breaking news
New PF accounts
-
ఈపీఎఫ్‌వో ‘కొత్త’ రికార్డ్..
ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్‌వోకు జూన్‌లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్‌వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్‌లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్‌స్కయిబర్లు ఎన్రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్‌లో ఈపీఎఫ్‌వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్‌వో కొత్త సబ్స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్ -
3 లక్షల కొత్త పీఎఫ్ ఖాతాలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల కొత్త పీఎఫ్ (భవిష్య నిధి) ఖాతాలు తెరిచినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 67 లక్షల మంది పీఎఫ్ ఖాతాలు తెరిచారని, ఉద్యోగ భవిష్య నిధిలో రూ.11.50 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ఆదివారం పీఎఫ్ కార్యాల యంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగ భవిష్య నిధిలో 4.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. మొత్తం భవిష్య నిధుల్లో 10 శాతం లోపు నిధులనే స్టాక్ ఎక్సే్చంజ్‌లో పెట్టుబడి పెట్టామని, వాటి ద్వారా ఇప్పటివరకు 13.72 శాతం వడ్డీ వచ్చిందన్నారు. ఎక్సే్చంజ్‌లో పెట్టుబడులను కార్మిక సంఘాలు మొదట్లో వ్యతిరేకించినా, శనివారం పుణేలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ విధానాన్ని స్వాగతించాయన్నారు. సమర్థవంతమైన నిర్వహణతో రూ.234.86 కోట్లు డివిడెండ్ లభించిందన్నారు. ట్రేడెడ్ ఫండ్స్ నిర్వహణలో సమర్థంగా పని చేస్తున్న బ్రెజిల్, కెనడా, అమెరికా, సింగపూర్లలో పర్యటించి అధ్యయనం చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. యూఏఎన్‌తో ఉద్యోగుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ 50 శాతం పూర్తయిందని, త్వరలో వంద శాతం సీడింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈపీఎఫ్ఓ పెట్టుబడులు రూ. 20వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మార్కెట్లో ఎంప్లాయీస్ ప్రావి డెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పెట్టుబడులు రూ. 20,000 కోట్లకు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. శనివారం పుణేలో సమావేశమైన ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు.. ఈక్విటీల్లో పెట్టుబడుల ను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. 2015 ఆగస్టు నుంచి ఈక్విటీ పెట్టుబడులు ప్రారంభించగా, ఈటీఎఫ్‌లో తమ పెట్టుబడులపై వార్షిక రాబడి 13.72 శాతంగా ఉందని దత్తాత్రేయ తెలిపారుు. ఈ పెట్టుబడులపై డివిడెండ్ల రూపంలో రూ. 235 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు.