Super Hero
-
‘సూపర్ హీరో’ సిసోడియా.. విద్యాశాఖ ముసుగులో లిక్కర్ మంత్రి!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణకు సోమవారం హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఈ క్రమంలో ఆయనకు మద్దతు తెలుపుతూ సిసోడియాను సూపర్ హీరోగా గ్రాఫిక్ చిత్రాన్ని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎలాంటి క్యాప్షన్ లేనప్పటికీ.. తాను చెప్పాలనుకున్న అంశాన్ని గ్రాఫిక్ చిత్రంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలో ‘ఢిల్లీ ఎడ్యుకేషనల్ మోడల్’ పేరుతో ఉన్న షీల్డ్‌ను పట్టుకున్నారు సిసోడియా. ఈడీ, సీబీఐ పేరుతో వచ్చే బాణాల నుంచి చదవుకుంటున్న ఓ చిన్నారిని రక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ ట్వీట్ వైరల్‌గా మారింది. pic.twitter.com/sPA4PwMllK — Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2022 మరోవైపు.. కేజ్రీవాల్ ట్వీట్‌పై అదే స్టైల్లో గ్రాఫిక్ చిత్రంతో విమర్శలు గుప్పించింది బీజేపీ. మద్యం బాటిళ్లు, నగదు కట్టలను కాపాడేందుకు సిసోడియా తెరిచిన పుస్తకాన్ని షీల్డ్‌లా పట్టుకున్నట్లు అందులో చూపించింది బీజేపీ. ఈ ఫోటోను ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు సునీల్ యాదవ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో కేజ్రీవాల్ సైతం ఓ చేతిలో మద్యం బాటిల్, మరో చేతిలో ఎన్నికల గుర్తు చీపురు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ‘విద్యాశాఖ ముసుగులో ఉన్న లిక్కర్ మంత్రి’ అంటూ రాసుకొచ్చారు సునీల్ యాదవ్. शराब मंत्री शिक्षा मंत्री की आड़ में https://t.co/pGDScU64zz pic.twitter.com/8CTOFvuU5S — Sunil Yadav (@SunilYadavBJP) October 17, 2022 ఇదీ చదవండి: తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా! -
దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు: వీడియో వైరల్
చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ప్రసంగిస్తున్నాడు. మరోవైపు సూపర్హిరో వేషధారణలో ఒక బుడ్డోడు అధ్యక్షుడు చుట్టు సైకిల్ రైడింగ్ చేస్తూ కనిపించాడు. వాస్తవానికి ఈ ఘటన చిలీ అధ్యక్షుడు కొత్త రాజ్యంగానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తూ... ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. అధ్యక్షుడు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ఒక చిన్నపిల్లవాడు సూపర్ హిరోల బ్లూకలర్ దుస్తులను ధరించి సైకిల్‌పై రైడ్ చేస్తూ.... చూపరులను ఆకర్షించాడు. మధ్యలో ఒక్కసారి సైకిల్ని ఆపి అధ్యక్షుడి ప్రసంగం విని మళ్లీ తన రైడింగ్‌లో నిమగ్నమైపోయాడు. అయితే ఆయన ప్రతిపాదించిన కొత్త రాజ్యంగ ప్రజాభిప్రాయ సేకరణ అత్యధిక మెజారిటీతో తిరస్కరణకు గురైంది. సుమారు 7.9 మిలియన్ల మంది ఈ కొత్త ముసాయిదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. బోరిక్ ఆర్థిక, సామాజిక పరంగా కొత్త సంస్కరణలు తీసుకువస్తానన్న హామీతో పదవిలోకి వచ్చారు. కానీ బోరిక్ ఈ మెజారిటీ ఓటు తిరస్కరణ తన పొలిటికల్ కెరియర్ని సందిగ్ధంలో పడేసింది. ఏదీ ఏమైనా చిలీ అధ్యక్షుడు ప్రసంగిస్తున్న సమయంలో బైక్ రైడ్ చేస్తూ అతని చుట్టు తిరిగిన చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Superman encircles Gabriel Boric after he submits his vote in today’s plebiscite 🇨🇱 pic.twitter.com/2Tk63noO62 — David Adler (@davidrkadler) September 4, 2022 (చదవండి: ప్రారంభోత్సవం రోజునే పరాభవం...హఠాత్తుగా కుప్పకూలిన వంతెన) -
డైరెక్టర్ బతిమాలినా.. ఆ నటుడు వినలేదు!
సూపర్హీరోయిజం అనేది జస్ట్ ఒక ఎక్స్‌ఫ్యాక్టర్ మాత్రమే. బేసిక్ ఎమోషన్స్‌తో డీల్ చేయగలిగినప్పుడు మాత్రమే అది జనాలకు ఎక్కుతుంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కనెక్టివిటీనే అందుకు ఒక ఎగ్జాంపుల్. మిన్నల్ మురళితో సక్సెస్ అందుకున్న దర్శకుడు బసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. టోవినో థామస్ లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ నెట్‌ఫ్లిక్స్ ‘మిన్నల్ మురళి’.. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా అలరించేదే. అయితే హీరో తర్వాత షిబు క్యారెక్టర్ జనాలకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని, అదే టైంలో ఎమోషన్స్‌ని సైతం పంచుతుంది. మిన్నల్ మురళి చిత్రంలో షిబు క్యారెక్టర్ని పోషించింది నటుడు గురు సోమసుందరం. కోలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈయన. ఒకవైపు ఎమోషన్స్‌తో పాటు నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. అయితే ఈ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే ముందు దర్శకుడు చేసిన ఓ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించాడట ఆయన. వాకిన్ ఫినిక్స్ లీడ్రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ చూసి.. ఆ తరహా మాడ్యులేషన్‌ను షిబు క్యారెక్టర్ కోసం డెవలప్ చేయమని గురు సోమసుందరానికి సూచించాడట డైరెక్టర్ బసిల్ జోసెఫ్. కానీ, గురు సోమసుందరం మాత్రం అందుకు కుదరదని తేల్చి చెప్పాడట. దీంతో బసిల్ బతిమాలడడం మొదలుపెట్టాడట. అయినా ఆయన నో అనే అనేశారట. వాకిన్ ఫినిక్స్ లాంటి నటుడంటే తనకు ఇష్టమేనని, కానీ, షిబూ క్యారెక్టర్ కోసం వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్‌ల ప్రభావం తనపై పడడం తనకు ఇష్టలేక ఆ పని చేయనని చెప్పానని షిబూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘థియేటర్ ఆర్టిస్టులకు శిక్షణలో ఒక విషయాన్ని నేర్పిస్తారు. సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది రీజియన్, ఇండియన్, వెస్ట్రన్ సినిమాగా విభజిస్తారు. దాని ప్రకారం ఇతర పాత్రల ప్రభావం.. తమ మీద ఉండకూడదని నటులు బలంగా ఫిక్స్ అవ్వాలి. కానీ, చాలామంది హీరోలు దీనికి భిన్నంగా.. హాలీవుడ్, ఇతర భాషల హీరోలను అనుకరిస్తారు. థియేటర్ ఆర్ట్ మీద నాకు అభిమానం ఎక్కువ. అందుకే నేను ఆ కండిషన్‌కు ఒప్పుకోలేదు. అయినా మా డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు 46 ఏళ్ల గురు సోమసుందరం. మలయాళం రాకపోయినా బసిల్ తనకు షిబు క్యారెక్టర్ని ఆఫర్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, కానీ, ఇప్పుడు షిబు క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఆఫర్లు సైతం వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నారు గురు సోమసుందరం . కోలీవుడ్ మూవీ ‘ఆరణ్య కాండం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన గురు సోమసుందరం.. పాండియ నాడు, జిగరతాండ, తూంగ వనం, పెట్టా, మారా, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక మిన్నల్ మురళిలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉష(నటి షెల్లీ కిషోర్) ప్రేమ కోసం పరితపించే భగ్న ప్రేమికుడిగా షిబు పాత్రలో అలరించాడాయన. -
ఇండియాలో మరో సూపర్‌హీరో మూవీ
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో మూవీస్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. తమ కున్న పవర్స్‌తో ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడుతుంటాఈ వీరు. అయితే ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలు కేవలం హాలీవుడ్ నుంచి మాత్రమే వచ్చాయి. అందులో ఎక్కువగా డీసీ, మార్వెల్ నిర్మాణ సంస్థల నుంచే వచ్చాయి. ఇండియా సినీ పరిశ్రమల నుంచి ఇలాంటి సూపర్ హీరో మూవీస్ కొన్ని వచ్చాయి. అందులో కేవలం హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘క్రిష్’ మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా మలయాళం నుంచి అలాంటి మరో సూపర్ హీరో మూవీ రాబోతోంది. అదే ‘మిన్నల్ మురళి’. టోవినో థామస్ హీరోగా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌హీరో మూవీని సోఫియా పాల్ నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదలైంది. డీసీ, ఎమ్‌సీయూ మూవీస్ నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా ఆకట్టకునేలా ఉంది. ఎటువంటి బాధ్యత లేని ఓ యువకుడిపై పిడుగు పడుతుంది. కానీ అతని ఏం కాకపోగా అద్భుత పవర్స్ వస్తాయి. వాటిని ఎలా ఉపయోగించాడు అనేదే కథ. ఈ సూపర్ హీరో ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి. చదవండి: న్యూ అప్డేట్.. అక్టోబర్ 29న రెడీగా ఉండండంటూ ట్వీట్ -
అది నేను కాదు.. సోనూసూద్: కేటీఆర్
హైదరాబాద్: కరోనా కాలంలో ఆపదలో ఉన్నవాళ్లు సాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను, రాజకీయ నేతలను, పొలిటికల్ పార్టీల అకౌంట్లను సాయం కోసం ట్యాగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రోజూ వందల కొద్దీ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. వాటిలో తనకు వీలైనంత వరకు సాయం చేస్తున్నాడాయన. రీసెంట్గా సాయం అందుకున్న ఓ వ్యక్తి కేటీఆర్‌ను ‘సూపర్‌హీరో’గా పొగడగా.. అందుకు సోనూసూద్ అర్హుడంటూ కేటీఆర్ బదులిచ్చారు. తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నందకిషోర్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అడగ్గానే.. అందేలా చూసినందుకు థ్యాంక్స్‌తో సరిపెట్టలేనని ఆ వ్యక్తి పోస్టు చేశాడు. అడిగిన వెంటనే సాయం అందించనందుకు కృతజ్ఞతలని, తెలంగాణ ప్రజలకు మీతరపున అందుతున్న సాయం మరువలేనిదని, చివరగా మీరు సూపర్ హీరో అని చెప్పాలనుకుంటున్నానని నందకిషోర్ ట్వీట్ చేశాడు. Am just an elected public representative doing my bit brother You can call @SonuSood a super hero for sure 👍 Also request you to kindly help others in distress https://t.co/S3zkOJrEaW — KTR (@KTRTRS) May 31, 2021 బ్రదర్ అంటూ.. దానికి ప్రతిగా కేటీఆర్ స్పందిస్తూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా తోచిన సాయం మాత్రమే చేశాను బ్రదర్.. మీరు సోనూసూద్‌ను(ట్యాగ్ చేసి మరీ) సూపర్ హీరో అనడం కరెక్ట్. ఆపదలో ఉన్నవాళ్లు మీరు సాయం అందించండి అని ఆ వ్యక్తికి సూచించాడు. కేటీఆర్ రిప్లైకి సోనూసూద్ కూడా స్పందించారు. ‘థ్యాంక్ యూ సో మచ్ సర్. కానీ, తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్ హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నాకు మరో ఇంటిలాంటిది. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్ రీ ట్వీట్ చేశారు. Thank you so much sir for your kind words! But you are truly a hero who has done so much for Telengana. The state has developed so much under your leadership. I consider Telengana as my second Home as its my place of work & the people have shown me so much love over the years🇮🇳 https://t.co/8LG65I0G01 — sonu sood (@SonuSood) June 1, 2021 -
నేను రక్షకుడిని కాదు!
లాక్డౌన్ సమయంలో ఎంతోమంది తమ ప్రాంతాలు చేరుకునేందుకు సహాయపడ్డారు నటుడు సోనూ సూద్. ‘మా పాలిట రక్షకుడిలా వచ్చావు’ అని దీవెనలందించారు వలస కార్మికులు. సూపర్ హీరో అని సోషల్ మీడియాలో ఒకటే పొగడ్తల వర్షం. అయితే ఇప్పుడు సోనూ సూద్ మాత్రం ‘నేను రక్షకుడిని కాను’ అంటున్నారు. ‘ఐయామ్ నో మెసయ్యా’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం) అనే టైటిల్‌తో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకం డిసెంబర్లో విడుదల కానుంది. ‘ఇది నా జీవిత కథ. కేవలం నాది మాత్రమే కాదు. ఎన్నో వేలమంది వలస కార్మికుల కథ’ అన్నారు సోనూ సూద్. -
సూపర్ హీరో... రిచర్డ్ స్టాన్టన్
చియంగ్ రాయ్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్ గుహ ఘటనలో బ్రిటన్ డైవర్ రిచర్డ్ స్టాన్టన్ సూపర్ హీరోగా అందరి అభిమానాలు అందుకుంటున్నారు. కోచ్ సహా ‘వైల్డ్ బోర్స్’ సాకర్ విద్యార్థుల బృందం.. హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా గుహ లోపల చిక్కుకున్న ప్రాంతా న్ని మొదటగా గుర్తించిన స్టాన్టన్.. సహాయక చర్యలు ముమ్మరం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయనిచ్చిన సమాచారం ఆధారంగానే వీరిని కాపాడిన ఆపరేషన్ జోరందుకుంది. బ్రిటన్ సహా వివిధ దేశాల డైవర్లు చొరవతీసుకుని మూడ్రోజులపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ పూర్తయ్యాక థాయ్‌లాండ్ నుంచి బయలుదేరిన స్టాన్టన్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పటినుంచి.. బాధితులంతా బయటకు వచ్చేంతవరకు జరిగిన రోమాంచిత ఘటనలను ఆయన వివరించారు. గుర్తించేందుకే ఆలస్యమైంది! జూన్ 23న అందరిలాగే థాయ్ పాఠశాల విద్యార్థుల ఫుట్‌బాల్ బృందం, కోచ్ ఎక్కాపోల్ చాంథవాంగ్తో కలిసి థామ్ లువాంగ్ గుహలను సందర్శించేందుకు వెళ్లింది. ఇంతలో హఠాత్తుగా గుహను వరద ముంచేయడంతో కోచ్ సహా సాకర్ చిన్నారుల బృందం తప్పించుకునే ప్రయత్నంలో గుహలోపల చిక్కుకుపోయారు. వీరిని కాపాడాలని థాయ్ అధికారులు, డైవర్లు ప్రయత్నించినప్పటికీ.. పిల్లలను గుర్తించడమే పెద్ద సవాల్‌గా మారిందని స్టాన్టన్ తెలిపారు. ఘటన జరిగిన 10 రోజుల వరకు వీరంతా ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయామన్నారు. ఆ తర్వాత లోయలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఓ భారీ రాయి వెనక వీరున్నట్లు తను గుర్తించినట్లు ఆయన తెలిపారు. లోయలో చిన్నారులను తొలిసారి చూసినపుడు ఒక్కరొక్కరిని లెక్కబెడుతూ.. 13 మంది ఉన్నారని నిర్ధారించుకున్నాకే హమ్మయ్య అనిపించింది’ అని స్టాన్టన్ వెల్లడించారు. -
ఇండియన్ స్క్రీన్‌పై మరో సూపర్ హీరో
క్రిష్, రావన్ లాంటి సినిమాలతో అతీంద్రియ శక్తులున్న మనుషులను భారతీయ ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు మన దర్శక నిర్మాతలు. హాలీవుడ్లో రెగ్యులర్‌గా వచ్చే సూపర్‌మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్ లాంటి సూపర్ హీరోలు ఇటీవల కాలంలో ఇండియన్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తున్నారు. భారీ మార్కెట్ స్టామినా ఉన్న స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ తో ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు మన మేకర్స్. అందుకే హృతిక్, షారూఖ్ లాంటి టాప్ స్టార్స్ సూపర్ హీరోలుగా మెప్పించారు. త్వరలో మరో బాలీవుడ్ హీరో కూడా ఈ లిస్ట్‌లో చేరబోతున్నాడు. యంగ్ హీరో రణబీర్ కపూర్ లీడ్ రోల్లో ఓ సూపర్ హీరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ఈ సినిమాలో రణబీర్‌ను డ్రాగన్‌లా చూపించనున్నాడు. భారతీయ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించటానికి ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'హౌటు ట్రెయిన్ యువర్ డ్రాగన్' ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
సూపర్ హీరో
గత నెలలో విరాట్ కోహ్లి పేరిట ఓ త్రీడీ గేమ్ విడుదల అయింది. ఇందులో తనో సూపర్ హీరో. తన బ్యాట్‌కు ఉన్న శక్తితో స్పైడర్‌మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్లపై యుద్ధం చేస్తాడు. దేశంలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌తోనూ ఇలాంటి గేమ్ డిజైన్ చేయలేదు. సూపర్ హీరో అనే ట్యాగ్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు చూసిన తర్వాత సూపర్ హీరో ట్యాగ్‌కు సరైన అర్హత విరాట్‌కే ఉంది. సాక్షి క్రీడావిభాగం నాయకుడు ఎప్పుడూ ముందుండి నడిపించాలి. ఆపదలో ఉన్నప్పుడు తెగువ చూపించాలి. యుద్ధానికి వెళితే సహచరుల కంటే ముందుగా దూసుకెళ్లాలి. ఈ లక్షణాలన్నీ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే విరాట్ చూపించాడు. ఏ కెప్టెన్ అయినా గెలవడానికే ఆడతాడు. తప్పదనుకుంటే డ్రా కోసం ఆడతాడు. ఆస్ట్రేలియాలో భారత్‌కు ఉన్న రికార్డు... గత సిరీస్‌లో మొత్తం అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అవమానం... ఇలాంటివన్నీ ఆలోచిస్తే... తొలి టెస్టు చివరి రోజు నిదానంగా ఆడుకుని డ్రా చేసుకోవడానికే చాలామంది కెప్టెన్లు మొగ్గు చూపేవారు. కానీ కోహ్లి మాత్రం కచ్చితంగా గెలవాల్సిందే అనే ధోరణితో ఆడాడు. కెప్టెన్‌గా అతనికి వందకు వంద మార్కులు పడింది ఇక్కడే. గతంలో చాలామంది భారత కెప్టెన్లు మ్యాచ్‌లను డ్రా చేసుకోవడానికే మొగ్గుచూపేవారు. వీరికి భిన్నంగా కోహ్లి ఆలోచనా ధోరణి సాగుతోంది. కెప్టెన్‌గా హిట్ సీనియర్ అశ్విన్‌ను కాదని ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులోకి కరణ్ శర్మను తీసుకున్నాడు. దానిని ఇప్పటికీ సమర్థించుకుంటున్నాడు. తొలిరోజు తన కెప్టెన్సీ మీద విమర్శలు వచ్చాయి. ఆత్మరక్షణ ధోరణిలో ఫీల్డింగ్ సెట్ చేశాడనే మాట వినిపించింది. కానీ వార్నర్ వేగంగా ఆడుతూ, బౌలర్లు సరైన ట్రాక్‌లో లేనప్పుడు ఏ కెప్టెన్ అయినా ఇదే చేస్తాడు. తొలిరోజు సాయంత్రం సెషన్లో బ్రాడ్ హాడిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కోహ్లి... ఫీల్డర్లను పిచ్ చుట్టూ మోహరించాడు. దీంతో ఒత్తిడి పెరిగి హాడిన్ అవుటయ్యాడు. బౌలర్లకు వికెట్‌పై సహకారం లేని సమయలో ఓ కెప్టెన్ ఎలా వ్యవహరిస్తాడో విరాట్ అలాగే వ్యవహరించాడు. మద్దతు పెరుగుతోంది వన్డేల్లో ధోని అద్భుతమైన కెప్టెన్ అయినా... టెస్టుల్లో తన సారథ్యం సరిగా లేదని ఈ ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్ కావాలని చాలా రోజులుగా వినిపిస్తోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం కోహ్లి రూపంలో దొరికిందనే అనుకోవాలి. ధోని కూడా ఈ ప్రపంచకప్ తర్వాత ఏదో ఒక ఫార్మాట్‌ను వదులుకునే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా అవి టెస్టులే అవుతాయి. తొలి టెస్టులో కోహ్లి సారథిగా ఆకట్టుకున్నందున... తనని పూర్తిస్థాయి కెప్టెన్‌ని చేయాలనే డిమాండ్ అప్పుడే ఊపందుకుంది. ఇక మిగిలిన మూడు టెస్టుల్లో ధోని కెప్టెన్సీని నిశితంగా పరిశీలిస్తారు. తను చేసే ప్రతి బౌలింగ్ మార్పునూ, ప్రతి ఫీల్డ్ ప్లేస్మెంట్నూ భూతద్దంలోంచి చూస్తారు. ఇందులో ధోని ఏ మాత్రం విఫలమైనా... ఇక కోహ్లిని టెస్టు కె ప్టెన్ చేయాల్సిందేననే డిమాండ్‌కు ఎదురుండదు. ఆటలో సూపర్ హిట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి బ్యాటింగ్ అద్భుతం. ముఖ్యంగా ఆట చివరి రోజు చేసిన 141 పరుగులు తనలో బ్యాటింగ్ పరిణతిని చూపిస్తున్నాయి. వన్డే తరహాలో తనకే సాధ్యమైన షాట్లు ఆడుతూనే... సహనమూ చూపించాడు. ఫుట్‌వర్క్, షాట్ల ఎంపిక, బంతిని గ్యాప్స్‌లోకి ఆడిన తీరు చాలా బాగుంది. టెస్టు చివరి రోజు, మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఇలాంటి ఆట సాధారణంగా చూడలేం. నేను డిఫెన్స్ ఆడాలని అనుకుంటే... బంతి వేయడానికి ముందే బౌలర్‌కు అదనంగా బలాన్ని ఇచ్చినట్లే’ అనేది విరాట్ మాట. అంత ఆత్మవిశ్వాసం ఉంటే ఒక బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో ఏమైనా చేయగలడు అనిపించింది. ఆసక్తి పెరుగుతుంది ఆస్ట్రేలియాలో టెస్టు కోసం ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి టీవీలకు అతుక్కునే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌ల శకం ముగిశాక టెస్టు కోసం నిద్ర లేవడమా.. అనే అభిప్రాయం చాలామందిలో వచ్చింది. కానీ అది తప్పని కోహ్లి నిరూపించాడు. మళ్లీ మన జట్టు ఆడే మ్యాచ్‌ల కోసం నిద్ర లేవాల్సిన అవసరాన్ని చూపించాడు. భారత్‌కు టెస్టుల్లో కోహ్లిని పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించాల్సిన సమయం వచ్చింది. సారథిగా ధోని సమయం ఇక అయిపోయిందని అనుకోవాలి. అయితే కోహ్లి మైదానంలో కొంత సంయమనం పాటించాలి. నాలుగోరోజు ఆటలో తొలిసారి మాటల యుద్ధం మొదలైనప్పుడు పరిణతితో వ్యవహరించాడు. కానీ రెండోసారి అదుపుతప్పాడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కెప్టెన్‌కు చాలా అవసరం. సారథ్య బాధ్యతలు ఆట మీద ప్రభావం చూపబోవని కోహ్లి తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. కాబట్టి తనకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇచ్చే దిశగా భారత సెలక్టర్లు ఆలోచించాలి. -ఇయాన్ చాపెల్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్) తొలి టెస్టు చివరి రోజు విజయం కోసం ఆడినందుకు కోహ్లిని అభినందించాలి. ఆస్ట్రేలియా బౌలింగ్ బలం వల్ల మ్యాచ్ గెలిచింది. డ్రా కోసమే ఆడితే భారత్‌కు అనుకున్న ఫలితం వచ్చేది. కానీ విజయం కోసం ఆడటం గొప్ప విషయం. -అజహర్ -
సూపర్‌మ్యాన్.. సూపర్ వైరస్
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు తాజాగా సూపర్‌మ్యాన్, థోర్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లతో ఆన్లైన్ దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్ల పేర్లతో కూడిన హానికారక సాఫ్ట్వేర్లు, వైరస్‌లతో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తున్నారు. సెక్యూరిటీ సర్వీసులు అందించే మెకాఫీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ‘అత్యంత మోసకారి సూపర్‌హీరో’ అపఖ్యాతిని సూపర్‌మ్యాన్ దక్కించుకున్నాడు. సూపర్‌మ్యాన్ పేరుతో సెర్చి చేస్తే.. మోసాలు జరిగే ఆస్కారం ఉన్న సైట్లలోకి మళ్లే అవకాశాలు అత్యధికంగా 16.5 శాతం మేర ఉన్నాయి. ఉదాహరణకు సూపర్ మ్యాన్ .. టారెంట్ డౌన్లోడ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ వాచ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ ఫ్రీ యాప్ అని సెర్చి చేస్తే.. వ్యక్తిగత సమాచారం చోరీ చేసే విధంగా రూపొందిన సైట్లలోకి వెళ్లే రిస్కులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సైట్ల నుంచి పిక్చర్స్ లేదా వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటే వాటితో పాటు వైరస్లు, మాల్వేర్లు కూడా మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. తాజాగా బ్యాట్‌మ్యాన్ వర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సూపర్హీరోలిద్దరూ.. లిస్టులో టాప్ స్థాయికి చేరుకోవచ్చని మెకాఫీ పేర్కొంది. ఇటువంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే.. ఉచిత కంటెంట్‌ను, నమ్మశక్యం గాని విధంగా ఆఫర్లు ఇచ్చే వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండాలని తెలిపింది.