‘సూపర్‌ హీరో’ సిసోడియా.. విద్యాశాఖ ముసుగులో లిక్కర్‌ మంత్రి! | Arvind Kejriwal Tweets Manish Sisodia As Super Hero BJP Reacts | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్‌ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్‌

Published Mon, Oct 17 2022 12:19 PM | Last Updated on Mon, Oct 17 2022 12:19 PM

Arvind Kejriwal Tweets Manish Sisodia As Super Hero BJP Reacts - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణకు సోమవారం హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా. ఈ క్రమంలో ఆయనకు మద్దతు తెలుపుతూ సిసోడియాను సూపర్‌ హీరోగా గ్రాఫిక్‌ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఎలాంటి క్యాప్షన్‌ లేనప్పటికీ.. తాను చెప్పాలనుకున్న అంశాన్ని గ్రాఫిక్‌ చిత్రంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలో ‘ఢిల్లీ ఎడ్యుకేషనల్‌ మోడల్‌’ పేరుతో ఉన్న షీల్డ్‌ను పట్టుకున్నారు సిసోడియా. ఈడీ, సీబీఐ పేరుతో వచ్చే బాణాల నుంచి చదవుకుంటున్న ఓ చిన్నారిని రక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. 

మరోవైపు.. కేజ్రీవాల్‌ ట్వీట్‌పై అదే స్టైల్‌లో గ్రాఫిక్‌ చిత్రంతో విమర్శలు గుప్పించింది బీజేపీ. మద్యం బాటిళ్లు, నగదు కట్టలను కాపాడేందుకు సిసోడియా తెరిచిన పుస్తకాన్ని షీల్డ్‌లా పట్టుకున్నట్లు అందులో చూపించింది బీజేపీ. ఈ ఫోటోను ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు సునీల్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో కేజ్రీవాల్‌ సైతం ఓ చేతిలో మద్యం బాటిల్‌, మరో చేతిలో ఎన్నికల గుర్తు చీపురు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ‘విద్యాశాఖ ముసుగులో ఉన్న లిక్కర్‌ మంత్రి’ అంటూ రాసుకొచ్చారు సునీల్‌ యాదవ్‌.

ఇదీ చదవండి: తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement