- ప్రాజెక్టును రద్దు చేసే వరకూ పోరాటం
- కొందరి ప్రయోజనాల కోసమే మోడీ, బాబు కుట్ర
- ద ళితులతో పాటు పేదలకూ భూమి పంచాలి
- టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్
కేయూ క్యాంపస్ : పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం జరిగితే లక్షలాది మంది ఆదివాసీలు జల సమాధి కానున్నారని, ఈ విపత్తును చూడడానికేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ ప్రశ్నించారు. ఇదే జరిగితే ఆదివాసీ సమాజం తెలంగాణ పాలకు లను క్షమించబోదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును రద్దు చేసే వరకు ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశా రు.
తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీఏకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యం లో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో ప్రభాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర పన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమయ్యారని ఆరోపించారు.
ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి, పోడు వ్యవసాయంతో బతుకీడుస్తున్న 2-3 లక్షల వరకు ఆదివాసీలు జలసమాధి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీఆర్‌ఎస్, టీ జేఏసీ నాయకులు కూడా పోలవరం డిజైన్ మార్పునకు పోరాడుతున్నారే తప్ప ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. మేధావులుగా భా వించే వారు స్వప్రయోజనాల కోసం సెక్రటరియేట్‌కు క్యూ కడుతూ పోలవరంపై పెదవి విప్పకపోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ యావత్ సమాజం రాష్ట్రం కోసం ఉద్యమించినట్లుగా పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలనే డిమాండ్‌తో పోరాడాలని, దీనికి తాను నేతృత్వం వహిస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు.
మిగతా వర్గాల మాటేమిటి?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన విధానాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెబుతున్న పాలకులు గిరిజ న, బీసీ తదితర వర్గాల్లో భూమి లేని నిరుపేదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పిన టీఆర్‌ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో కాల్పు లు జరిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు.
పాలకులది మొండివైఖరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు విషయంలో మొండివైఖరిని అవలంభిస్తున్నాయని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘా ల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనేని నర్సాగౌడ్ విమర్శించారు. ప్రాజెక్టు రద్దు కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అందరూ సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉన్నా ఆదివాసీలను ముంచే పోలవరం పై శ్రద్ధ ఎందుకు అర్థం కావడం లేదన్నారు.
ఈక్రమంలో నిర్వాసితులయ్యే ఆదివాసీలను పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. ససదస్సులో టీఏకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరాజు, తుడందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, తెలంగాణ సహజ వనరుల సంరక్షణ సమితి జిల్లా కన్వీనర్ నల్లెల రాజయ్య, టీఏకేఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము రవి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన సుధాకర్, తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూరక యాదగిరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.