మొదలైన ఆర్టీసీ సమ్మె
జిల్లాలో నిలిచిన 915 బస్సులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యాజమాన్యం
ప్రయూణికులకు తీవ్ర ఇబ్బందులు
మంకమ్మతోట : ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులకు బ్రేకులు పడ్డారుు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు సైతం 43 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ విషయంపై పలు దఫాలుగా ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యూరుు.
తాజాగా మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో జరిపిన చర్చలు సైతం ఫలించలేదు. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో అర్ధరాత్రి నుంచే సమ్మె చేపట్టాలని గుర్తింపు సంఘాలైన ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో గుర్తింపు సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ కార్మికుల సంక్షేమం కోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని ఇతర యూనియన్లు ప్రకటించారుు.
సమ్మెకు ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నోటీసు ఇవ్వగా.. టీఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ వంటి ఇతర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కార్మికులు 43శాతం ఫిట్‌మెంట్ కోరుతుండగా యాజమాన్యం 27శాతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈసారి పూర్తిస్థాయి ఫిట్‌మెంట్‌తోపాటు ఇతర డిమాండ్లు అంగీకరించకపోతే సమ్మె విరమించేది లేదని తెగేసి చెబుతున్నారుు.
నిలిచిన బస్సులు
సమ్మెతో జిల్లాలోని 11 డిపోల్లోని 915 బస్సులు నిలిచిపోయూరుు. వేసవి సెలవుల్లో ప్రయూణికుల రద్దీ పెరిగి.. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుందని యూజమాన్యం భావించింది. సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టిమ్స్ మిషన్, వన్‌మన్ ప్రైవేటు డ్రైవర్‌తో కొన్ని బస్సులు నడిపించాలని ఆర్టీసీ యూజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. వీరితోపాటు కాంట్రాక్టు కార్మికులుగా సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లతో పని చేయించుకోవడానికి సిద్ధమవుతోంది.
కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ కూడా ఉండడంతో వారు సైతం సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. యాజమాన్యం 43శాతం ఫిట్‌మెంట్ ఇస్తుందనే ఆతృతతో ఎదురుచూస్తున్న కార్మికులు సమ్మె అనివార్యం అయితే స్వచ్చందంగా మద్దతు తెలుపుతామని కార్మికులు పేర్కొంటున్నారు. కార్మికుల హక్కులకు భంగం కల్గించేలా యాజమాన్యం వ్యవహరిస్తే వాటిని అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రయూణికులకు ఇబ్బందులు
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మంగళవారం రాత్రి నుంచి బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం నుంచే తిరుపతి, బెంగళూరు, విజయవాడ, మహారాష్ర్ట, భీవండి, షిర్డీ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు చేయడంతో ఆయూ బస్టాండ్లలో ప్రయూణికులు పడిగాపులు పడ్డారు. బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బస్సులకు బ్రేక్
Published Wed, May 6 2015 3:24 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement