హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్ | Hrithik Roshans Kaabil in legal Trouble | Sakshi
Sakshi News home page

హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్

Published Sat, Dec 17 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్

హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ కాబిల్. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హృతిక్ అంధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా మీద వివాదం మొదలైంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాబిల్ కాపీ కంటెంట్ అంటూ ఆరోపిస్తోంది. మార్వెల్ కామిక్ క్యారెక్టర్ అయిన డేర్ డేవిల్ ను కాబిల్ సినిమా కోసం కాపీ కొట్టారంటోంది. కలర్ స్కీమ్స్ తో పాటు యాక్షన్స్ సీన్స్  డేర్ డెవిల్ తరహాలోనే ఉన్నాయని.. అందుకే చిత్ర నిర్మాత రాకేష్ రోషన్, దర్శకుడు సంజయ్ గుప్తా, హీరో హృతిక్ రోషన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే తమ సినిమా ఏ సినిమాకు కాపీ కాదని వాదిస్తోంది కాబిల్ టీం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement