- ఎంఎంటీఎస్‌లు యధాతథం
- పరిస్థితిని బట్టి బస్సుల రాకపోకలు: ఆర్టీసీ
సాక్షి, సిటీబ్యూరో: పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలో కూడా బంద్ ప్రభావం కనిపించనుంది.
బంద్ దృష్ట్యా పోలీసుల సూచనలు, సలహా మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలి పారు. మరోవైపు నగరంలోని 121 ఎంఎంటీఎస్ సర్వీసులు, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలి పారు.
ఈ బంద్‌కు ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ ఆటోలు మాత్రం యధావిధిగా నడుస్తాయని చెప్పారు.