బాలీవుడ్ స్టార్ పెయిర్ హృతిక్ రోషన్, కరీనా కపూర్ చాలా కాలం తరువాత మరోసారి కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మరోసారి వెండితెర మీద సందడి చేయనుంది. 2001లో విడుదలైన యాదే', 2003లో రిలీజ్ అయిన 'మై ప్రేమ్ కీ దివానీ హూ' సినిమాల్లో హృతిక్, కరీనా కలిసి నటించారు.
హృతిక్ రోషన్ ప్రస్తుతం అశుతోష్ గోవ్రికర్ దర్శకత్వంలో 'మొహంజొదారో' పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం నిజమైన పులులు, మొసళ్లతో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే సంజయ్ గుప్తా దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.
హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్కు జోడిగా కరీనా నటించనుంది. రివెంజ్ డ్రామాతో కూడిన ప్రేమకథగా ఈ సినిమాను రూపొదిస్తున్నారు. మొహంజొదారో షూటింగ్ పూర్తి కాగానే సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్, కరీనాలు జంటగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.
12 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు
Published Wed, Dec 2 2015 12:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
Advertisement
Advertisement