3 లక్షల కొత్త పీఎఫ్ ఖాతాలు: దత్తాత్రేయ
3 లక్షల కొత్త పీఎఫ్ ఖాతాలు: దత్తాత్రేయ
Published Mon, May 29 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల కొత్త పీఎఫ్ (భవిష్య నిధి) ఖాతాలు తెరిచినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 67 లక్షల మంది పీఎఫ్ ఖాతాలు తెరిచారని, ఉద్యోగ భవిష్య నిధిలో రూ.11.50 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ఆదివారం పీఎఫ్ కార్యాల యంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగ భవిష్య నిధిలో 4.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. మొత్తం భవిష్య నిధుల్లో 10 శాతం లోపు నిధులనే స్టాక్ ఎక్సే్చంజ్‌లో పెట్టుబడి పెట్టామని, వాటి ద్వారా ఇప్పటివరకు 13.72 శాతం వడ్డీ వచ్చిందన్నారు. ఎక్సే్చంజ్‌లో పెట్టుబడులను కార్మిక సంఘాలు మొదట్లో వ్యతిరేకించినా, శనివారం పుణేలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ విధానాన్ని స్వాగతించాయన్నారు. సమర్థవంతమైన నిర్వహణతో రూ.234.86 కోట్లు డివిడెండ్ లభించిందన్నారు. ట్రేడెడ్ ఫండ్స్ నిర్వహణలో సమర్థంగా పని చేస్తున్న బ్రెజిల్, కెనడా, అమెరికా, సింగపూర్‌లలో పర్యటించి అధ్యయనం చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. యూఏఎన్‌తో ఉద్యోగుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ 50 శాతం పూర్తయిందని, త్వరలో వంద శాతం సీడింగ్ పూర్తి చేస్తామన్నారు.
ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు రూ. 20వేల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మార్కెట్లో ఎంప్లాయీస్ ప్రావి డెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పెట్టుబడులు రూ. 20,000 కోట్లకు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. శనివారం పుణేలో సమావేశమైన ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు.. ఈక్విటీల్లో పెట్టుబడుల ను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. 2015 ఆగస్టు నుంచి ఈక్విటీ పెట్టుబడులు ప్రారంభించగా, ఈటీఎఫ్‌లో తమ పెట్టుబడులపై వార్షిక రాబడి 13.72 శాతంగా ఉందని దత్తాత్రేయ తెలిపారుు. ఈ పెట్టుబడులపై డివిడెండ్ల రూపంలో రూ. 235 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు.
Advertisement
Advertisement