సర్కారుపై కార్మికుల కన్నెర్ర
సర్కార్ తీరుపై మునిసిపల్ కార్మికులు కన్నెర్రజేశారు. వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని 41 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనను తీవ్రం చేశారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌ను ముట్టడించారు. లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు కార్మికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికుడు రాజు చేయి విరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు.
- కలెక్టరేట్‌ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులు
- ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేసిన పోలీసులు
- పలువురికి గాయూలు
ప్రగతినగర్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంపై కార్మికులు కన్నెర్ర జేశారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు లోపలికి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అక్కడే ఉన్న మరికొందరు బైఠారుుంచి కేసీఆర్ తీరు నిజాం తీరులా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే రోడ్డున పడ్డారు.
తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కేసీఆర్ సర్కార్‌పై ‘కార్మికయుద్ధం’ ప్రకటిస్తామని వామపక్ష సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కార్పోరేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి తిలక్‌గార్డెన్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఉన్న పోలీసులు కార్మికులు, వామపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డుకున్న కార్మికులను ఈడ్చుకుంటూ వెళ్లి వ్యానులో ఎక్కించారు. కొందరు కార్మికులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోర్టు చౌరస్తా వద్ద రాస్తారోకో, మానవాహారం నిర్వహించారు.
పలువురికి గాయాలు...
తమ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలువురు కార్మికులు, నాయకులు వాహనాలను అడ్డుకోవడంతో వారికి గాయూలయ్యూరుు. కామారెడ్డి మున్సిపాలిటీ కార్మికుడు రాజుకు కుడి చేయి విరుగగా, కొందరు మహిళా కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దిక్కుమాలిన సర్కార్ : ప్రభాకర్
కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా వారికి మద్దతు తెలుపుతున్న సంఘాలు, కార్మికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ దిక్కుమాలిన సమ్మె అనడం ఆయ న మూర్ఖత్వానికి నిదర్శనం అని వామపక్ష సంఘం నాయకుడు ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి హక్కులపై పోరాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు.
అరెస్టయింది వీరే...
కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్ష నాయకులను పొలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి మొదటి,నాలుగో టౌన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఎం నాయకులు వి.ప్రభాకర్, దండి వెంక ట్, సీపీఐ జిల్లా కార్యాదర్శి కంజర భూమయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ, ఏఐటీయూ సీ నాయకులు ఓమయ్య, సుధాకర్, నాయకులు సిద్ధిరాములు, నూర్జహాన్, శ్యాంబాబు,గోవర్ధన్ ఉన్నారు.