
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా... ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు తెలిపాయి. ఈ వివరాలను ఐడీబీఐ బ్యాంకు బీఎస్‌ఈకి తెలియజేసింది. సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. అయితే కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. బీవోబీ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చింది. ప్రైవేటు రంగ కరూర్ వైశ్యా బ్యాంకు సైతం ఉద్యోగుల సమ్మె కారణంగా తమ కార్యకలాపాలకు విఘాతం కలగొచ్చని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగులు గత నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు సమ్మె చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment