నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్ | 400 km bicycle ride from the city | Sakshi
Sakshi News home page

నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్

Published Sat, Sep 3 2016 10:03 PM | Last Updated on Fri, Aug 10 2018 4:35 PM

నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్ - Sakshi

నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్

దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌ మండలం దూలపల్లి సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం హైదరాబాద్‌–400 ద గ్లోరీ 400 బ్రెవట్‌ సైకిల్‌రైడ్‌ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌ రౌండోనర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఇంటర్నేషనల్‌ వెటరన్‌ అథ్లెటిక్, కళాశాల  చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 27 గంటల్లో 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని 42 మంది రైడర్లు ఛేదించనున్నారు.

సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ఈ రైడ్‌ ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, గండిమైసమ్మ చౌరస్తా, బహదూర్‌పల్లి మీదుగా దూలపల్లిలోని కళాశాల ఆవరణలో ముగియనుంది. కళాశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యాదవ్, డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్స్‌ ప్రొఫెసర్‌ డి.శోభారాణి, ప్రిన్సిపాల్‌ కె.సమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement