- రూ.4 వేతనం పెంపు
- యాజమాన్యాలతో ముగిసిన కార్మిక సంఘాల చర్చలు
- బీడీ కార్మికుల్లో నిరాశ
కోరుట్ల: బీడీ కంపెనీల యాజమాన్యాలు ఎట్ట కేలకు చేయి విదిల్చాయి. నామమాత్రపు వేతన పెంపుతో బీడీ కార్మికులు సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం బీడీ యాజ మాన్యాలు కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం 2016 మే నెలతో ముగి సింది. మళ్లీ వేతన పెంపు కోసం కార్మిక సంఘాలుజాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీడీ కంపెనీలకు నోటీసులిచ్చి ఉద్య మించాయి. మంగళవారం హైదరాబాద్‌లో యాజమాన్యాలు చర్చలు జరిపాయి.
వేతన పెంపు రూ.4 మాత్రమే
వేతన పెంపు కోసం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, బీఎంఎస్) ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు బీడీ కార్మికుల మూల వేతనం రూ.101లో సగం మేర వేతనం రూ.50 వరకు పెంచాలని డిమాండ్ చేయగా బీడీ కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. యాజమాన్యాలు ససేమిరా అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేయి బీడీలకు రూ.4 వేతనం పెంపునకు కార్మిక సంఘాల యాక్షన్ కమిటీ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది.
సమాన పనికి సమాన వేతనం లెక్కన ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా రూ.1,100 చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని జగి త్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు 5.50 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కొత్తగా మంగళవారం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కంపెనీలతో చేసుకున్న వేతన ఒప్పందం బీడీ కార్మికుల్లో నిరాశను నింపింది. ఒప్పందం అసంతృప్తిని మిగిల్చిందని తెలగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింత భూమేశ్వర్ అన్నారు.
నామమాత్రపు పెంపు
Published Thu, Dec 29 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement