
అప్పుడప్పుడు కొన్ని వింతలను, అద్భుతాలను, విచిత్రాలను, సౌందర్యాలను చూస్తూంటాం. కానీ అవన్నీ ఒకేదగ‍్గర కనిపించాలంటే ఇక్కడికి వెళ్లాలేమో..! ఈ ఫొటోలో కనిపిస్తున్న పర్వతం కేవలం పర్వతం కాదు, ఇదొక అధునాతన హోటల్. చిలీలోని హుయిలో హుయిలో అభయారణ్యంలో పటగోనీయా పర్వతశ్రేణుల్లోని ఒక పర్వతాన్ని ఇలా హోటల్‌గా మార్చారు. సాహసయాత్రికులకు, పర్వతారోహకులకు విడిది కేంద్రంలా దీనిని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
‘మౌంటెయిన్ మేజికా’ అనే ఈ హోటల్‌కు చేరుకోవాలంటే, వేలాడే వంతెన తప్ప వేరే మార్గమేదీ లేదు. తగిన శారీరక దారుఢ్యం, పర్వతారోహణ అనుభవం లేనివారు ఇందులోకి అడుగుపెట్టలేరు. దట్టమైన అడవి మధ్యనున్న ఈ హోటల్‌లో బసచేసే వారికి కిటికీల్లోంచి చూస్తే ఎటుచూసినా ప్రకృతి పచ్చదనం, చుట్టుపక్కల పర్వతాల నుంచి కిందకు దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ హోటల్‌లో 108 గదులు, రెస్టారెంట్, స్పా, స్విమింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. ఇందులో బస చేయడానికి రోజుకు 215 డాలర్లు (రూ.17,882) ఖర్చవుతుంది.
ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు..