాలు చర్చలు జరిపాయి. వేతన పెంపు రూ.4 మాత్రమే వేతన పెంపు కోసం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, బీఎంఎస్) ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు బీడీ కార్మికుల మూల వేతనం రూ.101లో సగం మేర వేతనం రూ.50 వరకు పెంచాలని డిమాండ్ చేయగా బీడీ కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. యాజమాన్యాలు ససేమిరా అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేయి బీడీలకు రూ.4 వేతనం పెంపునకు కార్మిక సంఘాల యాక్షన్ కమిటీ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. సమాన పనికి సమాన వేతనం లెక్కన ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా రూ.1,100 చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని జగి త్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు 5.50 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కొత్తగా మంగళవారం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కంపెనీలతో చేసుకున్న వేతన ఒప్పందం బీడీ కార్మికుల్లో నిరాశను నింపింది. ఒప్పందం అసంతృప్తిని మిగిల్చిందని తెలగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింత భూమేశ్వర్ అన్నారు. -
‘వారసత్వం’ ఇక నిరంతరం
- టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత - కొన్ని కార్మిక సంఘాలు శని గ్రహాల్లా వ్యవహరిస్తున్నారుు సాక్షి, కొత్తగూడెం: సింగరేణి కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఇక నిరంతరం కొనసాగుతుందని, ఇందుకోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో విసృ్తతంగా పర్యటించిన కవిత.. స్థానిక వెంకటేశ్‌ఖని 7 ఇంక్లైన్లో టీబీజీకేఎస్ సీనియర్ నేత వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని కంటికి రెప్పలా కాపాడుతామని సీఎం కేసీఆర్ అనుక్షణం చెప్తుంటారని కవిత తెలిపారు. అందుకనుగుణంగానే 19 ఏళ్లుగా అమలుకు నోచుకోని సింగరేణి కార్మిక కుటుంబాలు వారసత్వ ఉద్యోగాలు పొందే హక్కును పునరుద్ధరించిందని చెప్పారు. కార్మికుల సంక్షేమం, వారసత్వ ఉద్యోగాల నియామక పునరుద్ధరణ ప్రక్రియలో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అరుునా, యూనియన్ల రూపంలో ఉండే కొన్ని శనిగ్రహాలు న్యాయస్థానాలను ఆశ్రరుుంచి, ఈ ప్రక్రియ మొత్తాన్ని అడ్డుకునే ప్రమాదం ఉండటంతో.. ఆచితూచి అడుగు వేయాల్సి వచ్చిందని కవిత వివరించారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుతున్న టీబీజీకేఎస్‌ను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని కవిత కోరారు. అలాగే, 1997-2001 మధ్య ఎలాంటి నష్టపరిహారం తీసుకోకుండా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన 150 వీఆర్ఎస్ కార్మికుల కుటుంబాలకు సైతం వారసత్వ ఉద్యోగాలిస్తామని కవిత వెల్లడించారు. ఈ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె * తీవ్ర ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు సాక్షి, హైదరాబాద్: నగరంలో సార్వత్రిక సమ్మె శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక సంఘాలు కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతునివ్వడంతో నగరంలోని అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సుమారు 3,500 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారిపై ప్రైవేటు వాహనదారులు నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఆటో కార్మిక సంఘాలు బంద్ ప్రకటించినప్పటికీ చాలాచోట్ల ఆటోరిక్షాలు యథావిధిగా నడిచాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు నడిచే 121 సర్వీసులతో పాటు మరో 14 రైళ్లు అదనంగా నడిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చాలాచోట్ల స్కూళ్లకు ముందుగానే సెలవు ప్రకటించారు. నిరసనల హోరు... బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహిం చాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్దఎత్తున నినాదా లు చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలన్నీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నాంపల్లిలోని గగన్‌విహార్‌లో జరిగిన నిరసన సభలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్, అధ్యక్షులు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఉద్యోగుల నిరసనకు మద్దతు ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని, కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె పెద్ద ఎత్తున విజయవంతమైందని పేర్కొన్నారు. జిల్లాల్లోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మరోవైపు కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె ఏపీలో ప్రశాంతంగా ముగిసింది. -
కేంద్ర ఉద్యోగులకు రెండేళ్ల బోనస్
* కనీస దినసరి వేతనం రూ. 350కి పెంపు: కేంద్రం ప్రకటన * కార్మిక సంఘాల అసంతృప్తి.. 2న సమ్మె యథాతథం న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం శుక్రవారం దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక సంఘాలను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వంలోని నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని 42 శాతం మేర పెంచటంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల బోనస్‌ను చెల్లిస్తామని కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించింది. అయితే.. ఈ చర్యలు ఏమాత్రం సరిపోవంటూ కార్మిక సంఘాలు తిరస్కరించాయి. శుక్రవారం నాటి తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేశాయి. ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ ఏడో వేతన సంఘం సిఫారసులను ప్రతిఫలిస్తూ సర్వీసు, నియామక నిబంధనలను మార్చాలని సర్కారు నిర్దేశించింది. కార్మిక సంఘాల అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందం సారథి, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు రూ. 246 నుండి రూ. 350 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2014-15, 2015-16 సంవత్సరాల బోనస్‌ను సవరించిన నిబంధనలు ప్రాతిపదికగా చెల్లిస్తామని వెల్లడించారు. బోనస్ చెల్లింపుల వల్ల ఏటా రూ. 1,920 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందన్నారు. బోనస్ చెల్లింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలను కూడా చేపడుతుందని హామీ ఇచ్చారు. కార్మిక సంఘం రిజిస్ట్రేషన్‌ను 45 రోజుల్లో పూర్తిచేసేలా చూడాలని చెప్తూ రాష్ట్రాలకు సలహాలను జారీ చేస్తామని కూడా చెప్పారు. కార్మిక, ఉపాధి శాఖామంత్రి బండారు దత్తాత్రేయ, విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పియూష్గోయల్లు కూడా జైట్లీతో ఉన్నారు. ‘‘గత ఏడాదిన్నర కాలంలో మంత్రిత్వశాఖల కమిటీ కేంద్ర కార్మిక సంఘాలతో సమావేశమైంది. కార్మిక సంఘాలు పలు డిమాండ్లు ముందు పెట్టాయి. వాటిపై మంత్రివర్గ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ‘సి’ తరగతిలో నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను రోజుకు రూ. 350 చేయాలని నిర్ణయించాం. అసంఘటిత రంగానికి (అంగన్వాడి, మధ్యాహ్నభోజనం, ఆశా వలంటీర్లు వంటివి) సామాజిక భద్రత ప్రయోజనం అందించే అంశాన్ని ఒక కమిటీ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా తన నివేదిక ఇస్తుంది’’ అని జైట్లీ వివరించారు. కార్మిక సంఘాల సమ్మె పిలుపు గురించి ప్రశ్నించగా.. ‘‘మనకు బాధ్యతాయుతమైన కార్మిక సంఘాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా’’ అని ఆయన స్పందించారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను మాతృ సంస్థలో విలీనం చేయాలన్న ప్రణాళికలకు ప్రతిపక్షాల వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..విలీనం వల్ల ఏ ఒక్క ఉద్యోగి సర్వీస్ నిబంధనలపైనా ఎటువంటి ప్రభావం ఉండబోదన్నారు. 12 అంశాల్లో దేనినీ పరిగణనలోకి తీసుకోలేదు అయితే.. నెలవారీ కనీస వేతనం రూ. 18,000 ఉండాలని, దినసరి కనీస వేతనాన్ని రూ. 692 కు పెంచాలని, నెలకు రూ. 3,000 ఆరంభ పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాలు.. ప్రభుత్వ ప్రకటనపై సంతృప్తి చెందలేదు. శుక్రవారం తాము తలపెట్టిన సమ్మెను యధాతథంగా కొనసాగిస్తామని ఉద్ఘాటించాయి. ‘‘కేంద్రం ప్రకటించిన కనీస వేతనం ఏమాత్రం సరిపోదు. సమ్మె యధాతథంగా ఉంటుంది. సార్వజనీనమైన కనీస వేతనాన్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గురుదాస్‌దాస్‌గుప్తా పేర్కొన్నారు. ‘‘మా 12 పాయింట్ల చార్టర్లో దేనినీ సర్కారు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా చూపుతోంది’’ అని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్‌సింగ్ వ్యాఖ్యానించారు. పెంపుపై మేం సంతృప్తి చెందాం: బీఎంఎస్ ప్రభుత్వ ప్రకటనను ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ప్రశంసించింది. సార్వత్రిక సమ్మెకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించింది. ‘‘కనీస వేతనాల పెంపుపై మేం సంతృప్తిచెందాం.. దీనిని మేం ఆహ్వానిస్తున్నాం. సమ్మెలో బీఎంఎస్ పాల్గొనదు’’ అని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి వజ్రేష్ ఉపాధ్యాయ్ చెప్పారు. -
చీలికలు.. పదవులు
⇒ ఇవే టీఆర్ఎస్ అస్త్రాలు ⇒ టీబీజీకేఎస్ గెలుపే లక్ష్యం ⇒ సంఘంలో చేరికలకు ప్రోత్సాహం ⇒ ప్రతిపక్ష నాయకులకు పదవుల ఎర మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : జింకను వేటాడాలంటే సింహం ఎంతో ఓపిక పడుతుంది. అదే సింహాన్ని వేటాడాలంటే రెట్టింపు ఓపిక అవసరం. ఇదే సూత్రాన్ని సింగరేణిలో రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ వాడనుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికల గోల సంఘంగా టీబీజీకేఎస్‌ను మళ్లీ గెలిపించుకోవడమే ధ్యేయం. ఆ లక్ష్యంతో చాలా ఓపికగా మిగతా కార్మిక సంఘాల నాయకుల వేట మొదలెట్టింది. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకత్వంపై దృష్టి సారించింది. ప్రతిపక్ష సంఘాల్లో చీలికలు తీసుకువచ్చి, వచ్చిన వారికి కోరుకున్న పదవులు కట్టబెట్టి రానున్న గుర్తింపు ఎన్నికల్లో గట్టెక్కడానికి టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఆర్టీసీ ఎన్నికలకు ముందు అచ్చం ఇలాంటి ఎత్తుగడలు వేసిన టీఆర్ఎస్ అనుబంధ టీఎంయూను గెలిపించుకుంది. అదే స్ఫూర్తితో సింగరేణిలో పాచికలు విసరడానికి అధికార పార్టీ సిద్ధమైంది. అసంతృప్తిని పసిగట్టి.. చీలికలను ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్న టీఆర్ఎస్ ముందుగా ప్రతిపక్ష సంఘాల్లోని అసంతృప్తి నాయకులను గుర్తిస్తోంది. వారికి ఏం కావాలి.. వారి బలహీనతలు ఏమిటి.. చీలికలు తీసుకువస్తే వారి వెంట ఎంత మంది నాయకులు వస్తారు.. ఏ తరం వారు చేరడానికి ఇష్టపడతారు.. గతంలో వారి పనితీరు ఎలా ఉంది.. కార్మికుల కోసం పనిచేసిన వారైతే సరి.. పదవులకు ఆశపడి చేరడానికి ఆసక్తి చూపేవారు అవసరం లేదు.. గతంలో వారు పనిచేసిన సంఘంలో గ్రూపులకు ఆశ్రయం ఇచ్చి కార్మికుల సమస్యలను పక్కన పెట్టినవారిని దరిచేరనివ్వొద్దు.. కోవర్టులను ముందే పసిగట్టి దూరం పెడుతూ యూనియన్ గెలుపుకోసం కష్టపడి పనిచేసే వారి కోసం జల్లెడ పడుతోంది అధికార పార్టీ. పదవుల పెంపుపై దృష్టి ఇతర సంఘాల నుంచి వచ్చిన వారికి న్యాయం చేయాలంటే ప్రస్తుతం ఉన్న పదవులు సరిపోవు. వారి స్థాయికి తగిన పదువులు ఇస్తామంటేనే వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థాయికి తగిన పదవి ఇవ్వకుంటే తలనొప్పి తయారవుతుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీతో పాటు అనుబంధ సంఘంలో పదవులు సర్దా ల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కార్మిక సంఘాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా కోరుకునేది యూనియన్ పదవులే. పార్టీలో ఇస్తామంటే ఆసక్తి చూపే అవకాశం లేదు. అందుకే ఏరియా నుంచి రీజియన్‌తో పాటు నాలుగు జిల్లాల స్థాయి పదవులు ఉండాలనే ఆలోచన చేస్తోంది. ప్రథమ శ్రేణి నాయకులకు అదే స్థాయిలో పదవులు ఉండాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా జోడించాలి. గౌరవ అధ్యక్షుడు, సీనియర్ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య సలహాదారులు వంటి పదవుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత కమిటీలో ఇటువంటి పదవులు లేవు. ప్రత్యేక పరిస్థితుల్లో పెంచక తప్పదని తెలుస్తోంది. బలోపేతమయ్యూకే ఎన్నికలకు.. ప్రతిపక్ష సంఘాల నుంచి చేరికలు పూర్తయి వారికి పదవులు కేటారుుంచిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో టీబీజీకేఎస్‌కు సరైన నాయకత్వం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్నికల బరిలోకి దిగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆర్టీసీలో.. మోగిన ఎన్నికల నగారా
నల్లగొండ : ఆర్టీసీలో ఎన్నికల నగారా మో గింది. కార్మిక సంఘాల గుర్తింపునకు ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండేళ్ల ఒకసారి జరిగే ఎన్నికలు అవిభాజ్య రాష్ట్రంలో చివరిసారిగా 2012 డిసెంబర్లో నిర్వహించగా వాటి గుర్తింపు గడువు 2014 డిసెంబర్లో ముగిసింది. కానీ వివిధ కారణాల దృష్ట్యా అప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యం కాలేదు. గుర్తింపు గడువు ముగిసిన ఏడాది వ్యవధి తర్వాత సొంత రాష్ట్రంలో తొలిసారిగా కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిన కాలంలో ఎన్ఎం యూ నుంచి విడిపోయి టీఎంయూ ఆవిర్భవించింది. ఉద్యమంలో చురుగ్గా పొల్గొన్న టీఎ ంయూకు అప్పటి పరిస్థితులు పూర్తి అనుకూలగా మారడంతో 2012 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంయూ, ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) కలిసి పోటీ చేశాయి. జిల్లాలోని ఏడు డిపోల్లో ఆరు డిపోల్లో టీఎంయూ విజయం సాధించగా.. దేవరకొండ డిపోలో మాత్రమే ఎన్ఎంయూ గెలుపొందింది. అయితే ఈ మూడేళ్ల కా లంలో కార్మిక సంఘాల్లో బేధాభిప్రాయాలు తలెత్తడంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. టీఎంయూ ఒంటరి పోరు.. ఈ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగానే పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం వైఫ్యలాన్ని ఎండగట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ ఏర్పడింది. దీంట్లో ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయూ ఉమ్మడిగా కార్మికుల పక్షాన పోరాడుతున్నాయి. ఇదే వైఖరిని గుర్తింపు ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మూడు సంఘాలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాధన రాష్ట్ర నాయకుల పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే ఈ మూడు సంఘాలు ఒకేతాటి పైకి వచ్చి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్లు కార్మికులకు పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు. బలాబలాలు... జిల్లాలోని నల్లగొండ, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ డిపోల్లో టీఎంయూకు (తెలంగాణ మజ్దూర్ యూనియన్) సుమారు 2,800 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ (స్టాఫ్వర్కర్స్ ఫెడరేషన్)-500, ఎన్ఎంయూ ( నేషనల్ మజ్దూర్ యూని యన్)-1000, ఎంప్లాయూస్ యూనియన్‌కు 750 ఓట్లు ఉన్నాయని సంఘాల ప్రతినిధులు చెప్తున్నా రు. టీఎంయూకు అన్ని డిపోల్లోనూ మెజార్టీ ఓటర్లు ఉండగా.. ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ డిపోల్లో మెజార్టీ ఓటర్లు ఉన్నారు. ఎన్ఎం యూ, ఈయూ సంఘాలకు కూడా అన్ని డిపో ల్లో ఓటర్లు ఉన్నారు. అయితే కార్మిక సంఘాల్లో వర్గపోరు కారణంగా ఈ ఎన్నికలు రసవత్తరంగా మా రే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా టీఎం యూ నాయకత్వ తీరుపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్ఎం యూలో రెండు గ్రూపుల మధ్య ఆదిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. దీంతో పాటు మిగిలిన సంఘా ల్లో కొందరు ఓటర్లు అటుఇటుగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇదీ.. ఈ నెల 13న కార్మిక సంఘాల తా త్కాలిక ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాల పై పరిశీలన చే సిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 25 తేదీన ప్రకటిస్తారు. గుర్తింపు ఎన్నికలు జూలై 19న నిర్వహిస్తారు. అదే రోజున సా యంత్రం అన్ని డిపోల్లో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తా రు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను జూలై 25, 26 తేదీల్లో స్వీకరిస్తారు. ఎన్నికల ఫలితా లను ఆగస్టు 6న అధికారికంగా ప్రకటిస్తారు. -
ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు పెంపు
8.7 నుంచి 8.8 శాతానికి న్యూఢిల్లీ: ఈపీఎఫ్ వడ్డీరేట్లపై దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం దిగొచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్‌పై మార్చి నుంచి మూడుసార్లు తన నిర్ణయాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం..నిరసనల నేపథ్యంలో విరమించుకుంది. ఎంప్లాయిర్ వాటా నిధులను 58 ఏళ్ల తర్వాతే ఉద్యోగి పొందేలాతీసుకున్న నిర్ణయాన్నీ మార్చుకుంది. తాజాగా ఈపీఎఫ్‌పై 8.7 శాతమే వడ్డీ చెల్లిస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.8 శాతం వడ్డీ ఇవ్వడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారని, తక్షణం దీనిపై నోటిఫికేషన విడుదల చేస్తామని కార్మిక మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2015-16కు పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ తిరస్కరించడంతో చివరకు 8.7శాతంగా గానే నిర్ణయించారు. దీనిపై కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒత్తిడి పెరగడంతో కేంద్రం నిర్ణయం మార్చుకుంది. ఈపీఎఫ్ఓ ఆదాయంపై తాజా సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. గతేడాది మిగులు నిధుల్ని వాడుకునేందుకు వీలుందని తెలియడంతో వడ్డీ రేటు పెంచారని, పూర్తి గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుని ఖాతాదారుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నాయి తమ శుక్రవారం సమ్మె విజయవంతమైన కార్మిక సంఘాలు చెప్పాయి. -
ఎక్కడివక్కడే
- నేడు సార్వత్రిక సమ్మె - స్తంభించనున్న రవాణా - ఐటీ కారిడార్లలో వాహనాలకు మినహాయింపు సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. నగరంలో మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ ప్రభావం కొంతమేరకు కనిపించింది. బుధవారం ఉదయం నుంచే సిటీబస్సులు, ఆటోల రాకపోకలు స్తంభించనున్నాయి. ట్యాక్సీలు, క్యాబ్‌లు సమ్మెకు మద్దతిస్తున్నాయని... ఐటీ కారిడార్లలో వీటికి మినహాయింపునిచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. నగరంలోని ఇతర మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్‌రెడ్డి తెలిపారు. నగరంలోని 28 డిపోలకు చెందిన సుమారు 3,800 బస్సులు, లక్షా 25 వేల ఆటోరిక్షాలు నిలిచిపోనున్నాయి. స్కూల్ ఆటోలూ తిరిగే అవకాశం కనిపించడం లేదు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్ల నుంచి తెలంగాణ, ఏపీలలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 3,500 బస్సులకు సైతం బ్రేకులు పడబోతున్నాయి. తెలంగాణ లారీ యజమానుల సంఘం సమ్మెకు మద్దతు ప్రకటించింది. లారీలు నడపడం, నడపకపోవడం వాహన యజమానుల వ్యక్తిగతఅంశమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఆటోలు, బస్సులు నిలిచిపోవడం వల్ల 40 లక్షల మందిపైగా ప్రయాణికులు అవస్థలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు... సార్వత్రిక సమ్మెను దృష్టిలో ఉంచుకొని రైళ్ల రాకపోలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయని... రద్దీకి అనుగుణంగా వీటి సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు. బిల్లు వెనక్కి తీసుకోవాలి... కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక రోడ్డు రవాణా, భద్రతా బిల్లు-2015 ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాల జేఏసీ, ఆటో సంఘాల జేఏసీ వేరు వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. ప్రజా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ బిల్లును తెస్తోందని టీఆర్ఎస్ అనుబంధ ఆటో కార్మిక సంఘ అధ్యక్షులు వేముల మారయ్య, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ఆర్లే సత్తిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
నేడు బ్యాంకు, బీమా ఉద్యోగుల సమ్మె
ముంబై: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ కార్మిక సంఘాలు బుధవారం (నేడు) తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో బీమా కంపెనీల సిబ్బంది... ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. దీంతో ఆర్థిక సేవలు అంతరాయం కలగనుంది. 25 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్, తొమ్మిది విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది. వీటితో పాటు 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 650 సహకార బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, సిడ్బి సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొంది. మొత్తం మీద బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు ప్రాతి నిధ్యం వహించే 14 యూని యన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభు త్వ రంగ బ్యాంకులను దొడ్డిదారిన కార్పొరేట్ల చేతికి అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కాగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది. -
వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు
దిక్కుమాలినోళ్ల ఓట్లతోనే సీఎం అయ్యావని గుర్తుంచుకో * కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక * ఇందిరాపార్కు వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా హైదరాబాద్: ‘‘కార్మిక సంఘాలు దిక్కుమాలినవా? టీఆర్ఎస్, కేసీఆర్ పుట్టక ముందు నుంచే కార్మిక సంఘాలున్నాయి. అధికారం చేతిలో ఉందని కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దిక్కుమాలిన వాళ్లు వేసిన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యావు. దిక్కుమాలిన వాళ్లే మూడున్నరేళ్ల తర్వాత నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. దిక్కులేనివాళ్లకు దిక్కు చూపించే చుక్కలు వామపక్షాలని, దిక్కు చూపించకుండా చుక్కలు చూపుతున్న తిక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. మంత్రులు ముఖ్యమంత్రితో మాట్లాడే కనీస ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదన్నారు. తమకు ప్రజాస్వామ్య, సామాజిక, జన తెలంగాణ కావాలే తప్ప.. దోరల తెలంగాణ, నియంతృత్వ తెలంగాణ కాదని, ఇదే మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తే.. ఆయన పాలనకు ప్రజలు పాతర వేస్తారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాజధానికి భారీగా తరలివచ్చిన కార్మికులు.. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తున్నా.. మత్తులో ఉన్నాడో, చెవుల్లో సీసం పోసుకున్నాడో సీఎంకు వినపడటంలేదన్నారు. వామపక్షాల పంచాయతీల్లో ముందు జీతాలు పెంచాలన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇస్తే తాము అక్కడే తేల్చుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయా? అని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంగా తెలంగాణ వస్తే, ఎన్నిక ల ప్రచారంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అనే మాటే ఉండదని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం పర్మినెంట్ అనే మాటే లేదంటున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దోరల ఆలోచనలను పుణికి పుచ్చుకున్న కేసీఆర్ సమ్మె విరమించాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో ప్రజలు పేదలవుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు ఉయ్యాల్లో ఊగుతోందని విమర్శించారు. పంచాయతీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 15 వేలకు పెంచడంతో పాటు వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ శాసనసభపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీసీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క, సూర్యం (ఐఎప్టీయూ), నర్సింహన్ (ఏఐటీయూసీ), సాయిబాబా, పాలగుడు భాస్కర్, భూపాల్, రమ(సీఐటీయూ), జానకిరాములు(ఆర్ఎస్పీ), గోవర్ధన్, ఝాన్సీ (న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ), ఎంకే బోస్ (టీఎన్టీయూసీ), రాధాకష్ణ(బీఎంఎస్), మురహరి(ఎస్‌యూసీఐ) తదితరులు పాల్గొని మాట్లాడారు. -
సర్కారుపై కార్మికుల కన్నెర్ర
సర్కార్ తీరుపై మునిసిపల్ కార్మికులు కన్నెర్రజేశారు. వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని 41 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనను తీవ్రం చేశారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌ను ముట్టడించారు. లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు కార్మికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికుడు రాజు చేయి విరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. - కలెక్టరేట్‌ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులు - ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేసిన పోలీసులు - పలువురికి గాయూలు ప్రగతినగర్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంపై కార్మికులు కన్నెర్ర జేశారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు లోపలికి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అక్కడే ఉన్న మరికొందరు బైఠారుుంచి కేసీఆర్ తీరు నిజాం తీరులా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే రోడ్డున పడ్డారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కేసీఆర్ సర్కార్‌పై ‘కార్మికయుద్ధం’ ప్రకటిస్తామని వామపక్ష సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కార్పోరేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి తిలక్‌గార్డెన్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఉన్న పోలీసులు కార్మికులు, వామపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డుకున్న కార్మికులను ఈడ్చుకుంటూ వెళ్లి వ్యానులో ఎక్కించారు. కొందరు కార్మికులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోర్టు చౌరస్తా వద్ద రాస్తారోకో, మానవాహారం నిర్వహించారు. పలువురికి గాయాలు... తమ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలువురు కార్మికులు, నాయకులు వాహనాలను అడ్డుకోవడంతో వారికి గాయూలయ్యూరుు. కామారెడ్డి మున్సిపాలిటీ కార్మికుడు రాజుకు కుడి చేయి విరుగగా, కొందరు మహిళా కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దిక్కుమాలిన సర్కార్ : ప్రభాకర్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా వారికి మద్దతు తెలుపుతున్న సంఘాలు, కార్మికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ దిక్కుమాలిన సమ్మె అనడం ఆయ న మూర్ఖత్వానికి నిదర్శనం అని వామపక్ష సంఘం నాయకుడు ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి హక్కులపై పోరాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. అరెస్టయింది వీరే... కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్ష నాయకులను పొలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి మొదటి,నాలుగో టౌన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఎం నాయకులు వి.ప్రభాకర్, దండి వెంక ట్, సీపీఐ జిల్లా కార్యాదర్శి కంజర భూమయ్య, ఐఎఫ్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ, ఏఐటీయూ సీ నాయకులు ఓమయ్య, సుధాకర్, నాయకులు సిద్ధిరాములు, నూర్జహాన్, శ్యాంబాబు,గోవర్ధన్ ఉన్నారు. -
పట్టు.. బెట్టు
- పట్టు వీడని ప్రభుత్వం - మెట్టు దిగని కార్మిక సంఘాలు - పోలీసులతోనైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతాం - విధుల నుంచి తొలగిస్తాం - సర్కారు హెచ్చరిక - బెదరని కార్మికులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటుతోంది. విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు దిగివచ్చేది లేదని కార్మిక సంఘాలు పంతాలకు పోతున్నాయి. సమ్మె ప్రారంభమై వారం రోజులు దాటినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పదో పీఆర్సీకిఅనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,170, ఇతర కార్మికులకు రూ.17,380 చెల్లించాల్సిందేనని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. వేతనాలు పెంచేందుకు సిద్ధంగానే ఉన్నామని, వెంటనే విధులో ్లచేరాల్సిందిగా ప్రభుత్వం చేసిన వినతిని సంఘాలు పట్టించుకోలేదు. ఎంత పెంచుతారో చెప్పకుండా సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం అంతే స్థాయిలో పట్టుదలకు పోతోంది. పోలీసులను రంగంలోకి దింపైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొండిగా వ్యవహరిస్తే మంగళవారం నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించింది. సీఎం అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయంలోగా విధుల్లో చేరకుంటే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పరిధిలోని కార్మికులంతా విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. శాశ్వత ఉద్యోగులుగా ఉన్న కార్మికులు గైర్హాజరైతే సీసీఏ నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నాయకుల వల్లనే.... కొంతమంది సంఘాల నాయకుల ఉచ్చులో పడి కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కాదని గుర్తించింది. అయినా... వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని పేర్కొంది. సమ్మె విరమణ కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదివారం రాత్రి నుంచి విస్తృత ప్రయత్నాలు చేశారు. విధుల్లోకి రావాలని... వేతనాలు పెంచే పూచీ తనదని హామీ ఇస్తూ కార్మికులందరికీ ఎస్ఎంఎస్లు పంపారు. సోమవారం ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. నగరంలో నిర్మించనున్న రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జీహెచ్ఎంసీ కార్మికులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తాను కమిషనర్‌ను కాగానే రూ.6,500గా ఉన్న వేతనాన్ని రూ.8,500కు పెంచామన్నారు. రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించాలని కోరారు. మరోవైపు తమ వేతనం రూ.14,170కి పెంచే వరకు వెనకడుగు లేదని కార్మిక సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. ఈ ఒక్క డిమాండ్ తీరిస్తే ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరుతారని, మిగతా వాటి గురించి ఆలోచించరని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఎవరెవరు? మిగతా కేటగిరీల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు (పట్టభద్రులు), డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, సీఏడీ ఆపరేటర్లు, జీఐఎస్ అనలిస్టులు, టీమ్‌లీడర్లు, కోఆర్డినేటర్లు, డ్రాఫ్ట్స్‌మెన్, ఓఎస్సార్టీ అనలిస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్లు (ఐటీఐ/నాన్ టెక్నికల్), ఎలక్ట్రీషియన్లు, లైన్మన్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్లు, రవాణా విభాగంలో డ్రైవర్లు, సీనియర్ ప్రోగ్రామర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు. ఇవి నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించినవి. మిగతా కేటగిరీల్లో సెమి స్కిల్డ్, స్కిల్డ్, సుపీరియర్ కేటగిరీలు ఉన్నాయి. నాలుగో తరగతి ఉద్యోగులు దాదాపు 24,800 మంది ఉన్నారు. మిగతావారు మరో రెండు వేల మంది. -
అవే అవస్థలు
- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. సోమవారం యథావిధిగా నగరవాసులు ఇబ్బందులు - ఎదుర్కొన్నారు. బస్సులు లేక... - ప్రైవేట్ వాహనాలు దొరక్క నానాపాట్లు పడ్డారు. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వం కొనసాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలతోఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల ఎదుట నిరసన తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు సోమవారం కూడా ఉధృతంగా కొనసాగింది. ఒకవైపు ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు, మరోవైపు కార్మికుల ఆందోళనలు, ప్రదర్శనలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యకలాపాలు కొనసాగించారు. మరోవైపు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ఆర్టీసీ అధికారులు గ్రేటర్లో 671 బస్సులు నడిపారు. అయినా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సోమవారం పనిదినం కావడంతో విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. 121 సర్వీసులతో పాటు మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను అధికారులు అదన ంగా నడిపారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వేషన్ బోగీలు, జనరల్ బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల యథావిధిగా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, కార్లు, వివిధ రకాల రవాణా వాహనాల యజమానులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇక ఆటోడ్రైవర్లు ప్రయాణికుల జేబులు లూటీ చేశారు. మరోవైపు తార్నాకలో ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొనడంతో స్నేహ (19) అనే విద్యార్ధిని దుర్మరణం పాలైంది. ఎక్కువ బస్సులు నడుపాలనే అధికారుల పట్టుదల, ఎక్కువ ట్రిప్పులు తిప్పేందుకు డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోందని విమర్శలు వచ్చాయి. అన్ని డిపోల్లో సమ్మె ఉధృతం... నగరంలోని 28 డిపోలు, బస్స్టేషన్లలో కార్మికుల సమ్మె కొనసాగింది. కార్మికులంతా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. బర్కత్‌పురా, కాచిగూడ, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, దిల్‌షుఖ్‌నగర్, ఉప్పల్, బండ్లగూడ, తదితర డిపోలలో ధర్నాలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడారు. పలు డిపోల నుంచి కార్మికులంతా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా తరలి వెళ్లారు. పలు కార్మిక సంఘాలు ఎంజీబీఎస్‌లో సభ నిర్వహించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు ఎమ్మార్వోలను, కార్మికశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎంసెట్‌కు ఆర్టీఏ సన్నద్ధం... కార్మికుల సమ్మె కొనసాగితే చేపట్టవలసిన చర్యలపై సోమవారం సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమయ్యారు. సమ్మె దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యార్ధుల కోసం 1000 బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ అద్దె బస్సులు కలిపి ఇప్పటి వరకు 450పైగా సిద్ధం చేసినట్లు జేటీసీ చెప్పారు. మరో 2 రోజుల గడువు ఉన్నందువల్ల బస్సుల సేకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. -
బస్సులకు బ్రేక్
మొదలైన ఆర్టీసీ సమ్మె జిల్లాలో నిలిచిన 915 బస్సులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యాజమాన్యం ప్రయూణికులకు తీవ్ర ఇబ్బందులు మంకమ్మతోట : ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులకు బ్రేకులు పడ్డారుు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు సైతం 43 శాతం ఫిట్మెంట్ అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ విషయంపై పలు దఫాలుగా ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యూరుు. తాజాగా మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో జరిపిన చర్చలు సైతం ఫలించలేదు. 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో అర్ధరాత్రి నుంచే సమ్మె చేపట్టాలని గుర్తింపు సంఘాలైన ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో గుర్తింపు సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ కార్మికుల సంక్షేమం కోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని ఇతర యూనియన్లు ప్రకటించారుు. సమ్మెకు ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నోటీసు ఇవ్వగా.. టీఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ వంటి ఇతర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కార్మికులు 43శాతం ఫిట్మెంట్ కోరుతుండగా యాజమాన్యం 27శాతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈసారి పూర్తిస్థాయి ఫిట్మెంట్తోపాటు ఇతర డిమాండ్లు అంగీకరించకపోతే సమ్మె విరమించేది లేదని తెగేసి చెబుతున్నారుు. నిలిచిన బస్సులు సమ్మెతో జిల్లాలోని 11 డిపోల్లోని 915 బస్సులు నిలిచిపోయూరుు. వేసవి సెలవుల్లో ప్రయూణికుల రద్దీ పెరిగి.. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుందని యూజమాన్యం భావించింది. సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టిమ్స్ మిషన్, వన్మన్ ప్రైవేటు డ్రైవర్‌తో కొన్ని బస్సులు నడిపించాలని ఆర్టీసీ యూజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. వీరితోపాటు కాంట్రాక్టు కార్మికులుగా సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లతో పని చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ కూడా ఉండడంతో వారు సైతం సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. యాజమాన్యం 43శాతం ఫిట్మెంట్ ఇస్తుందనే ఆతృతతో ఎదురుచూస్తున్న కార్మికులు సమ్మె అనివార్యం అయితే స్వచ్చందంగా మద్దతు తెలుపుతామని కార్మికులు పేర్కొంటున్నారు. కార్మికుల హక్కులకు భంగం కల్గించేలా యాజమాన్యం వ్యవహరిస్తే వాటిని అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రయూణికులకు ఇబ్బందులు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మంగళవారం రాత్రి నుంచి బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం నుంచే తిరుపతి, బెంగళూరు, విజయవాడ, మహారాష్ర్ట, భీవండి, షిర్డీ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు చేయడంతో ఆయూ బస్టాండ్లలో ప్రయూణికులు పడిగాపులు పడ్డారు. బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కార్మిక సంఘాల జైల్‌భరో
విజయనగరం క్రైం: కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక చట్టాల్లో తెస్తున్న మార్పులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు కార్యాలయం వద్ద గురువారం నిరసనకు దిగారు. కార్మిక సంఘాల జైల్ భరో కార్యక్రమం పిలుపులో భాగంగా పోస్టాఫీసు కార్యాలయం ముందు కూర్చుని నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎం.ఆర్.కళాశాల జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గురంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఇన్సూరెన్స్‌లో రంగంలో విదేశీ పెట్టుబడి వాటాను 49 శాతానికి పెంచుతూ అర్డినెన్స్‌లు తెచ్చిందన్నారు. రైతుల ఆమోదంలేకుండా కార్పొరేట్ కంపెనీలకు భూ సమీకరణచేయడానికి చట్టంలో అర్డినెన్స్ ద్వారా మార్పులు చేసి, రైల్వే, రక్షణ ఇతర రంగాల్లో కూడా విదేశీపెట్టుబడులు తేవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆరోగ్యం, ఉపాధి ఇతర సామాజిక రంగాలకు బడ్టెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని, సామాజిక పథకాలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. సింగపూర్ లాంటిరాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని, గ్రిడ్లు, స్మార్ట్ల పేర్లతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నాన్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై నిర్భంధానికి పూనుకుంటోందని ఆరోపించారు. పెట్టుబడిదారులతో చర్చలు చేస్తున్న ప్రభుత్వం ప్రధాన కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించడానికి నిరాకరిస్తోందన్నారు. కార్మిక సంఘాల ఆందోళన సందర్భంగా జిల్లా కేంద్ర పోస్టల్ కార్యాలయంలో వన్‌టౌన్ పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు అనంతరం ఎం.ఆర్.కాలేజీ జంక్షన్ వద్ద కార్మిక సంఘ నాయకులను అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణంరాజు, ఆల్తి అప్పలనాయుడు,బుగత సూరిబాబు, ఆల్తి మారయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదిలి శ్రీనివాస్, అచ్చయ్య, ఇప్టూ నేత దవళ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
ఎదురుదెబ్బ!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం అనే శిఖండిని అడ్డుపెట్టుకుని కార్మికులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు తగిలింది. ఆర్టీపీపీలో కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యానికి అనుగుణంగా అడుగులేస్తున్న పోట్లదుర్తి బ్రదర్స్ నిర్ణయాల్ని ప్రతిఘటించారు. అధికార పార్టీ నిర్ణయాలు అమలు చేస్తున్న ఆర్టీపీపీ సీఈ వైఖరిని నిరసిస్తూ కార్మిక యూనియన్లు ఏకమయ్యాయి. వెరసి సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మికుల సమ్మెను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించారు.. కార్మికుల పొట్టకొట్టి లబ్ధిపొందాలనే లక్ష్యంతో శల్యసారధ్యం చేపట్టారు. ఆర్టీపీపీలో భూనిర్వాసితుల్ని కాదని అనుచరుల్ని చేర్పించుకునే లక్ష్యంతో తెలుగుదేశం నేతలు పావులు కదిపారు. అందులో భాగంగా కార్మికులు న్యాయమైన డిమాండ్లను కాదని, యాజమాన్యానికి ఒత్తాసుగా నిలిచారు. 1200 మంది కార్మికులు ఏకతాటిపై నిలిచి ఆందోళనకు సిద్ధమైతే వ్యూహాత్మకంగా యాజమాన్యంతో చేతులు కలిపి ఉద్యమాన్ని నీరుగార్చారు. అర్ధరాత్రి విధుల్లోకి అనుచరగణాన్ని తీసుకువచ్చి కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈమొత్తం వ్యవహారంలో పోట్లదుర్తి బ్రదర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పావులు కదుపుతూ వచ్చారు. వారి చర్యలను కార్మిక యూనియన్లు ప్రతిఘటించాయి. ఆర్టీపీపీకి సమ్మె నోటీసు జారీ చేసి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని పరోక్ష ంగా హెచ్చరించారు. కడపు మండడంతోనే ఆందోళన... ఆర్టీపీపీ ఇంజనీరింగ్ అధికారులు ఇతర ఉద్యోగుల జీతాలు 30 శాతం పెంచుకుంటూ జిఓ నెంబర్ 34 జారీ చేశారు. అదే సమయంలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, వారి జీతభత్యాలు, స్థితిగతులపై అధ్యయనం చేయాలని జిఓ నెంబర్ 35 జారీ చేశారు. ఆమేరకు డెరైక్టర్ స్థాయి అధికారులతో కూడిన నలుగురు గల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జూలై చివరకు యాజమాన్యానికి నివేదిక అందజేయాల్సి ఉంది. అంటే దాదాపు 5నెలల క్రితం కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులపై నివేదిక అందించాల్సి ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కార్మికుల పొట్టకొట్టే చర్యల్లోనే నిమగ్నం కావడంతో ఆర్టీపీపీ కార్మికులు ఏకకాలంలో 1200 మంది ధర్నా చేపట్టారు. సీఈ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కారించాల్సింది పోయి రాజకీయాల్ని చొప్పించారు. తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అయి బయటి నుంచి 150మంది కార్మికుల్ని అనుమతించారు. దాంతో ఒక్కమారుగా కార్మికుల్లో అలజడి ఏర్పడింది. ఆందోళనలో ఉంటే ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని కార్మికుల్లో ఐక్యత సన్నగిల్లింది. ఆమేరకు వారి ఆందోళన నీరుగారింది. అయితే కొంతమందిని విధుల్లోకి అనుమంతించకుండా సీఈ నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారిని కాదని, తెలుగుదేశం పార్టీ సిఫార్సులకు తలొగ్గి కార్మికులను తొలగిస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. సీఈ ఆశించిన మేరకు స్పందించకపోవడంతో కార్మికుల యూనియన్లు సమ్మె నోటీసును జారీ చేశాయి. కార్మికులకు అన్యాయం జరిగితే సహించమని ఏకతాటిపైకి యూనియన్లు రావడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారు. అండగా నిలుస్తోన్న వైఎస్సార్సీపీ.... ఆర్టీపీపీలో కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. అనేక పర్యాయాలు ప్రత్యక్ష ఆందోళన చేపట్టిన ఎంపీ, ఎమ్మెల్యేలు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని జన్కో డెరైక్టర్లును కలిశారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్మికులను కాదని, వారి ఆందోళన చేస్తుండడగానే ఇతరుల్ని ఎలా అనుమతిస్తారంటూ నిలదీసినట్లు సమాచారం. ఆర్టీపీపీలో ఏ ఒక్క కార్మికునికి అన్యాయం చేసినా ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం. -
‘పోలవరం’తో ఆదివాసీల జలసమాధి
ప్రాజెక్టును రద్దు చేసే వరకూ పోరాటం కొందరి ప్రయోజనాల కోసమే మోడీ, బాబు కుట్ర ద ళితులతో పాటు పేదలకూ భూమి పంచాలి టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ కేయూ క్యాంపస్ : పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం జరిగితే లక్షలాది మంది ఆదివాసీలు జల సమాధి కానున్నారని, ఈ విపత్తును చూడడానికేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ ప్రశ్నించారు. ఇదే జరిగితే ఆదివాసీ సమాజం తెలంగాణ పాలకు లను క్షమించబోదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును రద్దు చేసే వరకు ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశా రు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీఏకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యం లో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో ప్రభాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర పన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి, పోడు వ్యవసాయంతో బతుకీడుస్తున్న 2-3 లక్షల వరకు ఆదివాసీలు జలసమాధి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్, టీ జేఏసీ నాయకులు కూడా పోలవరం డిజైన్ మార్పునకు పోరాడుతున్నారే తప్ప ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. మేధావులుగా భా వించే వారు స్వప్రయోజనాల కోసం సెక్రటరియేట్‌కు క్యూ కడుతూ పోలవరంపై పెదవి విప్పకపోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ యావత్ సమాజం రాష్ట్రం కోసం ఉద్యమించినట్లుగా పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలనే డిమాండ్‌తో పోరాడాలని, దీనికి తాను నేతృత్వం వహిస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు. మిగతా వర్గాల మాటేమిటి? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తన విధానాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెబుతున్న పాలకులు గిరిజ న, బీసీ తదితర వర్గాల్లో భూమి లేని నిరుపేదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పిన టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో కాల్పు లు జరిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. పాలకులది మొండివైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు విషయంలో మొండివైఖరిని అవలంభిస్తున్నాయని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘా ల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనేని నర్సాగౌడ్ విమర్శించారు. ప్రాజెక్టు రద్దు కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అందరూ సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉన్నా ఆదివాసీలను ముంచే పోలవరం పై శ్రద్ధ ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ఈక్రమంలో నిర్వాసితులయ్యే ఆదివాసీలను పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. ససదస్సులో టీఏకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరాజు, తుడందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, తెలంగాణ సహజ వనరుల సంరక్షణ సమితి జిల్లా కన్వీనర్ నల్లెల రాజయ్య, టీఏకేఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము రవి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన సుధాకర్, తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూరక యాదగిరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సిటీ బంద్
ఎంఎంటీఎస్‌లు యధాతథం పరిస్థితిని బట్టి బస్సుల రాకపోకలు: ఆర్టీసీ సాక్షి, సిటీబ్యూరో: పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలో కూడా బంద్ ప్రభావం కనిపించనుంది. బంద్ దృష్ట్యా పోలీసుల సూచనలు, సలహా మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలి పారు. మరోవైపు నగరంలోని 121 ఎంఎంటీఎస్ సర్వీసులు, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలి పారు. ఈ బంద్‌కు ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ ఆటోలు మాత్రం యధావిధిగా నడుస్తాయని చెప్పారు. -
మళ్లీ కోతపెడితే మెరుపు సమ్మె
కార్మికుల జీతాల్లో కోతతో కొత్త బస్సుల కొనుగోలుపై కార్మికుల భగ్గు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరికతో ఆర్టీసీ యాజమాన్యం వెనుకడుగు గత నెలలో ఇలాగే 24 బస్సుల కొనుగోలు హైదరాబాద్: వేతనాల్లో కోతపెట్టి కొత్త బస్సులు కొనాలనే ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై కార్మికులు భగ్గుమన్నారు. కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. గత నెలలో ఆర్టీసీ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని మినహాయించిన అధికారులు వాటితో 24 కొత్త బస్సులు కొన్నారు. ఒక్క నెల, ఒక్కరోజే కదా అని అప్పట్లో కార్మికులు పెద్దగా నిరసన తెలపలేదు. కానీ, దాన్ని ఏకంగా ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం జూన్ నెల వేతనాల్లో కూడా కోత పెట్టేందుకు సిద్ధమైందన్న సంగతి తెలిసి కార్మికులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నెలవారీ కోత రూ.4.5 కోట్లు...: తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయడం భారంగా మారింది. దీంతో సిబ్బంది ‘చేయూత’తో గట్టెక్కేలా ఉన్నతాధికారి ఒకరు యాజమాన్యం ముందుకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతినెలా సిబ్బంది వేతనాల్లోంచి ఒకరోజు మొత్తాన్ని మినహాయిస్తే రూ.4.5 కోట్లు జమవుతుందని, దీంతో ప్రతినెలా జిల్లాకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి)ఓ బస్సు చొప్పున కొనవచ్చనేది ఆ ప్రతిపాదన. ఇదేదో బాగుందనుకున్న యాజమాన్యం గుర్తింపు పొందిన యూనియన్ నేతలతో భేటీ నిర్వహించి విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చింది. ఒకరోజు వేతనంతో ఏకంగా 24 బస్సులు కొనే అవకాశం ఉండడంతో దానికి వారు కూడా సరేనన్నారు. దీంతో మే నెలలో ఒకరోజు కోతపెట్టి రూ.4.5 కోట్లతో 24 బస్సులు కొన్నారు. కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైనా యూనియన్ నాయకులు సర్దిచెప్పారు. అయితే, జీతంలో కోత నిర్ణయాన్ని ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్న అధికారులు జూన్ నెలలోనూ కట్ చేసేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలోనే కార్మికులను అతికష్టమ్మీద ఒప్పించామని, ఇప్పుడు ఏకంగా 12 నెలల పాటు కోతపెడతామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. కొత్త బస్సులను ప్రభుత్వ నిధులతోనో, గ్రాంట్లతోనే, కేంద్రం సాయంతోనే కొనాలి తప్ప ఇలా కార్మికుల వేత నాలతో కొనడం సరికాదంటూ మెరుపు సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు జీతంలో కోత పెట్టడం లేదంటూ ప్రకటించారు. -
బంద్‌కు సన్నద్ధం
ఉద్యోగ సంఘాల మద్దతు సాక్షి,సిటీబ్యూరో: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణవాదులు బంద్ ను విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. పారిశుద్ధ్య విధులు మినహా మిగతా సేవలు నిలిపివేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు గోపాల్ తెలిపారు. తెలంగాణ టీచర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ కమిషనర్ నియామకం మినహా మిగతా డీసీపీ మొదలు అదనపు కమిషనర్ల వరకు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారులనే కొన సాగించేలా ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు అక్కడి డీసీపీలు జాయింట్ పోలీసు కమిషనర్ కూడా యథాతథంగా ఉంటారు. ఈ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు నెల, రెండు నెలల తరువాతే జరుగుతాయని అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది. అనురాగ్‌శర్మ కోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇదిలా ఉండగా ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్న నగర పోలీసు కమిషనర్ స్థానాన్ని డీజీపీ హోదాకు పెంచుతూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం డీజీ హోదాలో కొత్వాల్‌గా కొనసాగుతున్న అనురాగ్‌శర్మ కోసమే జారీ చేశారని తెలిసింది. తిరిగి కమిషనర్ స్థానాన్ని డీజీ స్థాయి నుంచి అదనపు డీజీ స్థాయికి కుదిస్తారని, బుధవారం వెలువడిన ఉత్తర్వులు తాత్కాలికమే అని తెలుస్తోంది. కొత్త కొత్వాల్ ముందు పెనుసవాళ్లు నగర 55వ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోయే అధికారి ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సచివాలయాలు, అసెంబ్లీలు, రెండు రాష్ట్రాల ఆందోళనలకు హైదరాబాద్ కేంద్ర బిందువు కావడంతో బందోబస్తు పెద్ద సమస్యగా మారనుంది. దీంతో పాటు రోజువారి బందోబస్తు, క్రైమ్ అలర్ట్ తదితర విధులు మన పోలీసులకు ఉండనే ఉన్నాయి. ఇంత పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న నగర పోలీసు సిబ్బంది సంఖ్యకు మరో 5500 మంది కానిస్టేబుళ్లను పెంచాల్సిన అవసరం ఉందని ఇప్పటికే గవర్నర్‌తో పాటు ప్రభుత్వానికి డీజీపీ ప్రసాదరావు ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు రెండు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్)లు కూడా అవసరం ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డి నేపథ్యం... మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా రాష్ట్ర కేడర్‌కు ఎంపికయ్యాక నిజామాబాద్ ఎస్పీగా, నగర తూర్పు మండలం డీసీపీగా జాతీయ పోలీస్ అకాడమీలో ఎస్పీ స్థాయిలో పనిచేసి అక్కడే డీఐజీ స్థాయిలో పదోన్నతి పొందారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (ఫిబ్రవరి 12, 2003) ఏర్పడిన తరువాత తొలి కమిషనర్‌గా నియమితులయ్యారు. నాలుగేళ్ల అనంతరం ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే అదనపు డీజీగా పదోన్నతి పొంది ఆ విభాగానికి అధిపతి అయ్యారు. దాదాపు ఐదు సంవత్సరాలకు పైగానే ఆయన నిఘా విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. -
కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం..
ఆందోళనలపై ఉక్కుపాదం.. ‘పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే కార్మిక సంఘా లనే రద్దు చేస్తా... ఐదారు వేల మందిని తీసుకొచ్చి ప్రదర్శన చేసినంత మాత్రాన భయపడేవాణ్ని కాదు...’ తమ సమ స్యలను నివేదించుకునేందుకు వచ్చిన విద్యా వలం టీర్ల మీద చంద్రబాబు విరుచుకు పడిన తీరిది. ఉత్తుత్తి హామీలు రాష్ట్రంలో 2000 సంవత్సరం నాటికి లక్ష కోట్ల రూపాయలు పారిశ్రామిక పెట్టుబడి లక్ష్యాన్ని సాధిస్తాం - ముఖ్యమంత్రి ప్రకటన (19.10.96) గత ఏడాది 3203 కోట్లతో 52 మంది పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఈ ఏడాది 1003 కోట్లతో 26 కొత్త ప్రతిపాదనలు మాత్రమే అందాయి. (18.7.97న పత్రికావార్త) -
గల్ల్లీగల్లీలో గలీజే..
నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే.. పూర్తిగా స్తంభించిన పారిశుద్ధ్యం పట్టువదలని కార్మికులు.. మెట్టు దిగని ప్రభుత్వం శ్రీనగర్‌కాలనీ,న్యూస్‌లైన్: కనీసవేతనాల పెంపు, మధ్యంతభృతి ఇవ్వాలని, ఆరోగ్యకార్డులు తదితర డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నగరంలో ఉద్ధృతమైంది. అన్ని కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టడంతో నగర వీధులన్నీ అధ్వానంగా మారాయి. రోడ్లు ఊడ్చేవారు లేరు..చెత్త ఎత్తేవారు కరువయ్యారు..డ్రైనేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు. నీళ్లన్నీ రోడ్లపైకొచ్చి గలీజుగా మారుతున్నాయి. గల్లీల్లోనే కాకుండా ప్రధానమార్గాల్లో చెత్తకంపు కొడుతోంది. గుట్టగుట్టలుగా పేరుకుపోతున్న చెత్తతో వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. కార్మికులు సమ్మెకు దిగడంతో చెత్తను తరలించే వాహనాలు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నా..అమలులో ఎక్కడా కనిపించ డం లేదు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మికులు చెబుతుంటే..సమస్యను మంత్రి సమక్షంలో సోమవారం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు మద్దతుగా ఆదివారం నగరంలోని ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో రాస్తారోకో : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం ఖైరతాబాద్ చౌరస్తాలో బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తదితర 9 సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పెద్దఎత్తున కార్మికులు చేరుకొని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఎంఎస్ నాయకుడు శంక ర్, సీఐటీ యూ రాష్ట్రకార్యదర్శి పాలడుగు భాస్కర్లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల మంది కార్మికులు మున్సిపాలిటీ, సంబంధిత శాఖల్లో పనిచేస్తున్నా వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.12,500 కనీస వేతనం పెంచుతామని ప్రభుత్వం హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. పారిశుధ్యంపై మేయర్ సమీక్ష సిటీబ్యూరో: సమ్మె నేపథ్యంలో మేయర్ మాజిద్‌హుస్సేన్ జీహెచ్ఎంసీ అధికారులు, ఆయా పార్టీల ఫోర్ల్లీడర్లతో ఆదివారం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడం వల్ల నగరవాసుల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితి చేజారకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించాలని మేయర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కాగా పారిశుధ్య పనుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. నగరంలో పేరుకుపోయిన చెత్త తొలగింపును అధికారులతో కలిసి పరిశీలించారు. విధులకు వెళ్లి విగతజీవిగా.. కూకట్పల్లి: స్థానికులు,అధికారుల ఒత్తిళ్లతో ఓ పారిశుద్ధ్య కార్మికుడు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక దుర్మరణం పాలయ్యాడు. ఎం.వెంకటయ్య(40) ఫతేనగర్‌లో ఉంటూ కూకట్పల్లి సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సమ్మె జరుగుతుండడంతో రెండురోజులుగా విధులకు దూరంగా ఉన్నాడు. కూకట్పల్లి దేవీనగర్‌లోని రోడ్డునెం.2లోని మ్యాన్‌హోల్ వద్ద మురుగునీరు సాఫీగా పోకపోవడంతో స్థానికులు,అధికారుల ఒత్తిడితో వెంకటయ్య తప్పనిసరి స్థితిలో మ్యాన్హోల్లోకి దిగాడు. శుభ్రం చేస్తుండగా ఊపిరాడక కాసేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు, కార్మిక సంఘాల నేతలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంటల్ పాలసీ కింద రూ.4లక్షల మంజూరుతోపాటుఈఎస్ఐ,పీఎఫ్‌ల ద్వారా రూ.2 లక్షలు మంజూరుచేయనున్నట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ ప్రకటించారు. మృతుడిది వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పోచంపల్లి. -
‘కారుణ్యం’ నిరంతరం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో నిరంతరాయంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం... మృతి చెందిన సిబ్బంది కుటుంబసభ్యుల్లో అర్హులైనవారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగమమైంది. 2010 నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 1,400 మందికి తాజా ఉత్తర్వులతో తక్షణమే ప్రయోజనం కలగనుంది. 1998 వరకు అవకాశం ఉన్నప్పుడల్లా కారుణ్య నియామకాలు చేపట్టే వెసులుబాటు ఉండగా, ఆ తర్వాత దానికి బ్రేక్ పడింది. అప్పటి నుంచి నియామకాలు లేకపోవటంతో వందల మంది ఎదురుచూడాల్సి వచ్చింది. కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి పెరగటంతో ఎట్టకేలకు 2013లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే... 2010 డిసెంబర్ 31 వరకు మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకే దాన్ని పరిమితం చేశారు. దీంతో అప్పట్లో 1,120 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి ప్రారంభించాయి. ఇటీవల సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో భాగంగా జరిగిన సమ్మెను విరమింపచేసే ప్రయత్నంలో భాగంగా కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనికి అప్పట్లో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 2010 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించటంతో పాటు ఇక నుంచి అవసరమైనప్పుడల్లా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తాజా ఉత్తర్వులపై ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
నష్టాల బాటలో ఆర్టీసీ
సాక్షి, విశాఖపట్నం: ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ అన్నట్టు తయారైంది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిస్థితి. ఎనిమిది రోజులుగా పెద్దసంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో లక్షల్లో నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి రాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఏటా రూ.2 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే ముందు న్న విశాఖ రీజియన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు తప్పే లా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా యాభై శాతం బస్సులే రోడ్డెక్కుతున్నాయి. రోజుకి రూ.70 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటికే రూ.30 లక్షల వరకు గండిపడింది. సమ్మెతో మరింత నష్టాలు తప్పవని భావిస్తున్నారు. రీజియన్‌లో సుమారు 1060 బస్సులున్నాయి. ఇందులో 240 బస్సులు ప్రైవేట్‌వి. వీటి ద్వారా అయినా ఆదాయం రాబట్టుకునే పరిస్థితి లేదు. ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్‌ఎంఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆర్టీసీ సంఘాలన్నీ సంఘీభావం ప్రకటించా యి. భద్రతా సిబ్బంది, అడ్మిన్స్టాఫ్, అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఉద్యమంలో పాల్గొంటున్నారు. చాలా బస్సులు రద్దు తెలంగాణ విభజన నిర్ణయం తరువాత రాజో లు, అమలాపురం, నర్సాపురం వైపు బస్సులు వెళ్లడం లేదు. శ్రీకాకుళం వైపు పాక్షికంగానే తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలకు పగటి పూట కాకుండా రాత్రి వేళల్లోనే బస్సుల్ని పంపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రం 90 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు పంపిస్తున్నా అవి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. దీంతో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి. సమ్మె ప్రారంభమైతే లాభార్జన స్థానంలో రూ.కనీసం 8 కోట్లు నష్టపోవడం తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోనీ చార్జీలు పెంచి భర్తీ చేసుకుందామనుకున్నా రోజురోజుకి విభజన ఉద్యమాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇదీ సాధ్యమని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ఆర్టీసీ ఈ దెబ్బనుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.