
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో మూవీస్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. తమ కున్న పవర్స్‌తో ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడుతుంటాఈ వీరు. అయితే ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలు కేవలం హాలీవుడ్ నుంచి మాత్రమే వచ్చాయి. అందులో ఎక్కువగా డీసీ, మార్వెల్ నిర్మాణ సంస్థల నుంచే వచ్చాయి.
ఇండియా సినీ పరిశ్రమల నుంచి ఇలాంటి సూపర్ హీరో మూవీస్ కొన్ని వచ్చాయి. అందులో కేవలం హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘క్రిష్’ మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా మలయాళం నుంచి అలాంటి మరో సూపర్ హీరో మూవీ రాబోతోంది. అదే ‘మిన్నల్ మురళి’. టోవినో థామస్ హీరోగా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌హీరో మూవీని సోఫియా పాల్ నిర్మిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదలైంది. డీసీ, ఎమ్‌సీయూ మూవీస్ నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా ఆకట్టకునేలా ఉంది. ఎటువంటి బాధ్యత లేని ఓ యువకుడిపై పిడుగు పడుతుంది. కానీ అతని ఏం కాకపోగా అద్భుత పవర్స్ వస్తాయి. వాటిని ఎలా ఉపయోగించాడు అనేదే కథ. ఈ సూపర్ హీరో ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
చదవండి: న్యూ అప్‌డేట్.. అక్టోబర్ 29న రెడీగా ఉండండంటూ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment