గిట్టుబాటు ధర కల్పించండి సీఎస్‌కు టీపీసీసీ విజ్ఞప్తి | TPCC request to CS for cost of corp | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కల్పించండి సీఎస్‌కు టీపీసీసీ విజ్ఞప్తి

Published Tue, Apr 4 2017 2:49 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

గిట్టుబాటు ధర కల్పించండి సీఎస్‌కు టీపీసీసీ విజ్ఞప్తి

గిట్టుబాటు ధర కల్పించండి సీఎస్‌కు టీపీసీసీ విజ్ఞప్తి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న
కాంగ్రెస్‌ నేతలు మల్లురవి, సుధీర్‌రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, పొన్నాల


సాక్షి, హైదరాబాద్‌: మిర్చి, కందులతో పాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌ను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు, టీపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి తదితరులు సోమవారం కలిశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లా డుతూ... ప్రజా సమస్యలపై కలవడానికి కూడా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇవ్వడం లేదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గిట్టుబాటు ధర లేక మార్కెట్‌ యార్డులో మిర్చి తగలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, కందులను కొను గోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు. రైతులను దళారులు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవ డం లేదని టీపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్య క్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో వల్ల పరిహారం అందడం లేదన్నారు.

నేడు కాంగ్రెస్‌ ముఖ్యుల సమావేశం: టీపీసీసీ ముఖ్యుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమన్వయంతో పోరాటం చేయడానికి ప్రణాళిక అవసరమనే ఉద్దేశంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఒక హోటల్‌లో నేతలు సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement