sanjay guptha
-
హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ కాబిల్. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హృతిక్ అంధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మీద వివాదం మొదలైంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాబిల్ కాపీ కంటెంట్ అంటూ ఆరోపిస్తోంది. మార్వెల్ కామిక్ క్యారెక్టర్ అయిన డేర్ డేవిల్ ను కాబిల్ సినిమా కోసం కాపీ కొట్టారంటోంది. కలర్ స్కీమ్స్ తో పాటు యాక్షన్స్ సీన్స్ డేర్ డెవిల్ తరహాలోనే ఉన్నాయని.. అందుకే చిత్ర నిర్మాత రాకేష్ రోషన్, దర్శకుడు సంజయ్ గుప్తా, హీరో హృతిక్ రోషన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే తమ సినిమా ఏ సినిమాకు కాపీ కాదని వాదిస్తోంది కాబిల్ టీం. -
గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన విలన్
హృతిక్ రోషన్ హీరోగా సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ సినిమా కాబిల్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రముఖ టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోనిత్ చేతికి తీవ్ర గాయమయ్యింది. తను గాయపడటం వల్ల షూటింగ్ ఆగిపోవద్దన్న ఆలోచనతో కేవలం ప్రాథమిక చికిత్స తీసుకొని వెంటనే తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు రోనిత్. ఈ విషయాన్ని దర్శకుడు సంజయ్ గుప్తా స్వయంగా తెలిపాడు. ప్రమాదం జరిగిన తరువాత 24 గంటలు ఆలస్యంగా ఆపరేషన్ చేయించుకున్నాడు రోనిత్ రాయ్. ఈ ఆపరేషన్‌లో ప్రమాద సమయంలో రోనిత్ చేతిలోకి వెళ్లిన 9 గాజు ముక్కలను బయటకు తీశారు. ఆపరేషన్ తరువాత తన చేతిలోంచి తీసిన గాజుముక్కల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రోనిత్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపాడు. Surgery went well! 9 pieces of glass embedded in my arm removed! Thank you for your love and good wishes. pic.twitter.com/bIZfiBMbME — Ronit Roy (@RonitBoseRoy) 17 May 2016 -
50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత అయిన రాకేష్ రోషన్, సుదాంన్షు పాండే అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినందుకుగాను రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ అతడిపై కోర్టులో పరువు నష్టం కింద వేయనున్నారు. కాగా తన రాసుకున్న కథను రాకేష్ రోషన్ చోరీ చేసాడంటూ గతంలో సుదాంన్షు పాండే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ మోడల్, నటుడు అయిన సుదాంన్షు పాండే.. రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు తన ఫర్మాయిష్ సినిమా కథను దొంగిలించి, అదే కథతో హృతిక్ రోషన్ హీరోగా కాబిల్ పేరుతో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయమై రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాను విచారించిన పోలీసులు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దీంతో సుదాంన్షు పాండే ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణ మూలంగా తనకు జరిగిన వ్యక్తిగత నష్టానికి, 50 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రాకేష్ రోషన్ కోర్టు ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు. -
హృతిక్ సినిమాకు లీగల్ ప్రాబ్లమ్
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తదుపరి సినిమా, సెట్స్ మీదకు వెళ్లక ముందే వివాదాలకు తెర తీసింది. ప్రస్తుతం పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మొహంజొదారో' సినిమాలోనటిస్తున్న హృతిక్, ఆ సినిమా తరువాత తన తండ్రి నిర్మాణంలో సంజయ్ గుప్తా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించి ఏకధాటిగా జరిగే నాలుగు నెలల షూటింగ్లో పూర్తి చేయాలని భావించారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే సమస్యలు మొదలయ్యాయి. యాక్టర్, మోడల్ అయిన సుధాన్షు పాండే, తన కథ, కథనం, మాటలను పర్మిషన్ లేకుండా దర్శకుడు సంజయ్ గుప్తా వాడుకుంటున్నారని, వాటితో హృతిక్ హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నారంటూ కేసు వేశాడు. తాను రెండున్నర ఏళ్ల పాటు కష్టపడి ఫర్మాయిష్ పేరుతో రాసుకున్న ఈ కథ తో తాను తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్టు వివరించాడు. మరి ఈ వివాదం పై హృతిక్, రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
12 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు
బాలీవుడ్ స్టార్ పెయిర్ హృతిక్ రోషన్, కరీనా కపూర్ చాలా కాలం తరువాత మరోసారి కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మరోసారి వెండితెర మీద సందడి చేయనుంది. 2001లో విడుదలైన యాదే', 2003లో రిలీజ్ అయిన 'మై ప్రేమ్ కీ దివానీ హూ' సినిమాల్లో హృతిక్, కరీనా కలిసి నటించారు. హృతిక్ రోషన్ ప్రస్తుతం అశుతోష్ గోవ్రికర్ దర్శకత్వంలో 'మొహంజొదారో' పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం నిజమైన పులులు, మొసళ్లతో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే సంజయ్ గుప్తా దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడిగా కరీనా నటించనుంది. రివెంజ్ డ్రామాతో కూడిన ప్రేమకథగా ఈ సినిమాను రూపొదిస్తున్నారు. మొహంజొదారో షూటింగ్ పూర్తి కాగానే సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్, కరీనాలు జంటగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
ఛోటారాజన్గా అభిషేక్ బచ్చన్
పొలిటికల్, క్రైమ్‌కు సంబంధించి ఎలాంటి పెద్ద ఘటనలను వదిలిపెట్టడం లేదు బాలీవుడ్. ఇప్పటికే బాంబు పేలుళ్లు, ఉగ్ర దాడులు, రాజకీయ నాయకుల కథలతో సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు, తాజాగా అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తున్న ఓ అండర్ వరల్డ్ డాన్ కథతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలి, ఇటీవలే పోలీసులకు పట్టుబటిన మాఫియా కింగ్ ఛోటారాజన్ జీవితాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. హుస్సేన్ జైదీ రచించిన 'బైకుల్లా టు బ్యాంకాక్' నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు సంజయ్ గుప్తా. గతంలో జైదీ రాసిన 'డోంగ్రీ టు దుబాయ్' ఆధారంగా కూడా బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు వచ్చాయి. షూటౌట్ ఎట్ వడాలా లాంటి సినిమాలకు ఆ పుస్తకమే ఆధారం. ప్రస్తుతం బాలీవుడ్లో బయోగ్రాఫికల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో ఛోటారాజన్ లైఫ్ హిస్టరీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దేశభక్త డాన్‌గా పేరున్న ఛోటా జీవితంలో హీరోయిజం కూడా పుష్కలంగా ఉండటంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాలో ఛోటారాజన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నాడు. గతంలో కూడా పలు చిత్రాల్లో డాన్ తరహా సీరియస్ పాత్రలు చేసిన అభిషేక్, ఛోటా రాజన్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు. అంతేకాదు, అభిషేక్‌కి బయోగ్రఫికల్ మూవీస్‌లో నటించిన అనుభవం కూడా ఉంది. ధీరుబాయ్ అంబానీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గురు సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.