
ఈ మిరప యమ ఘాటు
లండన్: ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరప వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఒక్క మిరపకాయను తింటే చాలు మరణం తధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిరపకు డ్రాగన్ బ్రీత్‌గా నామకరణం చేశారు.
వేల్స్‌కు చెందిన మైక్ స్మిత్ అనే రైతు నాట్టింగమ్ ట్రెంట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల సహకారంతో దీనిని పండించాడు. స్కావిల్లే హీట్ స్కేల్ మీద దీని ఘాటు 20లక్షల 48వేలుగా నమోదైంది. ఈ మిరపను నాలుక అంచున పెట్టుకున్న 10సెకన్లకే నోరంతా మండిపో యిందని స్మిత్ తెలిపారు. ప్రపంచంలో ఘాటైన మిరపగా గుర్తించాలని గిన్నిస్‌బుక్ వారికి స్మిత్ విన్నపం చేశాడు.