chili
-
మెరుపు తగ్గిన ‘మిరప’
సాక్షి, అమరావతి: మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్ల ప్రభావానికి తోడు మార్కెట్లో ధర లేకపోవడం మిరప రైతులను కలవర పెడుతోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా, 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా, 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3.36లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15 వేల ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.అవగాహన కల్పించే వారేరి?సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. తెల్లతామర తెగులుతో పాటు ఇతర చీడపీడలపై గడచిన నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రొటోకాల్ మేరకు ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేవారు. ఫలితంగా నల్లతామరతో సహా ఇతర చీడపీడలు, తెగుళ్ల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా మచ్చుకైనా కన్పించడంలేదు. నల్లతామర నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు పూజ్యమనే చెప్పాలి.భారీగా పతనమైన ధర2022–23లో క్వింటాకు గరిష్టంగా రూ.27వేల ధర పలకగా, 2023–24 సీజన్లో గరిష్టంగా రూ.29 వేల వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా రూ.18,600, కనిష్టంగా రూ.9,500 చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా రూ.50వేలకుపైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి రూ.10వేలకు మించి పలకని పరిస్థితి నెలకొంది. మరొక పక్క 2022–23 సీజన్లో ఎకరాకు 18–23 క్వింటాళ్ల చొప్పున 11.50లక్షల టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 20–25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
హిల్థ్రిల్ హోటల్! పర్వతారోహణ అనుభవం లేనివారు ఇక్కడికి చేరుకోలేరు..
అప్పుడప్పుడు కొన్ని వింతలను, అద్భుతాలను, విచిత్రాలను, సౌందర్యాలను చూస్తూంటాం. కానీ అవన్నీ ఒకేదగ్గర కనిపించాలంటే ఇక్కడికి వెళ్లాలేమో..! ఈ ఫొటోలో కనిపిస్తున్న పర్వతం కేవలం పర్వతం కాదు, ఇదొక అధునాతన హోటల్. చిలీలోని హుయిలో హుయిలో అభయారణ్యంలో పటగోనీయా పర్వతశ్రేణుల్లోని ఒక పర్వతాన్ని ఇలా హోటల్‌గా మార్చారు. సాహసయాత్రికులకు, పర్వతారోహకులకు విడిది కేంద్రంలా దీనిని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ‘మౌంటెయిన్ మేజికా’ అనే ఈ హోటల్‌కు చేరుకోవాలంటే, వేలాడే వంతెన తప్ప వేరే మార్గమేదీ లేదు. తగిన శారీరక దారుఢ్యం, పర్వతారోహణ అనుభవం లేనివారు ఇందులోకి అడుగుపెట్టలేరు. దట్టమైన అడవి మధ్యనున్న ఈ హోటల్లో బసచేసే వారికి కిటికీల్లోంచి చూస్తే ఎటుచూసినా ప్రకృతి పచ్చదనం, చుట్టుపక్కల పర్వతాల నుంచి కిందకు దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 108 గదులు, రెస్టారెంట్, స్పా, స్విమింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. ఇందులో బస చేయడానికి రోజుకు 215 డాలర్లు (రూ.17,882) ఖర్చవుతుంది. ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు.. -
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
ఊపందుకున్న మిరప సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప సాగు ఊపందుకుంటోంది. సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినప్పటికీ.. గడచిన రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరట ఇస్తున్నాయి. ఫలితంగా లక్ష్యం దిశగా మిరప సాగు పయనిస్తోంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటం.. పెరిగిన ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 4.87 లక్షల ఎకరాలు కాగా.. 50 శాతం వర్షాధారం కింద, మరో 50 శాతం బోర్ల కింద సాగవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరగడంతో మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. నాలుగేళ్లలో కనిష్ట ధర 3 రెట్లు పెరిగితే.. గరిష్ట ధర రెట్టింపు దాటింది. ఫలితంగా మిరప సాగు ఏటా విస్తరిస్తోంది. 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా.. 11.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. 2023–24 ఖరీఫ్ సీజన్లో 5.67 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించగా.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరల ఫలితంగా 6.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అంచనా. దిగుబడులు సైతం 12 లక్షల టన్నులు దాటుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అన్ని సేవలు ఆర్బీకేల ద్వారా సర్టీఫై చేసిన నాణ్యమైన డిమాండ్ ఉన్న మిరప సీడ్ రైతులకు అందుబాటులో ఉంది. ఎరువులు, పురుగుల మందుల కొరత లేకుండా సీజన్ ముందు నుంచే ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నల్లతామరతో పాటు ఇతర చీడపీడలు, తెగుళ్ల బారిన పడకుండా పంటను కాపాడటం, ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా తోట బడులు నిర్వహిస్తూ రైతులకు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుకు ఊరటనిస్తోన్న వర్షాలు మిరప రైతులు సాధారణంగా జూన్, జూలైలో నారు పోస్తారు. అక్టోబర్ వరకు నాట్లు వేస్తారు. సీజన్ ఆరంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు మిరప రైతులను ఒకింత కలవరపాటుకు గురి చేశాయి. బోర్ల కింద ఇబ్బంది లేనప్పటికీ వర్షాధారం కింద పండించే చోట్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఆగస్టు నెలాఖరు నుంచి కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరటనిచ్చాయి. కనీసం సాధారణ విస్తీర్ణంలోనైనా సాగవుతుందో లేదో అనే ఆందోళన చెందిన అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే నిర్ధేశించిన సాగు విస్తీర్ణం అధిగమించడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాల్లో మిరప నాట్లు పడగా.. ఇదేరీతిలో వర్షాలు కురిస్తే సీజన్ ముగిసే నాటికి 5.50 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలు దాటుతుందని చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే 5 లక్షల నుంచి 5.50లక్షల ఎకరాలకు పరిమితమవుతుందని, దిగుబడులు మాత్రం 11 నుంచి 12 లక్షల టన్నుల మధ్య ఉంటుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మరీ మిరప రైతులు సాగు చేస్తున్నారు. ఆగస్టులో వర్షాభావ పరిస్థితులను చూస్తే ఈసారి సాధారణ విస్తీర్ణం కూడా దాటలేం అనుకున్నాం. కానీ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మిరప సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడేటట్టు ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు ఇదే రీతిలో వర్షాలు కురిస్తే విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎస్ఎస్.శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు
భూకంపం.. నివారించడం సాధ్యం కాని పెనువిపత్తు. దీనికి జాగ్రత్త, అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కావడం వల్ల భూకంపాలు వంటి విపత్తుల వల్ల కలిగే వినాశనం నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు. ఆఫ్రికాలోని మొరాకోలో సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి సంభవించిన విధ్వంసకర భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా ప్రజలు మరణించినట్లు నిర్ధారించారు. మొరాకో కంటే ముందుగా ప్రపంచంలోని అనేక దేశాలలో భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో సంభవించిన పది భారీ భూకంపాల గురించి తెలుసుకుందాం. 1. ప్రిన్స్ విలియం సౌండ్, అలాస్కా 1964, మార్చి 28న అమెరికాలోని అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత 9.2గా అంచనా వేశారు. ఆ సమయంలో కెనడా సహా పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో భూమి సుమారు మూడు నిమిషాల పాటు కంపించింది. 250 మందికిపైగా ప్రజలు మరణించగా, వేల మంది గల్లతయ్యారు. 2. వాల్డివియా, చిలీ 1960, మే 22న చిలీలో సంభవించిన భూకంపం 1655 మందిని సమాధి చేసింది. సుమారు మూడు వేల మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం కారణంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విపత్తు కారణంగా చిలీ సుమారు 550 అమెరికా మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. 3. గుజరాత్, భుజ్ 2001లో భారతదేశంలోని గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంప తీవ్రత 7.7గా అంచనా వేశారు. ఈ భూకంపం కారణంగా నగరం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. కచ్, భుజ్లలో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా 1.5 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. 4. పాకిస్తాన్, క్వెట్టా 2005, అక్టోబర్ 8న పాకిస్తాన్‌లోని క్వెట్టాలో సంభవించిన భూకంపంలొ 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 80 వేల మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. 5. ఇండోనేషియా, సుమత్రా 2012 ఏప్రిల్ 11న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపంలో 2,27,898 మంది మరణించారు. 6. జపాన్, ఫుకుషిమా 2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపంలొ 18 వేల మందికి పైగా మరణించారు. ఆ సమయంలో జపాన్ విపత్తులను ఎదుర్కొంటోంది. భూకంపం వచ్చిన వెంటనే జపాన్‌లో సునామీ సంభవించింది, ఇది కొన్ని మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసింది. 7. ఫ్రాన్స్, హైతీ 2019 జనవరి 13న ఫ్రాన్స్‌లోని హైతీలో సంభవించిన భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. ఈ భూకంపంలో దాదాపు 3 లక్షల 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో భూకంపం కారణంగా 80 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. 8. నేపాల్ 2015, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ఎనిమిది వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రకంపనలు భారతదేశం, దాని పొరుగు దేశాలలో కూడా కనిపించాయి. 9. దక్షిణ అమెరికా, చిలీ 1060 మే 22న చిలీలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపంగా పరిగణిస్తారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల మంది మరణించారు. 10. దక్షిణ ఆఫ్రికా, మొరాకో 2023, సెప్టెంబరు 8న ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే ఈ గణాంకాలు ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? -
‘ఏఐ’పంట!
కంచర్ల యాదగిరిరెడ్డి:నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు.ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు.ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సర్విస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. గరిష్టంగా దిగుబడులు: నేల, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ పంట వేస్తే గరిష్ట దిగుబడులు రాబట్టుకోవచ్చో గుర్తించగలదు. పంటల యాజమాన్య పద్ధతులను కూడా నిర్దిష్ట పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు.వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయతి్నస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు: వీడియో వైరల్
చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ప్రసంగిస్తున్నాడు. మరోవైపు సూపర్హిరో వేషధారణలో ఒక బుడ్డోడు అధ్యక్షుడు చుట్టు సైకిల్ రైడింగ్ చేస్తూ కనిపించాడు. వాస్తవానికి ఈ ఘటన చిలీ అధ్యక్షుడు కొత్త రాజ్యంగానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తూ... ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. అధ్యక్షుడు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ఒక చిన్నపిల్లవాడు సూపర్ హిరోల బ్లూకలర్ దుస్తులను ధరించి సైకిల్‌పై రైడ్ చేస్తూ.... చూపరులను ఆకర్షించాడు. మధ్యలో ఒక్కసారి సైకిల్ని ఆపి అధ్యక్షుడి ప్రసంగం విని మళ్లీ తన రైడింగ్‌లో నిమగ్నమైపోయాడు. అయితే ఆయన ప్రతిపాదించిన కొత్త రాజ్యంగ ప్రజాభిప్రాయ సేకరణ అత్యధిక మెజారిటీతో తిరస్కరణకు గురైంది. సుమారు 7.9 మిలియన్ల మంది ఈ కొత్త ముసాయిదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. బోరిక్ ఆర్థిక, సామాజిక పరంగా కొత్త సంస్కరణలు తీసుకువస్తానన్న హామీతో పదవిలోకి వచ్చారు. కానీ బోరిక్ ఈ మెజారిటీ ఓటు తిరస్కరణ తన పొలిటికల్ కెరియర్ని సందిగ్ధంలో పడేసింది. ఏదీ ఏమైనా చిలీ అధ్యక్షుడు ప్రసంగిస్తున్న సమయంలో బైక్ రైడ్ చేస్తూ అతని చుట్టు తిరిగిన చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Superman encircles Gabriel Boric after he submits his vote in today’s plebiscite 🇨🇱 pic.twitter.com/2Tk63noO62 — David Adler (@davidrkadler) September 4, 2022 (చదవండి: ప్రారంభోత్సవం రోజునే పరాభవం...హఠాత్తుగా కుప్పకూలిన వంతెన) -
ఈ మిరప యమ ఘాటు
లండన్: ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరప వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఒక్క మిరపకాయను తింటే చాలు మరణం తధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిరపకు డ్రాగన్ బ్రీత్‌గా నామకరణం చేశారు. వేల్స్‌కు చెందిన మైక్ స్మిత్ అనే రైతు నాట్టింగమ్ ట్రెంట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల సహకారంతో దీనిని పండించాడు. స్కావిల్లే హీట్ స్కేల్ మీద దీని ఘాటు 20లక్షల 48వేలుగా నమోదైంది. ఈ మిరపను నాలుక అంచున పెట్టుకున్న 10సెకన్లకే నోరంతా మండిపో యిందని స్మిత్ తెలిపారు. ప్రపంచంలో ఘాటైన మిరపగా గుర్తించాలని గిన్నిస్‌బుక్ వారికి స్మిత్ విన్నపం చేశాడు. -
గిట్టుబాటు ధర కల్పించండి సీఎస్‌కు టీపీసీసీ విజ్ఞప్తి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు మల్లురవి, సుధీర్‌రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, పొన్నాల సాక్షి, హైదరాబాద్: మిర్చి, కందులతో పాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్‌ను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు, టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు సోమవారం కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లా డుతూ... ప్రజా సమస్యలపై కలవడానికి కూడా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం లేదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గిట్టుబాటు ధర లేక మార్కెట్ యార్డులో మిర్చి తగలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, కందులను కొను గోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు. రైతులను దళారులు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవ డం లేదని టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్య క్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో వల్ల పరిహారం అందడం లేదన్నారు. నేడు కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం: టీపీసీసీ ముఖ్యుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమన్వయంతో పోరాటం చేయడానికి ప్రణాళిక అవసరమనే ఉద్దేశంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఒక హోటల్లో నేతలు సమావేశం కానున్నారు. -
కన్నీటి పంట
► అకాల వర్షంతో జిల్లాలో భారీగా నష్టం ► దెబ్బతిన్న మొక్కజొన్న, పొగాకు, నువ్వులు ► బూజుపడుతున్న మిర్చి ► నూజివీడులో నేలరాలిన మామిడి ► గింజ రాలిపోతున్న మినుము మచిలీపట్నం : అకాల వర్షం రైతులకు అపార నష్టం కలగజేసింది. ఊహించని విధంగా ఆదివారం కురిసిన వర్షం, బలమైన గాలులకు మొక్కజొన్న, పొగాకు, నువ్వు, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా నూజివీడు, బాపులపాడు, పమిడిముక్కల, ముసునూరు, వీరులపాడు తదితర ప్రాంతాల్లో వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 2,575 ఎకరాలు, పొగాకు 225 ఎకరాలు, నువ్వులు 60 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చేవిషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న.. ఆందోళనలో రైతన్న నూజివీడు మండలం తుక్కులూరు, జంగంగూడెం, మోర్సపూడి, బాపులపాడు, పమిడిముక్కల తదితర మండలాల్లో మొక్కజొన్న గింజలు కట్టే దశలో ఉంది. ఈదురుగాలుల ప్రభావంతో గింజలు గట్టిపడవని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చు చేశామని, కీలకదశలో పైరు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతులకు మరో రూ.10వేలు అదనంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నూజివీడులో 1.60 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈదురుగాలల ప్రభావంతో కాయలు నేలరాలాయి. నూజివీడు మండలంలో పొగాకు పందిళ్లు తడిచిపోయాయి. తడిసిన మిర్చి ఈ ఏడాది జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా మిర్చి సాగైంది. ఎకరాకు లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా, 10, 15 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. గతేడాది క్వింటాలు మిర్చి రూ.12,500 ధర పలకగా, ఈ ఏడాది రూ.5,200 నుంచి రూ.5,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వీరులపాడు, బాపులపాడు తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిచింది. మిర్చి నల్లరంగులోకి మారడం.. బూజుపట్టే అవకాశం ఉండటంతో నాణ్యత తగ్గి ధర మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు. ముంచిన మినుము జిల్లాలో ఈ ఏడాది 3.86 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేశారు. 60 శాతం మేర మినుముతీత జరిగింది. మిగిలిన 40 శాతం మినుముతీత దశలో ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం కురవడంతో పనలపై ఉన్న మినుము తడిచింది. ఎండిన మినుముకాయలు వర్షానికి తడిచి గింజలు రాలిపోతాయని రైతులు చెబుతున్నారు. మినుముకు జరిగిన నష్టంపై తమకు సమాచారం రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
ఎర్ర బంగారులోకం..
♦ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి ♦ శుక్రవారం 80వేల బస్తాలు రాక ♦ నిండిన యార్డులు, రహదారులు ♦ వరుస సెలవులే కారణం ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ శుక్రవారం ఎర్రబంగారంతో నిండిపోయింది. దాదాపు 80వేల మిర్చి బస్తాలను రైతులు మార్కెట్‌కు తరలించడంతో కళకళలాడింది. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మార్కెట్ యార్డును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్, కౌంటింగ్ తదితర ప్రక్రియను యార్డులోనే నిర్వహించారు. శని, ఆదివారం సెలవులు, అమావాస్య కావడంతో ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో గురు, శుక్రవారా ల్లో మిర్చి భారీగా అమ్మకానికి వచ్చింది. 12, 13 తేదీలు కూడా సెలవు దినాలు కావటంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. గురువారం కూడా దాదాపు 80 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. యార్డుల్లో సరుకు కొనుగోళ్లు, కాంటా లు పూర్తయినా వ్యాపారులు సరుకును కేంద్రాలకు తరలించలేకపోయారు. వాహనాల్లో లోడ్ చేయటం.. వాటిని తరలించటానికి సమయం పడుతోంది. శుక్రవారం కూడా 80వేల బస్తాల మిర్చి అమ్మకానికి రావటంతో యార్డులు, రహదారులపై రైతులు సరుకును దించక తప్పలేదు. మిర్చి, అపరాల యార్డు రహదారుల్లో బస్తాలను దించుకున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ కార్యాలయానికి దారికూడా మూసుకుపోయింది. ఓ వైపు ఎండ.. మరో వైపు ఘాటు ఉండటం తో కార్మికులు పంట ఉత్పత్తిని కాంటా పెట్టడానికి.. సరుకును వాహనాల్లో ఎత్తటానికి ఇబ్బంది పడ్డారు. మిర్చి గరిష్టధర రూ.12,300 పలికింది. ధర కూడా కొంత మేర ఆశాజనకంగా ఉండటంతో జిల్లా రైతులేకాక నల్లగొండ, వరంగల్, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన రైతులు సరుకును ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయకుండా నేరుగా మార్కెట్లో అమ్ముతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావటంతో యార్డులు, రహదారుల్లో ఉన్న సరుకునంతా బయటకు పంపించి.. సోమవారానికి యార్డులను సిద్ధం చేస్తామని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు. -
నాలుక్కింత చింత
ఒక్కోసారి జీవితం చప్పగా ఉన్నట్లనిపిస్తుంది. అప్పుడేం చేస్తాం? చురుకు పుట్టించే పనేదో పెట్టుకుంటాం. దెబ్బకి బండి రయ్యిమంటుంది. అలాగే ఒక్కోసారి నోరు చప్పిడిచప్పిడిగా మారుతుంది. అప్పుడేం చేయాలో తెలుసా? నాలుక్కింత చింత తగిలించాలి. మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ, చింతకాయలకు మన యంత్రాలు జివ్వున పరుగులు తీస్తాయి. మరి మీరివాళ ఏం చేయబోతున్నారు? చింత పులుసా? చింత పచ్చడా? చింత కూరా? చింతకాయ పండుమిర్చి పచ్చడి కావలసినవి చింతకాయలు - పావు కేజీ; పండు మిర్చి - 100 గ్రా; ఉప్పు - తగినంత; పసుపు - టీ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; వెల్లుల్లి రేకలు - 5; జీలకర్ర - అర టీ స్పూను; పసుపు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; నూనె - 6 టేబుల్ స్పూన్లు ఆవాలు - అర టీ స్పూను ఎండు మిర్చి - 2; ఇంగువ - కొద్దిగా తయారీ చింతకాయలను శుభ్రంగా కడిగి కచ్చాపచ్చాగా తొక్కి, గింజలు వేరు చేయాలి మిక్సీలో పండు మిర్చి వేసి మెత్తగా చేసి, శుభ్రం చేసి ఉంచిన చింతకాయలు జత చేసి మరో మారు తిప్పాలి ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర జత చేసి, మరోమారు మిక్సీ పట్టాలి. బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగ పప్పు, వెల్లుల్లి రేకలు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు, ఎండు మిర్చి జత చేయాలి మిగిలిన ఐదు టేబుల్ స్పూన్ల నూనె బాణలిలో వేసి కాగాక దించేసి, నూనె కొద్దిగా చల్లారాక ఇంగువ వేసి బాగా కలిపి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి. చింతకాయ నువ్వుల పచ్చడి కావలసినవి తాజా చింతకాయలు - పావు కేజీ; నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి - 12 (చిన్న ముక్కలుగా చేయాలి); ఉప్పు - తగినంత; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - చిటికెడు తయారీ: చింతకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి రెండు మూడు విజిల్స్ వచ్చాక దించి, చల్లార్చాలి బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి చింతకాయల మీద ఉండే తొక్క, లోపలి గింజలు తీసేసి, మిగిలిన భాగాన్ని గుజ్జు చేసి, కొద్దిగా నీళ్లు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి, స్టౌ మీద ఉంచి, మధ్యమధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి నువ్వుల పొడి జత చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేగాక, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేయించి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి. చింతకాయ మెంతి పులుసు కావలసినవి: చింతకాయలు - 7; సొరకాయ - చిన్న ముక్క; దోసకాయ - చిన్న ముక్క; మునగ కాడ - 1; నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతి పొడి - అర టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 6; బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నువ్వులను దోరగా వేయించి పొడి చేయాలి) తయారీ: చింతకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, ఉడికించి చల్లార్చాలి కూరగాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ఉడికించిన చింత కాయలకు తగినన్ని నీళ్లు జత చేసి, వాటి నుంచి రసం తీసి వడకట్టి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి పోపు వేయించి పక్కన ఉంచాలి పెద్ద గిన్నెలో... చింతకాయ రసం, ఉడికించిన కూరగాయ ముక్కలు, పచ్చి మిర్చి, బెల్లం పొడి, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, సుమారు పది నిమిషాలు మరిగించాలి చివరగా నువ్వుల పొడి, మెంతి పొడి వేసి పులుసు బాగా చిక్కబడ్డాక దించేయాలి. -
ఘాటెక్కిన మిర్చి..
రిటైల్ మార్కెట్లో కిలో రూ.60 విలవిల్లాడుతున్న వినియోగదారులు సరఫరా తగ్గిన ఫలితం సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో పచ్చిమిర్చి ధరల ఘాటు నషాలానికి ఎక్కింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.60కి చేరింది. టోకు మార్కెట్లో కేజీ రూ.38 ఉండగా, రైతుబజార్లో రూ.41 పలుకుతోంది. ఇదే సరుకు తోపుడుబండ్లపై పావు కిలో రూ.20 చొప్పున కేజీకి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. గత నెల వరకు కేజీ రూ.25-30కి లభించిన మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. డిమాండ్- సరఫరా మధ్య అంతరం పెరగడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం రోజుల్లోనే రెండు రెట్లు ధర పెరగడం ఇందుకు నిదర్శనం. మిర్చి ధరకు రెక్కలు రావడంతో ఈ ప్రభావం ఇతర కూరగాయలపైనా పడింది. మొన్నటివరకు కేజీ రూ.20-25 ధర పలికిన టమోట ఇప్పుడు రూ.40కి చేరింది. దోస, వంకాయ, క్యాబేజీ ధరలు మిగతా అన్నిరకాల కూరగాయలు రూ.30-60 మధ్య పలుకుతున్నాయి. మిచ్చితో పాటు బెండ, బీర, కాకర, చిక్కుడు, గోకర, క్యారెట్, బీన్స్, బీట్ రూట్లదీ అదే దారి. వంటింట్లో ప్రధాన నిత్యావసర వస్తువైన మిర్చి ధర పెరగడం గృహిణుల్లో కలవరం మొదలైంది. వర్షాలు మొదలైతే మిర్చి సరఫరా తగ్గి ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంటున్నారు. తగ్గిన సరఫరా నగర అవసరాలకు నిత్యం 90-100 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ఇప్పుడు 30-40 టన్నులకు మించట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా మిర్చి సాగు లేకోవడంతో కర్నూలు, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడా మిర్చికి డిమాండ్ ఉండటంతో నగర అవసరాలకు తగినంత సరుకు సరఫరా కావట్లేదని తెలుస్తోంది. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. -
మార్కెట్‌కు పెరుగుతున్న మిర్చి
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు రైతులు అమ్మకానికి తీసుకొచ్చే మిర్చి బస్తా ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం క్రితం వరకు 1000-2000 బస్తాల మిర్చి రాగా, ప్రస్తుతం 3నుంచి 4వేల వరకు మిర్చి బస్తాలను తీసుకొస్తున్నారు. మేడారం జాతర ముగిశాక మార్చి మొదటి వారం నుం చి మిర్చి సీజన్ ప్రారంభమయ్యే అవకాశముందని వ్యా పారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం 4,616 బస్తా ల మిర్చి రాగా, వండర్‌హాట్, యూఎస్-341 రకాలను పోలి ఉన్న 1055 రకం మిర్చి భూపాలపల్లి మండలానికి గుగులోతు రాజు తీసుకొచ్చారు. ఈ మిర్చిని చూడడానికి రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం తేజ రకానికి 9వేల వరకు ధర పలుకుతుండగా యూఎస్-341, వండర్ హాట్ రకాలకు రూ.9,500 ధర పలుకుతోంది. ఇక దేశీ రకం మిర్చి మార్కెట్‌కు ఇంతవరకు రాకపోగా, ఈ సారి క్వింటాల్‌కు రూ.15వేల పైచిలుకు ధర పలుకుతుందని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో మిర్చి,పత్తి మార్కెట్ ఉంటుంది మేడారం జాతర సందర్భంగా వచ్చే సోమవారం నుంచి ఆదివారం వరకు మార్కెట్ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోమ, మంగళవారాల్లో పత్తి, మిర్చి మార్కెట్ నడుస్తుందని, అపరాలు, పల్లి, పసుపు, మక్కలు, ధాన్యం యార్డులకు మాత్రం సెలవు ఉంటుందని మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని వారు కోరారు.