
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ దాడుల వ్యవహారం హాట్ టాపిక్ మారింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ అనూహ్య దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. కాగా, దాడుల సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఐటీ అధికారులపై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో, భద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఫిర్యాదుపై నాలుగు వారాల పాటు కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment