ఇండియన్ స్క్రీన్పై మరో సూపర్ హీరో | ranabir kapoor doing a super hero character | Sakshi
Sakshi News home page

ఇండియన్ స్క్రీన్పై మరో సూపర్ హీరో

Published Sat, Sep 5 2015 9:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

ఇండియన్ స్క్రీన్పై మరో సూపర్ హీరో

ఇండియన్ స్క్రీన్పై మరో సూపర్ హీరో

క్రిష్, రావన్ లాంటి సినిమాలతో అతీంద్రియ శక్తులున్న మనుషులను భారతీయ ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు మన దర్శక నిర్మాతలు. హాలీవుడ్లో రెగ్యులర్గా వచ్చే సూపర్మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్ లాంటి సూపర్ హీరోలు ఇటీవల కాలంలో ఇండియన్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తున్నారు. భారీ మార్కెట్ స్టామినా ఉన్న స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ తో ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు మన మేకర్స్. అందుకే హృతిక్, షారూఖ్ లాంటి టాప్ స్టార్స్ సూపర్ హీరోలుగా మెప్పించారు.

త్వరలో మరో బాలీవుడ్ హీరో కూడా ఈ లిస్ట్లో చేరబోతున్నాడు. యంగ్ హీరో రణబీర్ కపూర్ లీడ్ రోల్లో ఓ సూపర్ హీరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు  డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ఈ సినిమాలో రణబీర్ను డ్రాగన్లా చూపించనున్నాడు. భారతీయ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించటానికి ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'హౌటు ట్రెయిన్ యువర్ డ్రాగన్' ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement