50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి | Hrithik roshan's father sues actor for 50 crore | Sakshi
Sakshi News home page

50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి

Published Tue, Jan 19 2016 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి

50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత అయిన రాకేష్ రోషన్, సుదాంన్షు పాండే అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినందుకుగాను రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ అతడిపై కోర్టులో పరువు నష్టం కింద వేయనున్నారు. కాగా తన రాసుకున్న కథను రాకేష్ రోషన్ చోరీ చేసాడంటూ గతంలో సుదాంన్షు పాండే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ప్రముఖ మోడల్, నటుడు అయిన సుదాంన్షు పాండే.. రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు తన ఫర్మాయిష్ సినిమా కథను దొంగిలించి, అదే కథతో హృతిక్ రోషన్ హీరోగా కాబిల్ పేరుతో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయమై రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాను విచారించిన పోలీసులు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దీంతో సుదాంన్షు పాండే ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణ మూలంగా తనకు జరిగిన వ్యక్తిగత నష్టానికి, 50 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రాకేష్ రోషన్ కోర్టు ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement