Cycle ride
-
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్‌ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఒంటి కాలితో దేశాన్ని చుట్టొస్తా
సనత్‌నగర్: ఒంటికాలితోనే మహిళల ప్రత్యేక సోలో కేటగిరి సైక్లింగ్ రేస్‌లో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్ పూర్తి చేస్తానని పారా అథ్లెట్ గీతా ఎస్.రావు ధీమా వ్యక్తం చేశారు. ఎడమ కాలు పోలియో వ్యాధికి గురైనప్పటికీ ఆమె ఒక కాలుతోనే సైకిల్ తొక్కుతూ ఇప్పటికే డీఎస్ఆర్, ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ 2022 చాంపియన్‌గా నిలిచారు. సుషేనా హెల్త్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను కలిసేందుకు శుక్రవారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా నిలోఫర్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 18,950 కిలోమీటర్ల ఎత్తులో, 3,651 కిలోమీటర్ల పొడవైన ఈ ఐకానిక్ సైకిల్ రైడ్ మార్చి 1న శ్రీనగర్ నుంచి ప్రారంభమై కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సాగే జాతీయ స్థాయి అల్ట్రా సైక్లింగ్ రేస్‌లో భాగంగా దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సోలో, రిలే టీమ్‌లు పాల్గొంటాయని తెలిపారు. 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటుతూ 3,651 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేస్తానని తెలిపారు. ఈ రేస్‌కు సుషేనా హెల్త్ ఫౌండేషన్ అధికారిక భాగస్వామిగా ఉందన్నారు. తన రైడ్‌లో భాగంగా ‘తల్లి పాలే ఉత్తమ ఆహారం’ అనే నినాదంతో దేశంలో తల్లి పాలపై అవగాహనను పెంపొందించేందుకు ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ క్రాలేటీ, నియోనాటాలజీ హెచ్ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కలవలపల్లి దుర్గాభవానీ, అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి తదితరులు పాల్గొన్నారు. -
Viral: నడిరోడ్డుపై ఆ తాత ఎందుకలా చేశాడంటే..
వైరల్: దగ్గర దగ్గర ఏడు పదుల వయసు. నడిరోడ్డులో సైకిల్ హ్యాండిల్ వదిలేసి.. హుషారుగా సైకిల్ తొక్కుతున్న ఓ వీడియో ట్విటర్ ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. వయసు అనేది కేవలం అంకె మాత్రమే అనే విషయం మరోసారి ఈ వీడియో ద్వారా రుజువైందని, అనుభవశాలి అయిన ఆ తాత సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేయడం చూస్తున్నాం. అదే సమయంలో.. నెగెటివ్ కామెంట్లు కూడా కొన్ని వస్తున్నాయి. తాగి అలా చేసి ఉంటాడని కామెంట్లు చేశారు కొందరు. ఏది ఏమైనా.. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలంటూ ‘‘జిందగీ గుల్జార్ హై’’ అనే ట్విటర్ పేజీ నుంచి ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో వెనుక దీనగాథ ఉందని తర్వాతే తేలింది. ముంబైకి చెందిన ఓ వెబ్సైట్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర థానే చెందిన భీమ్జీ(66/68 ఏళ్లు).. పదేళ్ల కిందట భార్యను పొగొట్టుకున్నాడు. ఏడాది కిందట ఒక్కగానొక్క కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అప్పటి నుంచి ఆ తాత కష్టాలు రెట్టింపు అయ్యాయి. కోడలు భీమ్జీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి.. ఉండడానికి గూడు లేని ఆ పెద్దాయన వసాయ్(పాల్ఘడ్) వద్ద బస్ షెల్టర్‌లో కాలం వెల్లదీస్తున్నాడు. అక్కడే ఉంటూ.. దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నాడు. పని లేనప్పుడు ఇలా సైకిల్ మీద స్టంట్స్ చేస్తూ డబ్బులు అడుక్కుంటున్నాడట. ఇదీ సైకిల్ తొక్కుతూ, విన్యాసాలు చేస్తూ దూసుకెళ్లిన వృద్ధుడి వీడియో వెనుక ఉన్న కథ.. -
దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు: వీడియో వైరల్
చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ప్రసంగిస్తున్నాడు. మరోవైపు సూపర్హిరో వేషధారణలో ఒక బుడ్డోడు అధ్యక్షుడు చుట్టు సైకిల్ రైడింగ్ చేస్తూ కనిపించాడు. వాస్తవానికి ఈ ఘటన చిలీ అధ్యక్షుడు కొత్త రాజ్యంగానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తూ... ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. అధ్యక్షుడు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ఒక చిన్నపిల్లవాడు సూపర్ హిరోల బ్లూకలర్ దుస్తులను ధరించి సైకిల్‌పై రైడ్ చేస్తూ.... చూపరులను ఆకర్షించాడు. మధ్యలో ఒక్కసారి సైకిల్ని ఆపి అధ్యక్షుడి ప్రసంగం విని మళ్లీ తన రైడింగ్‌లో నిమగ్నమైపోయాడు. అయితే ఆయన ప్రతిపాదించిన కొత్త రాజ్యంగ ప్రజాభిప్రాయ సేకరణ అత్యధిక మెజారిటీతో తిరస్కరణకు గురైంది. సుమారు 7.9 మిలియన్ల మంది ఈ కొత్త ముసాయిదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. బోరిక్ ఆర్థిక, సామాజిక పరంగా కొత్త సంస్కరణలు తీసుకువస్తానన్న హామీతో పదవిలోకి వచ్చారు. కానీ బోరిక్ ఈ మెజారిటీ ఓటు తిరస్కరణ తన పొలిటికల్ కెరియర్ని సందిగ్ధంలో పడేసింది. ఏదీ ఏమైనా చిలీ అధ్యక్షుడు ప్రసంగిస్తున్న సమయంలో బైక్ రైడ్ చేస్తూ అతని చుట్టు తిరిగిన చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Superman encircles Gabriel Boric after he submits his vote in today’s plebiscite 🇨🇱 pic.twitter.com/2Tk63noO62 — David Adler (@davidrkadler) September 4, 2022 (చదవండి: ప్రారంభోత్సవం రోజునే పరాభవం...హఠాత్తుగా కుప్పకూలిన వంతెన) -
సైకిల్ పై చక్కర్లు కొట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్
-
సైకిల్ .. ఇది మామూలుగా ఉండదు మరి!
సైకిల్ తొక్కితే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతారు.. క్రిస్టియన్ టాపింగ్స్ ఇంకో మాట కూడా చెబుతున్నారు! రోలో తొక్కండి... వాయు కాలుష్యాన్ని పారదోలండీ అని! సైకిల్‌కు, వాయు కాలుష్యానికి సంబంధం ఏమిటనేగా మీ డౌటు? మరి ఈ పండుగ వేళ ఒకసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఈ ఫొటో చూడండి. ఏమిటిది! సైకిల్లాగే కనిపిస్తోంది. కానీ, ఇది మామూలు సైకిల్ మాత్రం కాదు. ఎందుకంటే చక్రాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి కాబట్టి! పేరు రోలో! ఈ సైకిల్‌ను తొక్కారనుకోండి.. కాలుష్యం కిల్ అవుతుంది. గాలిని చీల్చుకుంటూ వెళ్లే క్రమంలో కొంత గాలి వేగంగా చక్రాల మధ్యలో ఉండే నిర్మాణాల్లోకి వెళుతుంది. కాలుష్యంతో కూడిన గాలి ఒకవైపు నుంచి వెళితే.. పూర్తిగా శుభ్రమైన వాయువు ఇంకోవైపు నుంచి బయటకు వస్తుంది! క్రిస్టియన్ టాపింగ్స్ అనే బ్రిటన్ డిజైనర్ దీన్ని తయారు చేశారు. ఢిల్లీ కాలుష్యాన్ని చూసి.. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యమున్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సులువైన మార్గం కోసం ఆలోచనలు చేసిన టాపింగ్స్ చివరకు సైకిల్ కదిలే వేగాన్ని ఆసరాగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చక్రంలో ఏర్పాటు చేసిన నిర్మాణం కోసం పలు విఫల ప్రయత్నాలు చేసి చివరకు తాజా డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ చక్రాల ద్వారా ప్రతి కిలోమీటరు దూరానికి దాదాపు 0.665 ఘనపుమీటర్ల గాలి శుభ్రమవుతుందని అంచనా. క్రిస్టియన్ టాపింగ్స్ ఆ మ్యాజిక్ ఎలా? చక్రాల మధ్యలో ఉండే నిర్మాణంలో మూడు ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. లోఫా (స్పాంజి లాంటిది)తో తయారైన ఫిల్టర్ గాల్లోని కొంచెం పెద్దసైజు కాలుష్యకణాలను (పీఎం 10 – 2.5) పీల్చేసుకుంటుంది. ఇళ్లలోని ఎయిర్ ప్యూరిఫయర్లలో వాడే హెపా ఫిల్టర్ పీఎం 2.5 కణాలతోపాటు టైర్లు, బ్రేక్‌ల నుంచి వెలువడే పొడిని తనలో దాచుకుంటుంది. చివరగా.. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి విషవాయువులను పీల్చేసుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం విద్యుత్తు అవసరం లేకుండానే పూర్తి కావడం రోలో విశిష్టత. కాలుష్యపు కాటు ఇలా.. ► 45 లక్షలు: వాయు కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు ► 15 వేల కోట్లు: వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య, ఇతర సమస్యల కారణంగా భారత్‌లో జరుగుతున్న నష్టం (రూపాయల్లో) ► 91% : 2019లో వాయుకాలుష్యం సమస్యను ఎదుర్కొన్న జనాభా ► 40,000: పీఎం 2.5 కాలుష్యం కారణంగా ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్న చిన్నారులు (ప్రతి ఏడాది) -
సల్మాన్‌పై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏది చేసినా సంచలనమే. బాలీవుడ్లో రూ.100 కోట్ల కలెక్షన్ల సినిమాలకు చిరునామాగా మారిన సల్మాన్, తాజాగా సైకిల్ తొక్కుతున్న ఫోటోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. అయితే తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు(స్టే స్టేఫ్ అని ఇంగ్లీషులో). కాగా సల్మాన్ సలహాపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. సల్మాన్ సైకిల్ తొక్కుతున్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. మీరు ఫుట్‌పాత్‌పై సైకిల్ తొక్కొద్దంటు మరో నెటిజన్ సల్మాన్‌కు సూచించాడు. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించాలని ఓ నెటిజన్ సల్మాన్‌ను కోరాడు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మీరు సైకిల్ తొక్కుతున్న దృష్యాలను పోస్ట్ చేయడంలో ఆంతర్యమేమిటని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అయితే బాలీవుడ్ మీకు జీవితానిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని మరో నెటిజన్ సల్మాన్‌కు సూచించాడు. (చదవండి: కత్రినా కోసం ఆనవాయితీకి బ్రేక్) -
సైక్లింగ్ తెచ్చిన అవకాశాలు..
కోల్‌కతా: గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చొబెట్టుకొని ఢిల్లీ నుంచి దర్భంగా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన బిహార్‌కు చెందిన విద్యార్థిని జ్యోతి కుమారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ ఎత్తేశాక జ్యోతిని సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ట్రయల్స్‌కు పంపుతామని, అయితే చదువే తమ మొదటి ప్రాధాన్యమని ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ తెలిపారు. వలస కార్మికులంతా ఇళ్లకు తిరిగి వెళుతుంటే తమకు మరో మార్గం లేక పాత సైకిల్ కొని ప్రయాణం సాగించినట్లు తెలిపారు. దారి మధ్యలో తాము ట్రక్కులు, ట్రాక్టర్లను పట్టుకొని ప్రయాణం చేసినట్లు తెలిపారు. దర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతిని ఇటీవల పిండారుచ్ హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. ఆమెకు కొత్త సైకిల్, యూనిఫాం, షూ అందించారు. జ్యోతి చదువుయ్యే ఖర్చును భరిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. మరోవైపు జ్యోతికి సైక్లింగ్ లో ట్రైనింగ్, స్కాలర్ షిప్ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్రీడల మంత్రి కిరెన్ రిజిజును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ
వాషింగ్టన్ : గాయపడిన కన్నతండ్రిని కరోనా కష్ట కాలంలో సొంతూరికి చేర్చడం కోసం 15 ఏళ్ల వయసున్న జ్యోతి కుమారి అయిదు రోజులు, 1500 కి.మీ. సైకిల్ తొక్కడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆ అమ్మాయి చేసిన సాహసం ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ జ్యోతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ‘‘అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ.ఆమె చేసిన ఫీట్‌ని భారత్ ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి‘‘అని ట్వీట్ చేశారు. ఎందుకా సాహసం అంటే .. ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతికుమారి స్వగ్రామం బీహార్ లోని దర్భాంగా. ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ గత 20 ఏళ్లుగా గుర్గావ్లో ఆటో నడుపుతున్నారు. గత జనవరిలో ఆటోకు ప్రమాదం జరిగి పాశ్వాన్ తీవ్రంగా గాయ పడ్డారు. తండ్రిని చూసు కోవడానికి తల్లితో పాటు జ్యోతి కూడా గుర్గావ్ వచ్చింది. తల్లి అంగన్వాడీ వర్కర్ కావడంతో ఎక్కువ రోజులు గడిపే వీలులేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. చిన్నారి జ్యోతి తండ్రి ఆలనా పాలనా చూడసాగింది. ఇంతలో ఉరుము లేని పిడుగులా కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. తండ్రి ఇంకా పూర్తిగా గాయాల నుంచి కోలుకోలేదు. అద్దె ఇవ్వాలంటూ యజమానులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి తన సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1500 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి ఎంతో శ్రమకి ఓర్చుకొని ఆ అమ్మాయి తండ్రితో పాటు సొంతింటికి చేరి ఊపిరిపీల్చుకుంది. జ్యోతి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. నిర్విరామంగా ఆమె సైకిల్ తొక్కిన విషయం తెలుసుకున్న సైక్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) ఆమెకి సైక్లింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. జ్యోతి శిక్షణలో విజయవం తమైతే నేషనల్ సైక్లింగ్ అకాడమీలో ట్రైనీగా తీసుకుంటారు. ఇప్పుడు ఇవాంకా నుంచే ప్రశంసలు రావడంతో ఆమె సాహసానికి తగిన గుర్తింపు లభించినట్టయింది. -
ఒక్క సెల్ఫీ భాయ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ముంబై రోడ్లపై సైకిల్ తొక్కారు. పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించే సల్మాన్ సడన్‌గా ఇలా సైకిల్‌తో రోడ్డు ఎక్కడానికి కారణం ఉంది. ముంబైలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రీకరణ ముంబైలోనే జరుగుతోంది. వర్షాల వల్ల కారులో వెళితే ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయని సల్మాన్ ఊహించి ఉంటారు. అందుకే సైకిల్‌పై ‘దబాంగ్ 3’ సెట్స్‌కు వెళ్లారు. సల్మాన్ వంటి సూపర్‌స్టార్ రోడ్డుపై కనిపిస్తే అభిమానులు ఊరుకోరు కదా.. వెంటనే ఒక్క సెల్ఫీ భాయ్ అని అడిగారు. స్మైల్‌తో సల్మాన్ పోజిచ్చారు. ఇలా చాలా మంది సెల్ఫీస్‌లో బందీ అయిపోయారు సల్మాన్. ఇక ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
70 ఏళ్ల అనుబంధం.. అందుకే ఇలా ఉన్నా!
ఇప్పుడు 18 ఏళ్లు నిండని వారు కూడా కాలు కదిపితే మోటార్ సైకిల్ కావాల్సిందే. విద్యార్థులు తమ కళాశాలలకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారస్తులు వీధి వీధి తిరిగి తమ వస్తువులు విక్రయించాలన్నా.. ఇంటి అవసరాలకు సామగ్రి తీసుకురావాలన్నా.. అందరూ మోటార్ సైకిళ్లనే వాడుతున్నారు. ప్రస్తుతం మోటార్ సైకిళ్ల హవానే నడుస్తోంది. అయితే ఓ తొంభై సంవత్సరాల వృద్ధుడు.. తను ఎటు వెళ్లాలన్నా.. ఏ పని చేసుకుని రావాలన్నా.. సైకిల్‌నే వినియోగిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అతడు 70 ఏళ్లుగా సైకిల్‌పైనే సవారీ చేస్తున్నాడంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. అతడే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగొల్లపల్లి గ్రామానికి చెందిన పాపాయ్య. సాక్షి, కూసుమంచి(ఖమ్మం) : ఈ రోజుల్లో పక్క ఊరు వెళ్లాలంటే ఆటోలు, కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లు ఉన్నాయి. వాటితో సుఖమైన ప్రయాణం. కానీ, పాపయ్య మాత్రం సైకిల్‌పైనే కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాడు. అతని వయస్సు తక్కువేమి కాదు 90 సంవత్సరాలు పైనే. సైకిల్‌తోనే ఎంతో అనుబంధం పెనవేసుకుందని, దానిపైనే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెబుతున్నాడు. మండలంలోని గైగొల్లపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ మండల కార్యదర్శి కొరట్ల పాపయ్య మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. తన యుక్త వయస్సు అంటే 20 సంవత్సరాల వయస్సులో సైకిల్ కొనుక్కున్నాడు. నాటి నుంచి నేటి వరకు ఈ సైకిలే అతని ప్రయాణ సాధనం. తాను ఏ ఊరు వెళ్లాలన్నా సైకిల్‌పైనే వెళ్తుంటాడు. తనకు సైకిలే నేస్తం. ఇప్పటికీ తన ఊరు నుంచి మండల కేంద్రమైన కూసుమంచికి (సుమారు 16 కిలోమీటర్లు) రోజూ సైకిల్‌పైనే వçస్తుంటాడు. సైకిల్ తొక్కడంలో అతడికి అలుపు, సొలుపు ఉండదూ. వయస్సు మీరినా హుషారుగా సైకిల్ తొక్కడం పాపయ్య ప్రత్యేకత. అంతే కాకుండా మండలంలో ఏ ఊరు వెళ్లాలన్నా తన సైకిల్‌పైనే అతని ప్రయాణం. రోజూ 32 కిలోమీటర్లు కచ్చితంగా సైకిల్ తొక్కుతాడు. అంటే కూసుమంచి వచ్చిపోతూ ఉంటాడు. సరదాగా వచ్చి టీ తాగి వెళ్తుంటాడు. ఈ వయస్సులో కూడా పాపాయ్య తన సైకిల్ ను ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు. సైకిల్‌ను నాటి నుంచి ఇప్పటి వరకు మార్చనూ లేదు. సైకిల్‌తో పాపయ్య సవారీని పలువురు ఆసక్తిగా చూస్తుంటారు. ఇది నా బంధం.. నా అనుబంధం ఇంతే అంటూ తన అనుభవాలను పాపయ్య ‘సాక్షి’తో పంచుకున్నాడు. చిన్న తనంలో తన సైకిల్‌కు పంక్చర్ అయితే కూసుమంచిలో పంక్చర్ వేసేవాళ్లు లేక సైకిల్‌ను లారీలో వేసుకుని తల్లంపాడు, అవసరమైతే ఖమ్మం వెళ్లి వేయించుకునేవాడినని చెప్పారు. చివరకు ఆ బాధలు పడలేక తానే పంక్చర్ వేయడం నేర్చుకున్నానని పాపయ్య తెలిపారు. తనకు సైకిల్ తొక్కడం వలన ఇంత వరకు ఏ నొప్పులు, రోగాలు లేవని, దేవుడి దయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నానని, అదిచాలని అంటున్నాడు. ఇక పోతే పాపయ్య పార్టీకి వీరాభిమాని. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పాటిస్తాడు. చివరకు ఇతను వాడే పెన్ను ఎరుపు రంగులోనే ఉండటం విశేషం. పార్టీలో సేవ చేసినా పార్టీ కోసం అంకితభావంతో చేస్తున్నాను తప్ప స్వలాభం కోసం కాదని పాపయ్య అంటున్నాడు. దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకు గతంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కూడా పాపయ్య అలుపు లేకుండా సాగారు. సైకిల్ తొక్కటం ఇష్టం నాకు 90 ఏళ్లు వచ్చినా సైకిల్ తొక్కడం కష్టంగా లేదు. రోజూ కూసుమంచి సైకిల్‌పైనే వస్తా. నాకు కాళ్ల నొప్పులు కూడా లేవు. నాకు సైకిల్ ఉంటే చాలు ఎక్కడికైనా సరదాగా పోయివస్తుంటా. నేను సైకిల్ తొక్కుతుంటే కొందరు తాతా ఈ వయసులోనూ భలేగా తొక్కుతున్నావు సైకిల్ అంటుంటారు. అలా అంటే ఇంకా సైకిల్ తొక్కాలనే ఉత్సాహం వస్తుంది. నాలో సత్తువ ఉన్నన్ని రోజులు సైకిల్ తొక్కుతూనే ఉంటాను. కొరట్ల పాపయ్య, గైగొల్లపల్లి -
రైడ్ ఫర్ గ్రీన్
-
ఇలా ట్రై చెయ్యండి: ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ హెల్తీ లైఫ్ స్టైల్‌ను ఫాలో అవుతుంటాడు. 37 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్నెస్తో మిస్టర్ కూల్ ఆశ్చర్యపరుస్తుంటాడు. తరచూ అందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు కూడా. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనీ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. ‘జస్ట్ ఫర్ ఫన్.. ఇంట్లో మీరూ ట్రై చెయ్యండి’ అంటూ సైక్లింగ్ చేసే వీడియో ఒకదాన్ని పోస్ట్ చేశాడు. చెవిలో హెడ్ సెట్.. నోట్లో చెక్క ముక్క పెట్టుకుని పళ్లం వైపు సైకిల్‌తో ధోనీ దూసుకుపోయాడు. స్లో మోషన్లో మహేంద్రుడు చేసిన ఆ ఫన్నీ స్టంట్‌ను మీరూ చూడొచ్చు. అయితే ఈ వీడియోను చూసి అర్థం కాక జుట్టు పీక్కుంటూ కామెంట్లు చేసే ఫ్యాన్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ మధ్యే ఇంగ్లాండ్ టూర్లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్.. ఇండియాలో మోస్ట్ అడ్మైర్డ్ స్పోర్ట్స్‌పర్సన్‌గా నిలిచాడు కూడా. -
‘జస్ట్ ఫర్ ఫన్.. మీరూ ట్రై చెయ్యండి’
-
సైకిల్ తొక్కుతూ కింద పడ్డ తేజ్
-
సైకిల్ మీద నుంచి పడిపోయిన తేజ్
బిహార్ : బిహార్ రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ తొక్కుతూ పట్టుకోల్పోయి కింద పడిపోయారు. ఈ ఘటన గురువారం పాట్నాలో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. తేజ్ ప్రతాప్ వేగంగా సైకిల్‌ను తొక్కడంతో కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కూడా ఆయన్ను అనుసరించేందుకు యత్నించారు. ఈ లోగా ఎదురుగా వచ్చిన టర్న్ వద్ద సైకిల్‌ను అదుపు చేయలేక తేజ్ ప్రతాప్ కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను లేవదీశారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మళ్లీ సైకిల్‌ను తీసుకున్న తేజ్ ప్రతాప్ యాత్రను కొనసాగించారు. సైకిల్ యాత్రపై మాట్లాడుతూ.. పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వల్ల దగ్గరి ప్రయాణాలకు ప్రజలు సైకిల్‌ను వినియోగించాలని కోరారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. -
సైకిల్ తొక్కి క్రికెట్ ఆడిన మాజీ సీఎం
లక్నో : సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రత్యేక బంగ్లా ఖాళీ చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం సామాన్య ప్రజలతో సరదాగా గడిపారు. ఈ రోజు ఉదయం గోమతి నది తీరంలోని వాకర్స్‌తో కలసి సైకిల్ తొక్కారు. అలాగే వారితో పాటు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అక్కడి యువతతో కలసి క్రికెట్ ఆడారు. అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పుడు గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అఖిలేశ్‌తో అక్కడివారు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాజ్‌వాదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మరొకటైన జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్‌ను శనివారం సందర్శించిన అఖిలేశ్ ప్రభుత్వ సౌకర్యాలు శాశ్వతం కాదన్నారు. సుప్రీం కోర్టుపై గౌరవంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసినట్టు తెలిపారు. -
నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్
దుండిగల్: కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం హైదరాబాద్–400 ద గ్లోరీ 400 బ్రెవట్ సైకిల్‌రైడ్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రౌండోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఇంటర్నేషనల్ వెటరన్ అథ్లెటిక్, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 27 గంటల్లో 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని 42 మంది రైడర్లు ఛేదించనున్నారు. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ఈ రైడ్ ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, గండిమైసమ్మ చౌరస్తా, బహదూర్‌పల్లి మీదుగా దూలపల్లిలోని కళాశాల ఆవరణలో ముగియనుంది. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యాదవ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్స్ ప్రొఫెసర్ డి.శోభారాణి, ప్రిన్సిపాల్ కె.సమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సొంత గూటికి దేవినేని నెహ్రూ
-
పర్యావరణ యాత్ర
-
ఐటీ ఉద్యోగులు.. సీఈఓ సైకిల్ రైడ్
హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చడానికి చేస్తున్న కృషిలో ఐటీ ఎంప్లాయిస్ది కీ రోల్. భాగ్యనగరంలో కాలుష్యం తగ్గించేందుకు అనేక మంది ఐటీ ఉద్యోగులు నిత్యం ఆఫీసులకు సైకిల్‌పై వెళుతున్నారు. ఈ స్ఫూర్తిని మరింత పెంచేందుకు ‘ీసీఈఓ రైడ్’ పేరుతో ఐటీ కంపెనీల సీఈఓలు శనివారం సైబరాబాద్ మైండ్ స్పేస్‌లో సైకిల్ రైడ్ నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా సాఫ్ట్వేర్ సంస్థల సీఈఓలు రైడ్‌లో పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కెటీఆర్ రైడ్ ప్రారంభించారు. మైండ్‌స్పేస్ ఐటీ పార్కులో వెస్టిన్ హోటల్ నుంచి ప్రారంభమై తిరిగి అదే హోటల్ వద్ద ఈ ర్యాలీ వుుగిసింది. టీఎస్‌ఐఐ వైస్‌చైర్మన్, ఎండీ జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, కాగ్నిజెంట్ సీఈఓ లక్ష్మీ నారాయణ్, మైమాప్ జీనో సీఈఓ అను ఆచార్య, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వెల్ఫర్గో ఎండీ అనీగ్ ముఖర్జీ, ఏడీపీ సీఈఓ శక్తి సాగర్ రైడ్‌లో పాల్గొన్నారు. ట్రాక్ పెంచుతాం: కేటీఆర్ - హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మారుస్తాం - ఏడాదిలో 52 సార్లు ఇలాంటి రైడ్లు నిర్వహించాలి - ఆగస్టులో స్టార్టప్ ఫెస్ట్. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 1500 వుంది పాల్గొంటారు - బెంగళూరులో 21 బిలియున్ల ఎక్స్‌పోర్ట్స్ జరుగుతున్నారుు. కానీ నగరం నుంచి ఈ సంఖ్య 8 బిలియున్లు వూత్రమే. ఇందుకు వాతావరణం, రాయితీలు, స్థలాలు, నిష్ణాతులైన ఐటీ ఉద్యోగులు కొరత వంటివి కారణాలు. వీటిని అధిగమిస్తాం. - ఐటీతో పాటు వ్యూనుఫ్యాక్చరింగ్ సెంటర్లనూ అభివృద్ధి చేస్తాం - నగరంలో 2 లక్షల వుంది ఐటీ ఉద్యోగులున్నారు. వారి కోసం ప్రస్తుతవుున్న 30 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌ను 80 కిలో మీటర్లకు విస్తరిస్తాం. - సాక్షి, సిటీ ప్లస్ -
కార్పొరేట్ లీడర్స్.. సైకిలింగ్
CEO RIDE: బయట అడుగు పెట్టాలంటే కారు.. అడుగడుగునా రెడ్‌కార్పెట్ స్వాగతాలు... ఎండ కన్నెరుగని జీవితాలు. వందల వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే కంపెనీలకు సీఈఓలు. సైకిలింగ్‌కే సై అంటున్నారు. చమురు ధరలు పెరుగుతున్నాయనేమో అని భ్రమపడిపోకండి. వారు పైడిల్‌పై కాలెడుతున్నది సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు. నగరవాసులకు ఆరోగ్యంపై అవగాహను పెంచేందుకు. ఒక్కరు కాదు ఇద్దరు 200 మంది సీఈఓలు 45 నిమిషాల పాటు చేసే ఈ రేర్ సైకిల్ రైడ్‌కు నగరం వేదిక కాకనుంది. దీన్ని అట్లాంటా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కార్పొరేట్ లీడర్స్ ఇంత పెద్ద సంఖ్యలో ఒక ఈవెంట్లో పాల్గొనడం దేశంలోనే ప్రథమం కావడంతో ఈ ఈవెంట్‌కు క్రేజ్ ఏర్పడింది. హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్ దగ్గర ఉన్న వెస్టిన్ హోటల్ నుంచి ఈ రైడ్‌ను శనివారం ఉదయం ఐటి శాఖా మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. దేశంలోనే వినూత్నంగా రూపొందిన ‘రైడ్ ఫర్ లైఫ్’ మేగ్‌జైన్‌ను ఆవిష్కరిస్తారు. రాజసాన్ని వీడి రహదారుల బాట పట్టిన సీఈఓల సైక్లింగ్ రైడ్ సూపర్‌హిట్ కావాలని, మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం. - ఎస్బీ