Rakesh Roshan
-
కలిసిన కాసేపటికే కార్డు ఇచ్చి రమ్మన్నాడు.. చింపి పడేశా: తాజ్ మహల్ హీరోయిన్
తెలుగు సినిమా తాజ్ మహల్‌తో వెండితెరకు పరిచయమైంది మోనికా బేడీ. ఆ తర్వాత 1995లో వచ్చిన సురక్ష చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బీ టౌన్లోనే సెటిలైపోయిన మోనికా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'దర్శకుడు సుభాష్ ఘై హోలీ పార్టీలో రాకేశ్ రోషన్ నా దగ్గరకు వచ్చాడు. అతడు నటుడన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే అతడు యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు చూశాను. కానీ అతడు దర్శకుడు, నిర్మాత కూడా అన్న విషయం మాత్రం తెలియదు. అతడు కాసేపు మాట్లాడాక విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు ఒకసారి కలువు అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఇతడు నన్నెందుకు రమ్మంటున్నాడు అని అనుమానించి ఆ కార్డును ముక్కలు ముక్కలు చేసి పడేశాను. కొన్ని నెలల తర్వాత నా మేనేజర్.. ఎందుకు రాకేశ్‌ను కలవలేదు? అని అడిగాడు. అతడు కరణ్ అర్జున్ సినిమా తీస్తున్నాడు. ఇందులో నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. సల్మాన్ ఖాన్ సరసన మమత కులకర్ణి నటిస్తున్న రోల్ నువ్వు చేయాల్సింది అని చెప్పాడు. అప్పుడు కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. డైరెక్టర్, నటుడు మనోజ్ కుమార్ కూడా తన కొడుతో తీస్తున్న సినిమాకు నన్ను సంప్రదించాడు. నాకు చాలా సంతోషమేసింది. కానీ తన సినిమా పూర్తయ్యేవరకు మరే సినిమా చేయడానికి వీల్లేదని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. అసలు షూటింగే జరగలేదు. ఇది అతడి తప్పు కాదు. కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవంతే! అయితే ఈ అగ్రిమెంట్ వల్ల నేను ఏడాదిన్నరపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను. ఆ తర్వాత సినిమా అయ్యేలా లేదని గ్రహించిన మనోజ్ తన కాంట్రాక్ట్ నుంచి నాకు విముక్తి కల్పించాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మోనిక హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది. ఝలక్ దిక్లాజా మూడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. చదవండి: నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ.. ఆ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా? -
క్యాన్సర్‌ను జయించిన యోధుడు: హృతిక్
ముంబై: బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్ చేశారు. రాకేష్ రోషన్ 71వ పుట్టిన రోజు సందర్భంగా హృతిక్ స్పందిస్తూ తన తండ్రి జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడని, కెరీర్ ప్రారంభంలో పరిమితమైన విజయాలే లభించాయని తెలిపారు. ఆ తర్వాత భయానక క్యాన్సర్ (గొంతు) వ్యాధితో బాధపడ్డాడని, అయినా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా క్యాన్సర్‌ను జయించాడని తెలిపాడు. తన తండ్రి పోరాట యోధుడని కీర్తించాడు. అయితే గతంలో ఓ టివీ చానెల్లో రాకేష రోషన్ స్పందిసు కెరీర్ పరంగా 2017 సంవత్సరంలో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని అన్నారు. నటుడిగా అంత గుర్తింపు రాకున్నా సినిమా నిర్మాణ రంగం, దర్శకత్వ విభాగాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కాగా తన కలలను కొడుకు హృతిక్ రోషన్ నెరవేర్చాడని చాలా సందర్భంలో రాకేష్ తెలిపారు. అయితే 2006 సంవత్సరంలో తన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొందని కనీసం ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవని హృతిక్ గుర్తు చేసుకున్నాడు. (చదవండి: అల్లు అర్జున్, విజయ్ సీక్రెట్ తెలుసుకోవాలి: హృతిక్) -
జనవరిలో స్టార్ట్
ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఈ ఏడాది క్రిస్మస్ పండగకి హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ చిత్రం థియేటర్లోకి రావాల్సింది. కానీ ‘క్రిష్’ ఫ్రాంచైజీ దర్శకుడు రాకేశ్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి) క్యాన్సర్ బారిన పడి, కోలుకోవడానికి కొంత సమయం పట్టడంతో ‘క్రిష్ 4’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట రాకేశ్ రోషన్. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలీవుడ్ సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని టాక్. అప్పటికి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వస్తాయని, ఫారిన్ షూటింగ్స్‌కు పెద్ద సమస్యలు ఉండవని భావిస్తోందట చిత్రబృందం. -
‘ఆత్మలు డ్యాన్స్ చేయాల్సిందే’
హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసానే ఖాన్‌తో కలిసి తన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకి రోషన్లకు వివాహ వార్షిక శుభకాంక్షలు తెలిపుతున్న వీడియోను సోషల్ మీడియాలో గురువారం షేర్ చేశాడు. కాగా బుధవారం(ఏప్రీల్ 22) రాకేష్, పింకి రోషన్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హృతిక్ తన ఇద్దరూ కూమారులు, మాజీ భార్యతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మూడు వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘బయట ఉన్నప్పటీకీ, క్వారంటైన్లో ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మన ఆత్మలు డ్యాన్స్ చేయాల్సిందే..! హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్పా, లవ్ యూ’ అనే క్యాప్షన్‌కు ‘‘ఫ్యామిలీ స్పీరిట్’’ అనే హ్యాష్ ట్యాగ్‌కు జత చేసి షేర్ చేశాడు. (వైరస్ భయపడుతుంది!) View this post on Instagram The spirit must dance whether outdoors or quarantined indoors !. . Happy anniversary mama and papa. Love you ! 22nd April 2020 #familyspirit #bethereforeachother #naturalhairnotwigs #49years @rakesh_roshan9 @pinkieroshan A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Apr 23, 2020 at 3:48am PDT కాగా ఓ వీడియోలో హృతిక్ పియానో వాయిస్తుంటే తన ఇద్దరూ కూమారులు హ్రేహాన్, హ్రిధాన్లతో పాటు మాజీ భార్య సుసానే శుభాకాంక్షలు తెలుపుతూ పాట పాడుతున్నారు. కాగా మరో వీడియోలో హృతిక్ తల్లిదండ్రులు రాకేష్, పింకి రోషన్లు కేక్ కట్ చేస్తుంటే కుటుంబ సభ్యులంతా వీడియో కాల్లో శుభకాంక్షలు తెలుపుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చిన్నప్పటీ నుంచి మంచి స్నేహితులైన హృతిక్, సుసానేలు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. కాగా ఓ స్టార్ హీరోయిన్ వల్ల వీరీ వివాహ బంధంలో కలతలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో వారిద్దరు 2014లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉంటున్న ఈ మాజీ దంపతులు లాక్డౌన్లో ఒకే ఇంట్లో తమ ఇద్దరూ కుమారులతో కలిసి క్వారంటైన్లో ఉండటం గమనార్హం. (కరోనా: స్టార్ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య) -
వైరస్ భయపడుతుంది!
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత, నటుడు రాకేష్ రోషన్) ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. 71 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ రెండు గంటలు వ్యాయామం చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి ధృడసంకల్పం మనందరికీ ఈ సమయంలో ఉండాలి’’ అంటున్నారు హృతిక్ రోషన్. లాక్డౌన్ నేçపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ ఖాళీ సమయంలో తండ్రి వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు హృతిక్. ‘‘గత ఏడాదే మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఈ వయసులోనూ క్రమశిక్షణగా వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్న పట్టుదలను చూసి వైరస్ కూడా భయపడుతుందనిపిస్తోంది’’ అని షేర్ చేసిన వీడియోకు కామెంట్ జోడించారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ పూర్తయ్యాక 1980లో వచ్చిన హిందీ చిత్రం ‘ది బర్నింగ్ ట్రైన్’ రీమేక్‌లోను, 1982లో వచ్చిన ‘సత్తే పే సత్తా’ రీమేక్‌లోనూ హృతిక్ నటించే అవకాశాలు ఉన్నాయట. -
‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడిన విషయం విదితమే. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారితో ఎలా పోరాడారో, దానిని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు. ‘ఇదంతా ఎలా జరిగిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. నొప్పి లేదు, దురద లేదు.. ఇది చాలా చిన్న విషయం అనుకున్నాను. ఓ రోజు ముంబైలోని హిందూజ హాస్పిటల్‌కు నా స్నేహితుడిని కలవడానికి వెళ్లినప్పుడు.. తనతో మాట్లాడుకుంటూ అక్కడి ఆవరణంలో నడుస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఈఎన్టీ సర్జన్ బోర్డు చూసి డాక్టర్ క్యాబిన్‌కు వెళ్లాను. ఆ డాక్టర్ నన్ను పరీక్షించి ‘బయాప్సీ’ పరీక్ష చేయించుకొమని సలహా ఇచ్చారు. డాక్టర్ ఎందుకు ఆ పరీక్ష చేయించుకొమ్మన్నారో నాకు తెలియదు కానీ.. నేను కాన్సర్ బారిన పడిన సంగతి నాకు కొంత అర్ధమైంది. ఆ తర్వాత నేను హృతిక్ రోషన్(నా తనయుడు) వద్ద ఉన్న సమయంలో(15 డిసెంబర్2018 ) రోజున పరీక్షలో బయాప్పీ పాజిటివ్ వచ్చిందని ఫోన్ వచ్చింది’ అని పేర్కొన్నారు. View this post on Instagram I have always been a student of Life. The burning desire in me to learn, is as blazing as a toddler. But before I could understand and interpret my many life lessons, it was my Father who taught me. Thank you Papa, for teaching me things that no education institution, no acting classes, no book could. for making me understand and not only see, for pushing me to think before I act. You make me be a better human, father, son, actor and friend. Thank you for being an example, it is upto you I look, when my children look for their dad. Happy Teacher's day A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Sep 5, 2019 at 7:30am PDT అలాగే తన కుటుంబం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ఈ విషయం వారిని కదిలించలేదని రాకేష్ రోషన్ పేర్కొన్నారు. కాగా ‘కాన్సర్ చికత్సలో భాగంగా నా నాలుకను కత్తిరించాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పినప్పుడు నేను కాస్త భయపడి మొదట నిరాకరించాను. ఆ తర్వాత కాన్సర్ కణాలు ఉన్న నా నాలుక భాగాన్ని కత్తిరించారు. ఆ తర్వాత మూడు నెలల పాటు నీళ్లు, టీ, కాఫీలాంటివి తాగలేక పోయాను. కొన్నిసార్లు నాలుకలోని రుచి కణాలు కూడా సరిగా పని చేయక వివిధ రుచులను ఇచ్చేవి. ఈ మూడు నెలల్లో నేను దాదాపు 10 కిలోల బరువు తగ్గాను, అయితే మళ్లీ 3 కేజీ బరువు పెరిగాను. ఇప్పుడు రోజు 90 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నా. పూర్తి ఆరోగ్యవంతంగా మారటానికి మరో ఆరు నెలల సమయం పడుతుందేమో’ అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram #personalised napkins too#love from your children is irreplaceable #glimpse of my surprise#liveyourbestlife # A post shared by Pinkie Roshan (@pinkieroshan) on Oct 22, 2019 at 1:20pm PDT -
సినిమాల్లోకి స్టార్ హీరో సోదరి ఎంట్రీ!
ముంబై : బాలీవుడ్లో మరో వారసురాలికి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. స్టార్ హీరో హృతిక్ రోషన్ చెల్లెలు పశ్మినా రోషన్ సినిమాల్లో ప్రవేశించనున్నారు. రాజేశ్ రోషన్ కుమార్తె అయిన పశ్మిన్ను హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ తన నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్ బ్యాగ్రౌండ్ ఉన్న పశ్మీనా ఓ ప్రముఖ యాక్టింగ్ స్కూళ్లో శిక్షణ తీసుకుందని... 2020వ సంవత్సరంలో ఆమె బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని బీ- టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా హృతిక్ కూడా తన చెల్లెలు సినిమాల్లోకి రావడం పట్ల సంతోషంగా ఉన్నట్లు రోషన్ కుటుంబ సన్నిహిత వర్గాలు ముంబై మిర్రర్‌కు తెలిపాయి. అంతేగాకుండా ఇప్పటి నుంచే ఎటువంటి కథలు ఎంపిక చేసుకోవాలన్న అంశంపై ఆమెకు సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా చైల్్డ ఆర్టిస్టుగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హృతిక్... కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. క్రిష్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న.. హృతిక్ బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా పేరొందాడు. హృతిక్ నటించిన ‘వార్’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ స్విచ్చాఫ్.. దేవుడా ఆమెను ఏమైనా చేశారా?
ముంబై: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సోదరి సునయన వ్యవహారంలో నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించినందుకు తనను తండ్రి రాకేశ్ రోషన్, సోదరుడు హృతిక్ రోషన్ హింసిస్తూ కొడుతున్నారని సునయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా రంగోలీ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం సునయన ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని రంగోలీ తన ట్వీట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడా.. ఆమెకు వాళ్లు (రాకేశ్, హృతిక్) ఏదైనా కీడు తలపెట్టారా? ఏమైనా చేశారా? ఆమె గురించి తలుచుకుంటే చాలా భయంగా ఉంది’ అని రంగోలీ పేర్కొన్నారు. (చదవండి: మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హృతిక్ సోదరి) తన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే.. సునయన పోలీసులను ఆశ్రయించాలి? కానీ, ఇలా సొంత కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయవద్దంటూ సినీ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కదేల్ వ్యాఖ్యానించగా.. దీనికి స్పందనగా ఆమె ఈమేరకు ట్వీట్లు చేశారు. సునయన కుటుంబసభ్యుల మీద ఆధారపడుతూ.. వారి ఇంట్లో ఉందని, వారికి వ్యతిరేకంగా పోలీసులను ఆశ్రయించడం అంత సులభం కాదని, పైగా పోలీసులతో రాకేశ్ రోషన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కంగనా వారిని సమర్థంగా ఎదుర్కోగలిగింది కానీ, 16 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకొని.. పెద్దగా చదువుకోకుండా కుటుంబసభ్యుల మీద ఆధారపడిన సునయన వారిని ఎదుర్కోలేదని రంగోలి పేర్కొన్నారు. సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ రంగోలి ఇంతకుముందు కూడా వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన సునయన.. ‘ ఎప్పటిలాగానే నరకంలో జీవిస్తున్నా. రంగోలి ట్వీట్లు చదివాను. ఆమె చెప్పినవన్నీ నిజాలే. తన ద్వారానైనా నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. నేను ఈరోజు కంగనా, రంగోలీలను కలుస్తున్నాను. వారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. తన ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు అని కుటుంబ సభ్యులపై సునయన సంచలన ఆరోపణలు చేశారు. కాగా గతంలో హృతిక్- కంగనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో సునయన కంగనాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. -
మా ఇల్లు ఒక నరకం: హీరో సోదరి
బాలీవుడ్ దర్శక, నిర్మాత రాకేష్ రోషన్ ముద్దుల తనయ, హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన అనారోగ్యంతో బాధ పడుతున్నారంటూ బీ-టౌన్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె బైపోలార్ డిజార్డర్‌తో బాధ పడుతున్నారని, అందుకోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనేది వాటి సారాంశం. అయితే ఇవన్నీ గాలి వార్తలేనని కొట్టిపారేశారు సునయన. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం స్నేహితులతో కలిసి గోల్ఫ్ క్లబ్లో ఎంజాయ్ చేస్తున్నాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన పెంపుడు కుక్కతో సరదాగా గడుపుతున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘ ఇప్పుడు చెప్పండి నిజంగా అనారోగ్యంగా కనిపిస్తున్నానా అంటూ క్యాప్షన్ జతచేశారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. తన తండ్రి ఇంట్లో ఉండటం నరకంలా ఉంటుందంటూ సునయన చేసిన వ్యాఖ్యలు రోషన్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. గత 20 రోజులుగా ఓ హోటల్లో బస చేస్తున్న సునయన.. ఇందుకు గల కారణాల గురించి చెబుతూ..‘ వాళ్ల(తల్లిదండ్రులు రాకేష్-పింకీ రోషన్) ఇంట్లోకి వెళ్లేందుకు నాకోసం ప్రత్యేక ద్వారం ఉంటుంది. అదొక నరకం. అవును మా ఇంట్లో కొన్ని చికాకులు ఉన్నాయి. కానీ వాటి గురించి నన్నేం అడగొద్దు. నా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం నాకిష్టం లేదు’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. దీంతో అసలు విషయం ఏమై ఉంటుందా అంటూ హృతిక్ ఫ్యాన్స్ ఆరా తీసే పనిలో పడ్డారు. Do I look critically ill ..... pic.twitter.com/zI1kJJQsMy — Sunaina Roshan (@sunainaRoshan22) June 10, 2019 -
బాగానే ఉన్నాను
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న దర్శక–నిర్మాత రాకేశ్ రోషన్ మంగళవారం దానికి సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ సక్రమంగానే జరిగినట్టు రాకేశ్ రోషన్ టీమ్ పేర్కొంది. ‘‘ఆపరేషన్ బాగా జరిగింది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. దేవుడున్నాడు. శుక్రవారం లేదా శనివారం ఇంటికి కూడా వెళ్లిపోతాను’’ అని రాకేశ్ పేర్కొన్నారు. -
హృతిక్ రోషన్‌కు ప్రధాని మోదీ ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ (69) కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు. రాకేష్‌ను ఆయన ‘ఫైటర్’గా అభివర్ణించారు. ‘రాకేష్ జీ ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఈ చాలెంజ్‌ను ధీటుగా ఎదుర్కొంటారు’ అని మోదీ హృతిక్‌కి ట్వీట్ చేశారు. కాగా, రాకేష్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే గొంతు క్యాన్సర్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నాన్నకు క్యాన్సర్ ప్రారంభ స్థాయిలోనే ఉందన్నారు హృతిక్. తన తండ్రి కోలుకోవాలని విష్ చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని రీట్వీట్ చేశారు. (గెట్ వెల్ సూన్) ‘నాకు తెలిసినంత వరకు మా నాన్నే స్ట్రాంగ్ మ్యాన్. ఆపరేషన్ జరిగే రోజుకూడా ఆయన జిమ్ చేశారు’ అని చెప్పుకొచ్చారు హృతిక్. ఆయన క్యాన్సర్‌ను జయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రితో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఇదిలాఉండగా.. నటుడు, నిర్మాత, దర్శకుడైన రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ హీరోగా కహోనా ప్యార్ హై, కోయి మిల్ గయా, క్రిష్, కాబిల్ చిత్రాలను నిర్మించారు. క్రిష్ సిరీస్‌లో భాగంగా క్రిష్ 4, క్రిష్ 5 చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. Dear Hrithik, praying for the good health of Shri Rakesh Roshan Ji. He is a fighter and I am sure he will face this challenge with utmost courage. @RakeshRoshan_N https://t.co/Z0IaYSS4A4 — Narendra Modi (@narendramodi) January 8, 2019 Thank you Sir for your concern and good wishes. I am very happy to inform that according to the doctors his surgery has gone off well. 🙏🏻 https://t.co/BS42lCy0Kn — Hrithik Roshan (@iHrithik) January 8, 2019 -
గెట్ వెల్ సూన్
తండ్రి రాకేశ్ రోషన్ (బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత) గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు హీరో హృతిక్ రోషన్ మంగళవారం తెలిపారు. ‘‘మంగళవారం ఉదయం నాన్నగారిని నాతో ఫొటో దిగమని అడిగాను. ఆపరేషన్ రోజు కూడా వర్కౌట్స్ చేయడానికి ఆయన జిమ్‌కు వచ్చారు. నాకు తెలిసిన స్ట్రాంగ్ పర్సన్ మా నాన్నగారు. తొలి దశలో ఉన్న గొంతు క్యాన్సర్‌తో ఆయన కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. మా కుటుంబంలో ఆయనలాంటి లీడర్ ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. లవ్ యు డాడీ’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు రాకేశ్ రోషన్ అభిమానులు ‘‘గెట్ వెల్ సూన్’’ అని స్పందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘క్రిష్’ ఫ్రాంచైజీలో హృతిక్ హీరోగా రాకేశ్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి.. రాకేశ్ కోలుకున్న తర్వాత ఈ సినిమా ఆరంభిస్తారా లేక వేరే దర్శకుడితో మొదలుపెడతారా? అన్నది చూడాలి. -
బాలీవుడ్‌కు మరో షాక్.. స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం తండ్రి రాకేష్ రోషన్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన హృతిక్ తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వెల్లడించారు. ఇటీవల బాలీవుడ్ సినీ ప్రముఖులు క్యాన్సర్ బారిన పడినట్టుగా వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బ్రిందేల ఆరోగ్యానికి సంబంధించిన వార్తల నుంచి తెరుకోక ముందే రాకేష్ రోషన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలియటంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ రోజు రాకేష్ రోషన్‌కు సర్జరీ జరగనుందని వెల్లడించాడు హృతిక్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన రాకేష్ రోషన్ తరువాత హృతిక్‌ను స్టార్ హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం హృతిక్ హీరోగా క్రిష్ 4, క్రిష్ 5 చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు రాకేష్. View this post on Instagram Asked my dad for a picture this morning. Knew he wouldnt miss gym on surgery day. He is probably the strongest man I know. Got diagnosed with early stage squamous cell carcinoma of the throat a few weeks ago, but he is in full spirits today as he proceeds to battle it. As a family we are fortunate and blessed to have a leader like him. . Love you Dad. A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Jan 7, 2019 at 7:46pm PST -
అంతకు మించి
ఇండియన్ సూపర్ హీరో ‘క్రిష్’ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేశాడు. అందుకే వరుసగా సీక్వెల్స్ రూపొందిస్తున్నారు దర్శక–నిర్మాత రాకేష్ రోషన్. ఆల్రెడీ ‘క్రిష్ 4’ని 2020 క్రిస్మస్ స్పెషల్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు హృతిక్ బర్త్ డే (జనవరి 10) రోజున అనౌన్స్ చేశారు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. ఇప్పుడు ‘క్రిష్ 5’ కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ టాక్. క్రిష్ 4, 5 సినిమాలను ఒకేసారి షూట్ చేసి, ఎడిట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట చిత్రబృందం. ఈ రెండు సీక్వెల్స్‌కు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారట. గత పార్ట్స్‌ని మించి గ్రాండ్ విజువల్స్‌తో భారీగా ఉంటాయని సమాచారం. గత సినిమాల్లో ప్రీతీ జింటా, ప్రియాంకా చోప్రా హీరోయిన్లుగా కనిపించారు. ఈ కొత్త సీక్వెల్స్‌లో కొత్త కాంబినేషన్ సెట్ అవ్వొచ్చట. మరి.. ఈ సూపర్ హీరోని మళ్లీ స్క్రీన్ మీద చూడాలంటే మరో రెండు మూడేళ్లు వేచి చూడక తప్పదు. అన్నట్లు ఒకేసారి షూట్ చేయబోతున్నారు కాబట్టి ఒకేసారి రిలీజ్ చేస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది జరగనే జరగదు. ముందు ఫోర్త్ పార్ట్ రిలీజ్ చేస్తారు. ఫిఫ్త్ పార్ట్ టెక్నికల్‌గా ఇంకా భారీగా ఉండటంతో ముందు షూట్ చేయాలనుకున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పడుతుందని సమాచారం. -
క్రిష్-4: తండ్రితో హృతిక్ విభేదాలు!
హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'క్రిష్'కి అభిమానులు కాని వారుండరు. 2006లో వచ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజయం సాధించింది. తరువాత వచ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజయమే సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో భాగం వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత చిత్రాల కంటే భారీగా ‘క్రిష్ 4′ ను రూపొందించాలన్నది హృతిక్ ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ భారీ ఎత్తున ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో తండ్రి రాకేశ్ రోషన్ సలహాను హృతిక్ పాటించడం లేదట. ఈ సినిమాకి సంబంధించి హృతిక్‌కి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఏఏ ఆర్టిస్టులను తీసుకోవాలి. ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడాలని అనే విషయాలను హృతిక్యే చూసుకుంటున్నాడట. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్ సినిమాలో పెట్టాలనే అంశాన్ని కూడా అతనే చూసుకుంటున్నాడట. తండ్రి రాకేశ్ రోషన్ కంటే హృతిక్ కే నేటితరం ప్రేక్షకులపై మంచి అవగాహన ఉంది. ఎలాంటి గ్రాఫిక్స్ సన్నివేశాలయితే ప్రేక్షకులకు నచ్చుతాయో హృతిక్ బాగా తెలుసు. అందుకే సినిమా సంబంధించిన విషయాల్లో తండ్రి మాట వినడం లేదని బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఏదేమైనా భారీ హంగులతో 2020లో క్రిష్-4 సినిమాను విడుదల చేయాలని తండ్రీ-కొడుకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
పాక్‌లో నిషేధం అనంతరం.. తొలి సినిమా ఇదే!
ముంబై: ఎట్టకేలకు పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలు విడదల కాబోతున్నాయి. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ’కాబిల్’ సినిమాతో ఇది ప్రారంభం కాబోతున్నది. చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ ఈ విషయాన్ని మంగళవారం ట్విట్టర్లో ప్రకటించాడు. ’అవును. ఇది నిజమే. కాబిల్ సినిమా కరాచీలో ఈ రోజు రాత్రి 11 షో ప్రదర్శితం కానుంది. రేపటినుంచి పాకిస్థాన్ అంతటా ఈ సినిమా ప్రదర్శితంకానుంది’ అని రోషన్ ప్రకటించారు. దేశంలో కాబిల్ సినిమా విడుదలలో పారదర్శకత పాటించలేదని, తన సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వలేదని రాకేష్ రోషన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిషేధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాల విడుదలపై పాక్‌లో నిషేధం విధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలపై తాజాగా నిషేధాన్ని ఎత్తివేశారు. బ్యాన్ ఎత్తివేసిన తర్వాత పాకిస్థాన్‌లో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమాగా ’కాబిల్’ నిలిచింది. -
ఆ హీరో.. నన్ను దారుణంగా మోసగించాడు: నిర్మాత
50-50శాతం థియేటర్లు ఇవ్వలేదు నాకు 150 కోట్ల నష్టం రావొచ్చు షారుఖ్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 'రాయిస్' సినిమాపై హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేష్ రోషన్ బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. అందుకు కారణం లేకపోలేదు. హృతిక్ హీరోగా తెరకెక్కిన 'కాబిల్' సినిమాను ఈ రోజున (జనవరి 25న) విడుదల చేస్తామని ఎంతో ముందుగానే రాకేశ్ ప్రకటించారు. ఆ తర్వాత పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన షారుఖ్ 'రాయిస్' కూడా బుధవారమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించింది. దీంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద టైటానిక్ క్లాష్ తప్పలేదు. షారుఖ్ తన సినిమా విడుదల తేదీని మార్చుకుంటారని అంతా భావించారు. షారుక్ దిగిరాలేదు. హృతిక్యే పెద్ద మనస్సు చేసుకొని.. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైనా తమ మధ్య విభేదాలు రాకుండా చూస్తామని చెప్పాడు. దీంతో రెండు సినిమాలకు దేశంలోని థియేటర్లను 50:50శాతం పంచుకోవాలని మొదట భావించారు. కానీ, చివరి నిమిషంలో రాకేష్ రోషన్‌కు షాక్ ఇస్తూ 'రాయిస్'కు అనుకూలంగా 60:40 శాతం థియేటర్లను పంచారు. దీంతో బిత్తరపోయిన రాకేష్ తన సినిమాను షారుఖ్ మోసం చేశారని వాపోతున్నారు. 'నేను వేరేవాళ్ల సినిమా గురించి మాట్లాడాను. నా సినిమా కాబిల్ గురించే మాట్లాడుతాను. సినిమా విడుదల విషయంలో మేం షాక్‌కు గురయ్యాం. బాధపడ్డాం. నిరాశ చెందాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. గతవారం ఎగ్జిబిటర్లందరితోనూ మాట్లాడి వారికి గంట సినిమా కూడా చూపించాం. 50-50శాతం థియేటర్లు ఇవ్వాలని కోరాం. అందుకు వారు ఒప్పుకొన్నారు కూడా. దుబాయ్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఇలా ప్రపంచమంతటా 50-50 షేర్‌కు అంగీకారం కుదిరింది. కానీ ఆ తర్వాత వారు చేసింది మమ్మల్ని బాధించింది. మేం మోసపోయామనిపించింది. ఇలా చేయడం సరికాదు. రెండు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు 50-50 థియేటర్ల పంపకాలు ఉండాలని నిర్మాతలంతా కోరుకుంటారు' అని పేర్కొన్నారు. దర్శకుడు, నిర్మాత అయిన రాకేశ్ రోషన్ 90వ దశకంలో షారుఖ్‌కు ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'కరణ్ అర్జున్' సినిమాను కూడా ఆయనే తీశారు. థియేటర్లను 60-40 శాతం పంపకాలు చేయడం వల్ల తనకు నేరుగా 150 కోట్ల నష్టం వస్తుందని, ఒకేసారి రెండు సినిమాలు చూసేంత డబ్బు ప్రజల వద్ద ఉండదని, కాబట్టి థియేటర్ల పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల తన సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా దేవుడు తనకు అండగా ఉన్నాడని, తనకేమీ కాదని అన్నారు. షారుఖ్ తీరుపై ఆయన పరోక్షంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ కాబిల్. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హృతిక్ అంధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మీద వివాదం మొదలైంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాబిల్ కాపీ కంటెంట్ అంటూ ఆరోపిస్తోంది. మార్వెల్ కామిక్ క్యారెక్టర్ అయిన డేర్ డేవిల్ ను కాబిల్ సినిమా కోసం కాపీ కొట్టారంటోంది. కలర్ స్కీమ్స్ తో పాటు యాక్షన్స్ సీన్స్ డేర్ డెవిల్ తరహాలోనే ఉన్నాయని.. అందుకే చిత్ర నిర్మాత రాకేష్ రోషన్, దర్శకుడు సంజయ్ గుప్తా, హీరో హృతిక్ రోషన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే తమ సినిమా ఏ సినిమాకు కాపీ కాదని వాదిస్తోంది కాబిల్ టీం. -
ఆ హీరోకు తండ్రి వత్తాసు ఎందుకు?
కంగనా రనౌత్ సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతోంది. మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్తోంది. తాజాగా రచయిత చేతన్ భగత్ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కంగనా.. హృతిక్ రోషన్‌తో వివాదం విషయంలో సూటిగా స్పందించింది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఇటీవల ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ హృతిక్-కంగన వివాదంపై స్పందించారు. తన కొడుకు గురించి కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నా.. అతను మాత్రం మౌనంగా ఉన్నాడని, హృతిక్ వాస్తవాలు మాట్లాడితే.. అవి అందరినీ షాక్‌కు గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. రాకేష్ వ్యాఖ్యలపై విలేకరులు అడుగగా కంగన ఘాటుగా స్పందించింది. ‘భారతీయ పురుషులు ఎందుకు తమ కాళ్ల మీద నిలబడరు? 43 ఏళ్ల వయస్సు వచ్చిన కొడుకుని తండ్రి రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంతకాలం వాళ్లు తమ తండ్రుల పేరుప్రఖ్యాతల వెనుక దాక్కుంటారు? అతను పెద్దవాడు. సినీ ప్రపంచంలో వచ్చే వివాదాలను అతను ఎదుర్కోగలడు. ఇది చిన్న వివాదం. ఇందులో కొడుకులను తండ్రులు రక్షించాల్సినంతగా ఏముంది? నాకు అర్థం కావడం లేదు’ అని కంగన పేర్కొంది. ‘సిల్లీ ఎక్స్’ అని హృతిక్‌ను ఉద్దేశించి కంగన పేర్కొనడంతో వీరిద్దరి మధ్య గత జనవరి వివాదం మొదలైన సంగతి తెలిసిందే. -
ఆ నిజం తెలిస్తే షాకవుతారు!
బాలీవుడ్లో ఈ ఏడాది ప్రారంభంలో హృతిక్ రోషన్ - కంగనా రనౌత్‌ల మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో బురద చల్లుకున్నారు. తమ మధ్య 2010 సంవత్సరంలో కైట్స్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ మొదలైందని కంగనా చెబుతుంటే.. హృతిక్ మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు. అయితే.. ఈ విషయంలో ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. అలాంటిది ఆయన కూడా దీనిపై ఇప్పుడు నోరు విప్పారు. హృతిక్ రోషన్ నిజం చెబితే ప్రతి ఒక్కరూ షాకవుతారని ఆయన అన్నారు. హృతిక్ చాలా విభిన్నంగా ఉంటాడని.. అతడి గురించి ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నా కూడా అతడు చాలా కామ్‌గా విని ఊరుకుంటాడు తప్ప అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టడని ఆయన చెప్పారు. అతడు గనక నిజం ఏంటో బయటపెడితే అంతా షాకవుతారని తెలిపారు. అయితే దాని గురించి చెప్పాలా.. వద్దా అన్నది మాత్రం పూర్తిగా హృతిక్ ఇష్టానికే వదిలిపెడుతున్నానన్నారు. ప్రస్తుతానికి హృతిక్ తన సినిమాతో బిజీగా ఉన్నాడని, దాన్నుంచి కాస్త విరామం దొరికితే ఈ విషయం మీద మాట్లాడే అవకాశం ఉందని అన్నారు. ఏం చేయాలన్నది అతడి ఇష్టమని చెప్పారు. రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కాబిల్ అనే సినిమా షూటింగులో హృతిక్ పూర్తి బిజీగా ఉన్నాడు. త్వరలోనే క్రిష్ 4 కూడా తీస్తానని రాకేష్ తెలిపారు. హృతిక్ హీరోగా ఉండే ఈ సినిమా 2018లో విడుదల అవుతుంది. -
ఆ హీరోయిన్ గురించి చెబితే షాకవుతారు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో హీరోయిన్లు హృతిక్ రోషన్, కంగనా రౌత్ వివాదంపై హృతిక్ తండ్రి స్పందించాడు. కంగనా పేరు ప్రస్తావించకుండా రాకేష్ రోషన్ ఘాటైన విమర్శలు చేశాడు. హృతిక్ విభిన్నమైన వ్యక్తని, ఒకరు (కంగనా) అతని గురించి అబద్ధాలు ప్రచారం చేసిందని, అయినా హుందాగా మౌనం పాటించాడని చెప్పాడు. హృతిక్ నిజం ఏంటన్నది బయటకు చెబితే ప్రతి ఒక్కరూ షాకవుతారని రాకేష్ అన్నాడు. హృతిక్ సినిమా షూటింగ్‌తో తీరికలేకుండా ఉన్నాడని, విరామం లభిస్తే ఈ విషయంపై స్పందిస్తాడని రాకేష్ చెప్పాడు. కాగా వాస్తవం ఏంటన్నది చెప్పాలా వద్దా అన్నది అతని ఇష్టమని అన్నాడు. గతేడాది హృతిక్-కంగనా వివాదం బాలీవుడ్లో సంచలనం కలిగించింది. మాజీ ప్రేమికులైన ఈ ఇద్దరూ విబేధాలతో తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరూ కోర్టుకు వెళ్లి లీగల్ నోటీసులు పంపారు. -
ప్రముఖ దర్శకనిర్మాత అరెస్టుపై హైకోర్టు స్టే
బాలీవుడ్ దర్శక నిర్మాత, ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ అరెస్టుపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే మంజూరుచేసింది. సెప్టెంబర్ 19 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. తాను రాసిన నవలలోని కొన్ని భాగాలను క్రిష్-3 సినిమా కోసం వాడేసుకుని కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ డెహ్రాడూన్‌కు చెందిన రూప్ కుమార్ శంకర్ అనే రచయిత ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని రాకేష్ రోషన్ కోర్టును కోరారు. అయితే, అందుకు నిరాకరించిన జస్టిస్ యూసీ ధ్యానీ.. సెప్టెంబర్ 19 వరకు రాకేష్ రోషన్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆయనను అరెస్టు చేయాలా.. వద్దా అనే విషయంలో ఆరోజున కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే క్రిష్ 3 స్క్రిప్టు పూర్తిగా తన సొంతమని, దాన్ని ఎక్కడి నుంచి కాపీ చేయలేదని రోషన్ అంటున్నారు. -
హీరో తండ్రిపై పోలీసు కేసు
ముంబై: 'క్రిష్ 3' సినిమా కథను తన నవల నుంచి దొంగిలించారని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ పై నవలా రచయిత రూప్ నారాయణ్ సొంకర్ ఆరోపణలు చేశారు. కాపీ రైట్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'క్రిష్ 3' సినిమా కథను తాను రాసిన 'సార్దాన్' నవల నుంచి తస్కరించారని ఆరోపించారు. తన నవల కాపీని కూడా పోలీసులకు అందజేశారు. నారాయణ్ ఫిర్యాదు మేరకు రాకేశ్ రోషన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నవలను 2010లో రాశానని దీని ఆధారంగానే 2013లో 'క్రిష్ 3' సినిమా తీశారని తెలిపారు. నారాయణ్ ఆరోపణలపై స్పందించేందుకు రాకేశ్ రోషన్ నిరాకరించారు. ఈ వ్యవహారం పోలీసుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడబోనని అన్నారు. నారాయణ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టామని, ఆరోపణలు నిజమని తేలితే తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. 2013, నవంబర్ 1న విడుదలైన 'క్రిష్ 3' సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన హృతిక్ రోషన్, కంగనా రౌనత్ మధ్య కూడా న్యాయవివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. -
50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత అయిన రాకేష్ రోషన్, సుదాంన్షు పాండే అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినందుకుగాను రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ అతడిపై కోర్టులో పరువు నష్టం కింద వేయనున్నారు. కాగా తన రాసుకున్న కథను రాకేష్ రోషన్ చోరీ చేసాడంటూ గతంలో సుదాంన్షు పాండే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ మోడల్, నటుడు అయిన సుదాంన్షు పాండే.. రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు తన ఫర్మాయిష్ సినిమా కథను దొంగిలించి, అదే కథతో హృతిక్ రోషన్ హీరోగా కాబిల్ పేరుతో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయమై రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాను విచారించిన పోలీసులు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దీంతో సుదాంన్షు పాండే ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణ మూలంగా తనకు జరిగిన వ్యక్తిగత నష్టానికి, 50 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రాకేష్ రోషన్ కోర్టు ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు. -
హృతిక్ సినిమాకు లీగల్ ప్రాబ్లమ్
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తదుపరి సినిమా, సెట్స్ మీదకు వెళ్లక ముందే వివాదాలకు తెర తీసింది. ప్రస్తుతం పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మొహంజొదారో' సినిమాలోనటిస్తున్న హృతిక్, ఆ సినిమా తరువాత తన తండ్రి నిర్మాణంలో సంజయ్ గుప్తా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించి ఏకధాటిగా జరిగే నాలుగు నెలల షూటింగ్లో పూర్తి చేయాలని భావించారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే సమస్యలు మొదలయ్యాయి. యాక్టర్, మోడల్ అయిన సుధాన్షు పాండే, తన కథ, కథనం, మాటలను పర్మిషన్ లేకుండా దర్శకుడు సంజయ్ గుప్తా వాడుకుంటున్నారని, వాటితో హృతిక్ హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నారంటూ కేసు వేశాడు. తాను రెండున్నర ఏళ్ల పాటు కష్టపడి ఫర్మాయిష్ పేరుతో రాసుకున్న ఈ కథ తో తాను తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్టు వివరించాడు. మరి ఈ వివాదం పై హృతిక్, రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు ఎలా స్పందిస్తారో చూడాలి.