
చైనా:చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 40 వేల మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. నిరంతరాయంగా పడుతున్న వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా?