హృతిక్ సినిమాకు లీగల్ ప్రాబ్లమ్ | Hrithik Roshan Next film in legal trouble | Sakshi
Sakshi News home page

హృతిక్ సినిమాకు లీగల్ ప్రాబ్లమ్

Published Tue, Dec 8 2015 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

హృతిక్ సినిమాకు లీగల్ ప్రాబ్లమ్

హృతిక్ సినిమాకు లీగల్ ప్రాబ్లమ్

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తదుపరి సినిమా, సెట్స్ మీదకు వెళ్లక ముందే వివాదాలకు తెర తీసింది. ప్రస్తుతం పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మొహంజొదారో' సినిమాలోనటిస్తున్న హృతిక్, ఆ సినిమా తరువాత తన తండ్రి నిర్మాణంలో సంజయ్ గుప్తా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కరీనా కపూర్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు.

ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించి ఏకధాటిగా జరిగే నాలుగు నెలల షూటింగ్లో పూర్తి చేయాలని భావించారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే సమస్యలు మొదలయ్యాయి. యాక్టర్, మోడల్ అయిన సుధాన్షు పాండే, తన కథ, కథనం, మాటలను పర్మిషన్ లేకుండా దర్శకుడు సంజయ్ గుప్తా వాడుకుంటున్నారని, వాటితో హృతిక్ హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నారంటూ కేసు వేశాడు. తాను రెండున్నర ఏళ్ల పాటు కష్టపడి ఫర్మాయిష్ పేరుతో రాసుకున్న ఈ కథ తో తాను తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్టు వివరించాడు. మరి ఈ వివాదం పై హృతిక్, రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement