సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీతో కార్మిక సంఘాలు శనివారం భేటీ అయ్యాయి. కార్మిక సంఘాల నేతలతో సీఎండీ అరుణ్ భక్షీ సంచలన విషయాలు చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు రూ.2500 కోట్లు నిధులు విడుదల చేశారన్నది అవాస్తవమని తెలిపారు. నిధుల విడుదల అయినట్టు నాకు సమాచారం లేదు. ఢిల్లీలో ఉక్కు శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం నేను చెప్పలేను. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నా’’ అంటూ సీఎండీ స్పష్టం చేశారు.
కాగా, స్టీల్‌ప్లాంట్ సీఎండీతో పోరాట కమిటీ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ముడిసరుకు సరఫరా చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అరకొరగా నిధులు విడుదల చేసినా.. మళ్లీ గడ్డు పరిస్థితి తప్పదని కార్మికులు వివరించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’
మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు.. కూటమి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్‌పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం.. స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment