దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు: వీడియో వైరల్‌ | Viral Video: Boy Dressed Superman Cycles Around Chiles President | Sakshi
Sakshi News home page

Viral Video: దేశ అధ్యక్షుడి ప్రసంగం వేళ అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు

Published Wed, Sep 7 2022 3:23 PM | Last Updated on Wed, Sep 7 2022 3:29 PM

Viral Video: Boy Dressed Superman Cycles Around Chiles President - Sakshi

చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రసంగిస్తున్నాడు. మరోవైపు సూపర్‌హిరో వేషధారణలో ఒక బుడ్డోడు అధ్యక్షుడు చుట్టు సైకిల్‌ రైడింగ్‌ చేస్తూ కనిపించాడు. వాస్తవానికి ఈ ఘటన చిలీ అధ్యక్షుడు కొత్త రాజ్యంగానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తూ... ప్రసంగిస్తున్న  సమయంలో చోటు చేసుకుంది. అధ్యక్షుడు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ఒక చిన్నపిల్లవాడు సూపర్‌ హిరోల బ్లూకలర్‌ దుస్తులను ధరించి సైకిల్‌పై రైడ్‌ చేస్తూ.... చూపరులను ఆకర్షించాడు.

మధ్యలో ఒక్కసారి సైకిల్‌ని ఆపి అధ్యక్షుడి ప్రసంగం విని మళ్లీ తన రైడింగ్‌లో నిమగ్నమైపోయాడు. అయితే ఆయన ప్రతిపాదించిన కొత్త రాజ్యంగ ప్రజాభిప్రాయ సేకరణ అత్యధిక మెజారిటీతో తిరస్కరణకు గురైంది. సుమారు 7.9 మిలియన్ల మంది ఈ కొత్త ముసాయిదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. బోరిక్‌ ఆర్థిక, సామాజిక పరంగా కొత్త సంస్కరణలు తీసుకువస్తానన్న హామీతో పదవిలోకి వచ్చారు.

కానీ బోరిక్‌ ఈ మెజారిటీ ఓటు తిరస్కరణ తన పొలిటికల్‌ కెరియర్‌ని సందిగ్ధంలో పడేసింది. ఏదీ ఏమైనా చిలీ అధ్యక్షుడు ప్రసంగిస్తున్న సమయంలో బైక్‌ రైడ్‌ చేస్తూ అతని చుట్టు తిరిగిన చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: ప్రారంభోత్సవం రోజునే పరాభవం...హఠాత్తుగా కుప్పకూలిన వంతెన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement