Mountain cave
-
హిల్థ్రిల్ హోటల్! పర్వతారోహణ అనుభవం లేనివారు ఇక్కడికి చేరుకోలేరు..
అప్పుడప్పుడు కొన్ని వింతలను, అద్భుతాలను, విచిత్రాలను, సౌందర్యాలను చూస్తూంటాం. కానీ అవన్నీ ఒకేదగ్గర కనిపించాలంటే ఇక్కడికి వెళ్లాలేమో..! ఈ ఫొటోలో కనిపిస్తున్న పర్వతం కేవలం పర్వతం కాదు, ఇదొక అధునాతన హోటల్. చిలీలోని హుయిలో హుయిలో అభయారణ్యంలో పటగోనీయా పర్వతశ్రేణుల్లోని ఒక పర్వతాన్ని ఇలా హోటల్‌గా మార్చారు. సాహసయాత్రికులకు, పర్వతారోహకులకు విడిది కేంద్రంలా దీనిని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ‘మౌంటెయిన్ మేజికా’ అనే ఈ హోటల్‌కు చేరుకోవాలంటే, వేలాడే వంతెన తప్ప వేరే మార్గమేదీ లేదు. తగిన శారీరక దారుఢ్యం, పర్వతారోహణ అనుభవం లేనివారు ఇందులోకి అడుగుపెట్టలేరు. దట్టమైన అడవి మధ్యనున్న ఈ హోటల్లో బసచేసే వారికి కిటికీల్లోంచి చూస్తే ఎటుచూసినా ప్రకృతి పచ్చదనం, చుట్టుపక్కల పర్వతాల నుంచి కిందకు దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 108 గదులు, రెస్టారెంట్, స్పా, స్విమింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. ఇందులో బస చేయడానికి రోజుకు 215 డాలర్లు (రూ.17,882) ఖర్చవుతుంది. ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు.. -
18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో..
నిజామాబాద్: ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మహ్మద్ షాదుల్ ఎత్తైన మంచు పర్వతంపై తన స్వగ్రామం పేరును ప్రదర్శించి మమకారం చాటుకున్నారు. షాదుల్ రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని లదాఖ్‌లో గల 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం అన్నాసాగర్ పేరుతో ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. గ్రామస్తులు షాదుల్‌ను అభినందించారు. ఇవి చదవండి: ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్! -
ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో
చైనా:చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 40 వేల మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. నిరంతరాయంగా పడుతున్న వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా? -
900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట..
ఇంటింటికీ ఓ సందు.. సందుసందుకీ ఓ దారి సహజమే. అలాంటిది, కొన్ని వందల ఇళ్లు ఉండే ఊరంటే.. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉంటాయి. కానీ ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి రావాలి, లోపలికి పోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు కలిగి, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎల్తైన గ్రామాల్లో ఇదొకటి. ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే ఎత్తైన పర్వతశిఖరంపైన ఈ ప్రాచీన గ్రామం ఉంది. ఆ ఊరు పేరు షోంకే. తొమ్మిదొందల ఏళ్ల క్రితమే అది ఏర్పడింది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ జీవించిన వారిలో 20 తరాలకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు ఉన్నాయట. షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని. మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతం ప్రారంభించినప్పుడు ఆయాప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంలో దాడుల నుంచి కాపాడేందుకు.. కొందరిని ఇథియోపియాలోని ఈ ప్రాంతానికి పంపించారు అప్పటి పాలకులు. భద్రత కారణాలతో అప్పట్లోనే ఈ గ్రామానికి కేవలం రెండు ద్వారాలే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ద్వారాల ముందు గార్డులు కాపలా కాస్తుంటారు. ఇస్లాం బోధనలో అక్కడున్న షోంకే మసీదు పేరు గాంచినది. అక్కడ ప్రాచీన తరహా ఇస్లాంని బోధిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. కానీ ప్రస్తుతం 250 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. చాలామంది గ్రామస్తులు వ్యవసాయం కోసం, కొండప్రాంతాలను ఆనుకుని ఉండే ఇతర ప్రాంతాలకు తరలిపోయారట. ‘ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేము దీన్ని వీడలేని జ్ఞాపకంగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం మాకు ఇష్టంలేదు’ అంటున్నారు మిగిలిన స్థానికులు. ఇప్పటికీ స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతోనే వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు. నగరాల్లోని హంగులు, ఆర్భాటాలను వీళ్లు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఈ గ్రామం పర్యాటక ఆకర్షణగా నిలిచింది. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..!
సాక్షి,యడ్లపాడు(గుంటూరు): ఈతిబాధలు..వివాహ సమస్య, సంతానలేమీ.. చికాకులు ఇలా ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంటారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలను దర్శిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. మరికొన్ని చోట్ల సుదీర్ఘకాలంగా జరగని వివాహాలు తక్షణమే ముహుర్తాలు వస్తాయి. ఇంకొన్ని ఆలయాలకు వెళితే సంతానలేమీ సాఫల్యమవుతుందని భక్తుల నమ్మకం. గుంటూరు జిల్లాలోని ఆలయం ఒకటి వీటన్నింటికి ఎంతో భిన్నమైనది. మరెంతో విశిష్టమైనది. ఇక్కడి స్వామి వారు కొండబండరాయిపై ప్రతిమలా చెక్కబడి దర్శనమిస్తారు. సమీప ప్రాంతాల వారు రెండోవివాహాలు చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ ఆలయమే కళ్యాణ వేదిక. అందులోని స్వామివారే ఆ దంపతులకు శ్రీరామరక్ష. ఎర్రకొండపై గుహలా ఉన్న పురాతన లక్ష్మినర్సింహస్వామి గుడి కొండబండ తొర్రలో గుడి... జయలక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలోనే విశిష్టమైనదిగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడులో ఈ ఆలయం ఉంది. పూర్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 16 నరసింహస్వామి పూజలందుకున్న దేవాలయాల్లో ఇది ఒకటిగా ప్రాచుర్యం పొందింది. గ్రామానికి సమీపానే 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఎర్రకొండపై ఈ స్వామివారి గుడి ఉంది. ఆలయ గోపురాలు, భారీ మండపాలు చుట్టూ ప్రాకారాలు ఏమీ లేకుండా సాదాసీదాగా కనిపిస్తుంది. భారీ బండారాయిని తొలచిన చిన్నపాటి గుహ గుడిగా నిర్మితమైంది. బండరాతిపై చెక్కబడిన ప్రతిమయే దైవంగా దర్శనమిస్తుంది. కొండపై స్వయంభుగా స్వామివారు వెలిశారని, రాజవంశీయులు ప్రతిమను చెక్కించి పూజలు చేశారని, ఓ మహర్షి క్రతువు నుంచి ఉద్భవించిందని, ఇలా రకరకాల కథలు స్థానిక పెద్దల నుంచి వినవస్తాయి. అయితే వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవీ అందుబాటులో లేవని చెప్పాలి. కొండకింద నుంచి పైవరకు తోటలా పెరిగిన భారీసైజు తులసీ మొక్కలు కోవెల ఇలా.. కొండ శిఖరంపై ఉన్న భారీ బండరాయిని నాగపడిగ ఆకారంలో చెక్కబడి గుహగా మలిచారు. ఏకకాలంలో సుమారు 400 గొర్రెలు నిలబడేంత విశాలంగా గుహ ప్రదేశం ఆకర్షణీయంగా ఉండేది. స్వామివారి అభిముఖంగా రాతితో చెక్కబడిన పాదాలు, ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తాయి. ఈ పాదాలను సీతమ్మ పాదాలుగా చెప్పుకుంటారు. గ్రామస్తులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో స్వామిని దర్శించి పూజించేవారు. ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ఈ స్వామి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదంగా మామిడికాయలు, వడపప్పు, పానకం, విసనకర్రలు బ్రాహ్మణులు, భక్తులు పంపిణీ చేయడం విశేషం. ఓనాడు ఈ కొండపై పిడుగు పడి గుహ ముందు భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం కొద్ది భాగమే గుహ ఆకారంలో ఉంది. సీతమ్మపాదాలు, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ప్రస్తుతం లేవు. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన నాటి నీటిదొన ఉన్న ప్రాంతం ద్వితీయ వివాహాలు జరిపించే దివ్యక్షేత్రం... ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం ద్వితీయ వివాహాలు నిలయంగా ఉండేది. సంసారంలో అపశ్రుతులు ఎదురై అందుకు దంపతులు విడిపోయినా.. శాశ్వతంగా దూరమైనా పెళ్లి తప్పా ఏ అచ్చటా ముచ్చట తీరని వారి పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇలాంటి వారికి పెద్దలు నచ్చజెప్పొలేదా వారే తమకు నచ్చిన వారిగా మరోతోడు వెతుక్కున్న సమయంలో రెండోపెళ్లిని పెద్దలు ఇక్కడే జరిపించేవారు. అలా రెండోసారి పెళ్లి చేసుకునే వారికి వేదికలా మారింది. దీంతో సమీప గ్రామస్తులే కాదు సుదూర ప్రాంతాలకు చెందిన వారుసైతం ఇక్కడే పూజలు నిర్వహించి తమ రెండో వివాహాలను జరిపించుకునేవారు. స్వామి చెంత రెండోపెళ్లి చేసుకున్న జంటలు శాంతిసౌఖ్యాలతో వర్థిల్లుతారని అంతా విశ్వసించేవారట. ఒంటరి జీవితాలను జంటగా చేసిందే ఆ స్వామి వారేనని భావించి ఇక్కడ వివాహాలు చేసుకుంటారని పెద్దలు చెబుతుంటారు. రెండోవివాహం చేసుకున్న వారంతా స్వామి వారి ఉత్సవాలకు తప్పని సరిగా హాజరై మొక్కులు తీర్చుకోవడం విశేషం. రెండో పెళ్లిళ్లకు ప్రసిద్ధి...నూర్పాల పోలిరెడ్డి, నృసింహస్వాముని భక్తుడు. ప్రస్తుతం నాకు 76 ఏళ్లు. సుమారు 5 దశాబ్దాలుగా స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నాను. సుబ్రమణ్యం అనే గురువు ఈ స్వామివారి పూజాక్రతులు నిర్వహించేవారు. ఏటా నృసింహ జయంతి నాడు కొండపై కళ్యాణ వేడుకలతో పాటు మామిడి పళ్లు, విసనకర్రలు, పానకం పంపిణీ చేసేవారు. కందకంలోకి పడుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చేది. రెండోసారి వివాహం చేసుకునే దంపతులకు ఈ కోవెల నిలయమైంది. తులసీవనాలు, చల్లని వాతావరణం...చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, యడ్లపాడు మా తాతల కాలంలో నృసింహుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభలు కట్టుకుని అక్కడికి వెళ్లేవాళ్లం. కొండపై తులసి సువాసనలతో ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపై దొనలో మంచినీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. భక్తులు కొండపై గొర్రెలు, పశుకాపరులు ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకునేవారు. చదవండి: బాగ్దాద్ నుంచి భారత్‌కు వచ్చిన ఫకీరు, ఒక్క రూపాయికే అత్తరు -
అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం
న్యూఢిల్లీ: చైనా, భారత్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలోని ఒక చిన్న పర్వత పాదంపై నిఘా కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయడమే తాజా ఘర్షణలకు కారణమని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్, చైనాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత భూభాగంలో గాల్వన్ నది దక్షిణ తీరంలో చైనా ఆ పోస్ట్‌ను ఏర్పాటు చేయడాన్ని కల్నల్ సంతోష్ నాయకత్వంలోని భారత దళాలు అడ్డుకున్నాయి. ఆ పోస్ట్ ను తొలగించేందుకు సోమవారం సాయంత్రం ప్రయత్నించాయి. ఆ కేంద్రంలో ఉన్న కొద్దిమంది చైనా సైనికులు భారత సైనికులను అడ్డుకున్నారు. కానీ, కాసేపటికి వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న చైనా భూభాగం వైపు వెళ్లిపోయారు. ఈలోపు, భారత్ వైపు నుంచి మరిన్ని బలగాలు అక్కడికి చేరుకుని చైనా ఏర్పాటు చేసిన పోస్ట్‌ను కూల్చేయడం ప్రారంభించాయి. కాసేపటికి, మరిన్ని బలగాలతో చైనా సైనికులు మళ్లీ వచ్చారు. రాళ్లు, మేకులు కుచ్చిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు పరస్పర దాడులు కొనసాగాయి. దాడుల సమయంలో రెండు దేశాలకు చెందిన కొందరు సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నీరున్న గాల్వన్ నదిలో పడిపోయారు. చైనా బలగాల దాడిలో కల్నల్ సంతోష్ చనిపోయారు. కొందరు భారత సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని, అయితే, కాసేపటికి వారిని వదిలివేసిందని సమాచారం. అయితే, ఇంకా పది మంది భారత సైనికులు బందీలుగా ఉన్నట్లు ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు. -
కొండగుహల్లో రహస్య ప్రార్థనలు
హ.అబూబక్ ్ర(ర) చాలా శాంతస్వభావి, కారుణ్య హృదయులు. యావద్ జాతి ఆయన్ని గౌరవించేది. చిన్నాపెద్ద అందరూ ఆయన్ని అభిమానించేవారు. ఆయన ఖురైష్ వంశంలోని అత్యంత ఉన్నత వంశానికి చెందినవారు. గొప్ప వివేక సంపన్నులు. వృత్తివ్యాపారం, దైవం ఆయన వ్యాపారంలో వృద్ధితోపాటు, ఆయనకు మంచి మనసునూ ప్రసాదించాడు. వ్యాపారంలో వచ్చిన సంపాదన అంతా పేదసాదలకోసం ఖర్చుపెట్టేవారు. ప్రతి వ్యవహారంలోనూ ప్రజలు ఆయన్ని సలహాలు అడిగేవారు. చక్కటి సలహాలతో వారి సమస్యల్ని ఇట్టే పరిష్కరించేవారు. ముహమ్మద్ (స) తోపాటు, ఆయన కూడా తనదగ్గరికొచ్చే వారికి ఇస్లామ్ ధర్మాన్ని పరిచయం చేసేవారు. చాలామంది ఆయన మాట విని ధర్మపరివర్తన చెందారు. మొట్టమొదట ధర్మ పరివర్తన చెందిన వారిలో ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర), జుబైర్ బిన్ అవ్వామ్ (ర), అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (ర), సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ (ర), తల్ హా బిన్ ఉబైదుల్లాహ్ (ర) తదితరులు అగ్రగణ్యులు. తరువాత, జర్రాహ్ కొడుకు అబుఉబైదా (ర) అబూఅర్ఖమ్ కుమారుడు అర్ఖమ్ (ర) విశ్వాసులుగా మారారు. ఈవిధంగా అనేకమంది ఇస్లామ్ ధర్మ పరిధిలోకొచ్చారు. వీరిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు చాలామంది ఉన్నారు. విశ్వాస ప్రకటన చేసిన స్త్రీలలో ప్రియప్రవక ్త(స) కుమార్తెలతోపాటు, హ.అబూబకర్ కుమార్తెలూ ఉన్నారు. ఈవిధంగా దైవధర్మం క్రమక్రమంగా విస్తరించసాగింది. దాంతోపాటే వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ధర్మపరివర్తన చెందిన ఈ కొద్దిమంది విశ్వాసులు ఇప్పటివరకూ తమతమ గృహాల్లోనే రహస్యంగా ప్రార్ధనలు చేసుకునేవారు. ఇప్పుడు అది కూడా కష్టం కావడంతో, జనసంచారానికి దూరంగా కొండగుహల్లో నమాజులు చేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి పెద్దచర్చకే దారితీసింది. ’ఏమిటీ, ముహమ్మద్ విగ్రహారాధనను కాదనడమా? తాత ముత్తాతల ప్రాచీన ధర్మాన్ని త్యజించి, తనను తాను ప్రవక్తగా ప్రకటించుకోవడమా? ఎంతధైర్యం? అంటూ చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఎవరినోట విన్నా ఇదే చర్చ. ముహమ్మద్ ప్రవక్తను రకరకాల మాటలు అనడం ప్రారంభించారు. కొంతమంది పిచ్చిపట్టిందన్నారు. కొంతమంది దయ్యం పట్టిందన్నారు, మరికొంతమంది సంచలనాలకోసం, పేరుప్రఖ్యాతుల కోసం ఇదంతా చేస్తున్నాడన్నారు. కొంతమంది తేలిగ్గా కొట్టిపారేస్తూ ఇదసలు పట్టించుకోవాల్సినంత విషయమే కాదన్నారు. కొంతమంది అసలిదేమిటో చూద్దాం, పొయ్యేదేముంది? ఉంటే లాభమే ఉంటుంది తప్ప నష్టం ఉండకపోవచ్చు. తెలుసుకుందాం, పరిశీలిద్దాం. తప్పేముంది? అనుకున్నారు. ‘ప్రశ్నిద్దాం, పరిశీలన చేద్దాం’ అనుకున్నవారు చాలామంది వాస్తవాలు తెలుసుకొని విశ్వాసులుగా మారిపోయారు. అబూతాలిబ్ మనసులో కూడా ఇదే ఆలోచన వచ్చింది. అసలు అబ్బాయిని కలిసి వివరంగా మాట్లాడాలి. అసలా కొత్తధర్మం సంగతేంటో తేల్చాలి అని జాఫర్‌ను వెంటబెట్టుకొని బయలుదేరారు. ఆ సమయాన ముహమ్మద్ ప్రవక్త ఊరికి దూరంగా ఒక కొండగుహలో హ. అలీతో కలసి నమాజ్ చేస్తున్నారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)