
హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి మిల్ గయా'. ఈ మూవీకి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం క్రిష్. ఈ మూవీలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన క్రిష్ -3లో హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించారు. అలా ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
అయితే ఈ సిరీస్‌లో క్రిష్-4 రానుందని చాలాకాలంగా బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారని టాక్ వినిపించింది. ఈ మూవీకి తాను డైరెక్షన్ చేయడం లేదని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
అయితే తాజాగా ఈ నిర్మాణ బాధ్యతల నుంచి సిద్ధార్థ్ ఆనంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.700 కోట్ల భారీ బడ్జెట్ కావడంతోనే సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచనలో పడ్డారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగారని సమాచారం. తాజా పరిణామాలు చూస్తే అతనితో పాటు కరణ్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ తప్పుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్-4 ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిద్ధార్థ్ ఆనంద్‌తో పాటు కరణ్ తప్పుకోవడంతో ఈ మూవీకి కొత్త దర్శకత్వంలో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొత్త టీమ్‌తో మళ్లీ బడ్జెట్‌ను అంచనా లు తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాకేష్ రోషన్ కూడా తాను దర్శకుడిగా చేయడం లేదని చెప్పడంతో మరో డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. కాగా.. క్రిష్, క్రిష్ -3 చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే క్రిష్-4 కూడా ఆయనే డైరెక్ట్ చేస్తాడని అభిమానులంతా భావించారు. కానీ తాజా ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం చేయడం లేదని చెప్పేశారు. ఈ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించనున్నట్లు వెల్లడించారుయ. అయితే ఇప్పుడు తాను డైరెక్ట్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. అందుకే దర్శకత్వం మార్పు అవసరమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment