kaabil
-
బాలీవుడ్ నటుడు కన్నుమూత
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ స్టార్హీరోలతో కలిసి పలు కీలక పాత్రల్లో నటించిన నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్ ప్రారంభించారు. టెలివిజన్ నటుడుగా కూడా ప్రఖ్యాతి గాంచారు. అలా 2002లో ఫంటూష్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హదర్, రాయీస్, మొహంజోదారో లాంటి ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మూవీ ‘కాబిల్’లో నరేంద్ర ఝా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. టాలీవుడ్లో యమదొంగ, లెజెండ్, ఛత్రపతి సినిమాల్లో నటించారు. కాగా సల్మాన్‌ఖాన్ హీరోగా బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ రేస్-3 నరేంద్ర ఆఖరి చిత్రం. నరేంద్ర ఝా ఆకస్మిక మృతి పట్ల ...ఇండస్ట్రీ నటీనటులు, దర్శక నిర్మాతలు సహా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
స్టార్ హీరో డిఫరెంట్ మేకోవర్
కాబిల్ సక్సెస్ తరువాత మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నాడు హృతిక్. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం సూపర్ 30 పేరుతో స్కూల్ ప్రారంభించిన ఆనంద్ కుమార్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హృతిక్ లుక్ కు సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గుబురు గెడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న హృతిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఆ వార్తలపై ఫైర్ అయిన హృతిక్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరోసారి తనపై వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యాడు. కొద్ది రోజులు హృతిక్ తన ఫ్యాన్ పట్ల దురుసుగా ప్రవర్తించాడన్న వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. హృతిక్ జిమ్ లో ఉండగా ఓ లేడీ ఫ్యాన్ తన మొబైల్ లో ఫోటోలు తీసిందట. అయితే ఆ ఫోటోలు డిలీట్ చేయాలని హృతిక్ కోరినా ఆమె అందుకు అంగీకరించకపోవటంతో హృతిక్ తన ఫోన్ తీసుకొని మొత్తం డాటా ఫార్మట్ చేశాడని పలు మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ వార్తలను ప్రచురించిన ఓ పత్రికపై హృతిక్ రోషన్ సెటైర్ వేశాడు. మీ ఫాంటసీ రచనలు బాగున్నాయి. మీరు ఆ ఊహాలోకం నుంచి తిరిగొచ్చాక కలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు. గతంలోనూ రోగ్ సినిమాలో నటించిన ఏంజెలా క్రిస్ లిన్ స్కీ, హృతిక్ తనకు మెంటర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా హృతిక్ ఘాటుగా స్పందించాడు. ఇటీవల రిలీజ్ అయిన కాబిల్ సినిమాతో మంచి విజయం సాధించిన హృతిక్ రోషన్, త్వరలో క్రిష్ 4ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. Hey Deccan, U are really great at writing chronicles of fantasia. Let's meet up whenever u are back from la la land. Cheers pic.twitter.com/0ECNrQ1LOW — Hrithik Roshan (@iHrithik) 5 June 2017 -
పాక్‌లో నిషేధం అనంతరం.. తొలి సినిమా ఇదే!
ముంబై: ఎట్టకేలకు పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలు విడదల కాబోతున్నాయి. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ’కాబిల్’ సినిమాతో ఇది ప్రారంభం కాబోతున్నది. చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ ఈ విషయాన్ని మంగళవారం ట్విట్టర్లో ప్రకటించాడు. ’అవును. ఇది నిజమే. కాబిల్ సినిమా కరాచీలో ఈ రోజు రాత్రి 11 షో ప్రదర్శితం కానుంది. రేపటినుంచి పాకిస్థాన్ అంతటా ఈ సినిమా ప్రదర్శితంకానుంది’ అని రోషన్ ప్రకటించారు. దేశంలో కాబిల్ సినిమా విడుదలలో పారదర్శకత పాటించలేదని, తన సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వలేదని రాకేష్ రోషన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిషేధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాల విడుదలపై పాక్‌లో నిషేధం విధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలపై తాజాగా నిషేధాన్ని ఎత్తివేశారు. బ్యాన్ ఎత్తివేసిన తర్వాత పాకిస్థాన్‌లో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమాగా ’కాబిల్’ నిలిచింది. -
రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే
ముంబై: ఒకేరోజు విడుదలైన బాలీవుడ్ సినిమాలు రేయీస్, కాబిల్లకు బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. వసూళ్లలో రేయీస్ దూసుకెళ్తుండగా, కాబిల్ వెనుకబడింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా కాబిల్ సినిమాకు రోజురోజుకూ కలెక్షన్లు పడిపోతున్నాయి. జనవరి 25న విడుదలైన కాబిల్ ఏడు రోజుల్లో 61.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాగా సోమవారం నుంచి బాగా తగ్గాయి. సోమవారం 4 కోట్లు, మంగళవారం 3.5 కోట్ల రూపాయలు వచ్చాయి. కాబిల్లో హృతిక్ సరసన యామీ గౌతమ్ నటించింది. కాగా జనవరి 25న విడుదలైన రేయీస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 62.56 కోట్లు, దేశంలో 152.61 కోట్ల రూపాయలు వచ్చాయి. -
రెండు సినిమాల్లో దేనికి కలెక్షన్లు ఎక్కువ..!
ముంబై: ఒకే రోజు విడుదలై, బాక్సాఫీసు వద్ద పోటీపడ్డ బాలీవుడ్ తాజా సినిమాలు రాయిస్, కాబిల్.. ఓపెనింగ్ కలెక్షన్లలో రాయిస్ టాప్‌లో నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన రాయిస్, హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాయిస్ తొలి రోజు 20.42 కోట్ల రూపాయలు వసూలు చేయగా, కాబిల్కు 10.43 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు గురువారం రిపబ్లిక్ డే సెలవు దినం కావడంతో ఈ సినిమాలకు ఇదే స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశముందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాబిల్ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో కలెక్షన్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. రాయిస్‌లో షారుక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించగా, కాబిల్లో హృతిక్ అంధుడి పాత్రలో నటించాడు. -
నా మాజీ భార్యకు నచ్చడం సంతోషం: హీరో
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా సినిమా కాబిల్కు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో అతను సంతోషంగా ఉన్నాడు. అంతేగాక మాజీ భార్య సుసానే ఖాన్.. కాబిల్ స్పెషల్ షో చూడటంతో పాటు ఈ సినిమా బాగుందని, హృతిక్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించడం హృతిక్ కు మరింత సంతోషాన్ని కలిగించింది. హృతిక్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. భారత చలనచిత్ర చరిత్రలో.. ఇది అద్భుత ప్రదర్శనని, హృతిక్‌కు కాబిల్ మంచి పేరు తెస్తుందని, ఈ సినిమా యూనిట్‌కు అభినందనలు తెలుపుతూ సుసానె ట్వీట్ చేసింది. హృతిక్‌తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది. దీనిపై హృతిక్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. కాబిల్ సినిమా సుసానెకు నచ్చడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మరో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు.. ఇప్పట్లో ఆ ఉద్దేశంలేదన్నాడు. గత ఏడాది కంగనా రనౌత్‌తో గొడవ, వరుస ప్లాఫులతో సతమతమవుతున్న హృతిక్.. తన తాజా సినిమా కాబిల్కు హిట్ టాక్ రావడం, తన మాజీ భార్య ప్రశంసించడంతో అతనికి ఆత్మవిశ్వాసం కలిగించినట్టయ్యింది. హృతిక్, సుసానె తమ పదమూడేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తమ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వాళ్లు మళ్లీ దగ్గరయ్యే అవకాశముందని సన్నిహితులు భావిస్తున్నారు. -
ఆ హీరో.. నన్ను దారుణంగా మోసగించాడు: నిర్మాత
50-50శాతం థియేటర్లు ఇవ్వలేదు నాకు 150 కోట్ల నష్టం రావొచ్చు షారుఖ్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 'రాయిస్' సినిమాపై హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేష్ రోషన్ బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. అందుకు కారణం లేకపోలేదు. హృతిక్ హీరోగా తెరకెక్కిన 'కాబిల్' సినిమాను ఈ రోజున (జనవరి 25న) విడుదల చేస్తామని ఎంతో ముందుగానే రాకేశ్ ప్రకటించారు. ఆ తర్వాత పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన షారుఖ్ 'రాయిస్' కూడా బుధవారమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించింది. దీంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద టైటానిక్ క్లాష్ తప్పలేదు. షారుఖ్ తన సినిమా విడుదల తేదీని మార్చుకుంటారని అంతా భావించారు. షారుక్ దిగిరాలేదు. హృతిక్యే పెద్ద మనస్సు చేసుకొని.. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైనా తమ మధ్య విభేదాలు రాకుండా చూస్తామని చెప్పాడు. దీంతో రెండు సినిమాలకు దేశంలోని థియేటర్లను 50:50శాతం పంచుకోవాలని మొదట భావించారు. కానీ, చివరి నిమిషంలో రాకేష్ రోషన్‌కు షాక్ ఇస్తూ 'రాయిస్'కు అనుకూలంగా 60:40 శాతం థియేటర్లను పంచారు. దీంతో బిత్తరపోయిన రాకేష్ తన సినిమాను షారుఖ్ మోసం చేశారని వాపోతున్నారు. 'నేను వేరేవాళ్ల సినిమా గురించి మాట్లాడాను. నా సినిమా కాబిల్ గురించే మాట్లాడుతాను. సినిమా విడుదల విషయంలో మేం షాక్‌కు గురయ్యాం. బాధపడ్డాం. నిరాశ చెందాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. గతవారం ఎగ్జిబిటర్లందరితోనూ మాట్లాడి వారికి గంట సినిమా కూడా చూపించాం. 50-50శాతం థియేటర్లు ఇవ్వాలని కోరాం. అందుకు వారు ఒప్పుకొన్నారు కూడా. దుబాయ్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఇలా ప్రపంచమంతటా 50-50 షేర్‌కు అంగీకారం కుదిరింది. కానీ ఆ తర్వాత వారు చేసింది మమ్మల్ని బాధించింది. మేం మోసపోయామనిపించింది. ఇలా చేయడం సరికాదు. రెండు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు 50-50 థియేటర్ల పంపకాలు ఉండాలని నిర్మాతలంతా కోరుకుంటారు' అని పేర్కొన్నారు. దర్శకుడు, నిర్మాత అయిన రాకేశ్ రోషన్ 90వ దశకంలో షారుఖ్‌కు ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'కరణ్ అర్జున్' సినిమాను కూడా ఆయనే తీశారు. థియేటర్లను 60-40 శాతం పంపకాలు చేయడం వల్ల తనకు నేరుగా 150 కోట్ల నష్టం వస్తుందని, ఒకేసారి రెండు సినిమాలు చూసేంత డబ్బు ప్రజల వద్ద ఉండదని, కాబట్టి థియేటర్ల పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల తన సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా దేవుడు తనకు అండగా ఉన్నాడని, తనకేమీ కాదని అన్నారు. షారుఖ్ తీరుపై ఆయన పరోక్షంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఆ స్టార్ కపుల్ మళ్లీ ఒకటవుతున్నారా!
ముంబై: తమ పదమూడేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వాళ్లు విడాకులు తీసుకున్నారు. సామరస్యపూర్వకంగా వీడిపోయినా.. ఎదిగే తమ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఒక్కటవుతారా? అన్నంత చేరువగా వచ్చారు. వారే మాజీ బాలీవుడ్ జంట హృతిక్ రోషన్. సుసానె ఖాన్. విడాకులు తీసుకున్న ఈ మాజీ దంపతులు కొడుకులు రెహాన్, హ్రిదాన్ కోసం ఇప్పటివరకు హుందాగా పరస్పరం సహకరించుకున్నారు. ఇటీవల హృతిక్ 43వ పుట్టినరోజుకు హాజరై సుసానె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి మధ్య అనుబంధం మళ్లీ రోజురోజుకు దృఢపడుతుండటం బాలీవుడ్ వర్గాలను, అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. గత ఏడాది కంగనా రనౌత్‌తో గొడవ, వరుస ప్లాఫులతో సతమతమవుతున్న హృతిక్ తన తాజా సినిమా ’కాబిల్’పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ స్క్రీనింగ్ ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హృతిక్ తో కలిసి సుసానె రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య మళ్లీ చిగురిస్తున్న సానుకూల అనుబంధం మళ్లీ వీరు ఒక్కటవుతారా అన్న కథనాలకు తావిస్తోంది. విభేదాలతో వీడిపోయిన ఈ జంట మళ్లీ ఒకటై ఆనందంగా గడుపాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
మాజీ భర్త సినిమాపై ఆమె స్పందన!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో విడాకులు తీసుకున్నా.. అతనికి అండగా నిలిచే విషయంలో మాజీ భార్య సుసానె ఖాన్ ఎప్పుడూ ముందుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పబ్లిక్‌గా మాజీ భర్తకు అండగా నిలిచిన సుసానె.. తాజాగా 'కాబిల్' సినిమా విషయంలోనూ మద్దతు పలికారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన సుసానెకు ఇటీవల చార్కోల్ డిజైన్ ప్రాజెక్టుకు అవార్డు లభించింది. బుధవారం ముంబైలో ఈ అవార్డు అందుకున్న సందర్భంగా 'కాబిల్' సినిమా గురించి ఆహూతులు ఆమె స్పందన అడిగారు. 'మొహెంజోదారు' ప్లాప్ తర్వాత సొంత బ్యానర్లో హృతిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా గురించి అడగ్గానే నవ్వుతూ స్పందించిన ఆమె.. 'ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నాకు నమ్మకం ఉంది' అని ఆమె పేర్కొన్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్తూ 2013లో హృతిక్, సుసానె విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు రెహాన్, రిధాన్ ఉన్నారు. విడాకుల అనంతరం కూడా ఈ జంట అప్పుడప్పుడు కలుస్తూ స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఇటీవల ఈ జంట పిల్లలతో కలిసి ఓ డిన్నర్ పార్టీలో సరదాగా గడిపింది. గతంలో కంగనా-హృతిక్ మధ్య నడిచిన లీగల్ పోరులోనూ మాజీ భర్తకు సుసానె అండగా నిలిచింది. -
హృతిక్ సినిమాకు లీగల్ ట్రబుల్
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ కాబిల్. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హృతిక్ అంధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మీద వివాదం మొదలైంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాబిల్ కాపీ కంటెంట్ అంటూ ఆరోపిస్తోంది. మార్వెల్ కామిక్ క్యారెక్టర్ అయిన డేర్ డేవిల్ ను కాబిల్ సినిమా కోసం కాపీ కొట్టారంటోంది. కలర్ స్కీమ్స్ తో పాటు యాక్షన్స్ సీన్స్ డేర్ డెవిల్ తరహాలోనే ఉన్నాయని.. అందుకే చిత్ర నిర్మాత రాకేష్ రోషన్, దర్శకుడు సంజయ్ గుప్తా, హీరో హృతిక్ రోషన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే తమ సినిమా ఏ సినిమాకు కాపీ కాదని వాదిస్తోంది కాబిల్ టీం. -
‘కాబిల్’ మూవీ స్టిల్స్
-
బాలీవుడ్ బాద్షాకు బాహుబలి సాయం
రిపబ్లిక్ డే కానుకగా బాలీవుడ్లో రెండు భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. షారూఖ్ హీరోగా తెరకెక్కిన రాయిస్‌తో పాటు, గ్రీకువీరుడు హృతిక్ లీడ్ రోల్లో తెరకెక్కిన కాబిల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో ఎవరిది పై చేయి అవుతుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ భారీ పోటిలో సత్తా చాటేందుకు షారూఖ్ ఖాన్, బాహుబలిని వాడేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాయిస్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థే బాహుబలి సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో.. సింగిల్ స్క్రిన్స్లో రాయిస్ రిలీజ్ చేసిన థియేటర్లకే బాహుబలి సినిమాను ఇస్తామన్నా కండిషన్ పెడుతున్నారట. దీంతో బాహుబలి లాంటి సినిమాను వదులుకోలేక రాయిస్‌ను కూడా తమ థియేటర్లలో రిలీజ్ చేసుందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
మోహన్ లాల్ చేతికి హృతిక్ 'కాబిల్'
జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు మోహన్ లాల్. మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్, నటుడిగా ఎన్నో అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. అందుకే సూపర్ స్టార్ ఇమేజ్ కన్నా ద కంప్లీట్ యాక్టర్ అనిపించుకునేందుకు ఇష్టపడతారు మోహన్ లాల్. ప్రస్తుతం నటుడిగా వరుస సూపర్ హిట్ లు సాధిస్తున్న ఈ స్టార్ హీరో బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు. మోహన్ లాల్ నటుడిగానే కాక గాయకుడిగా, నిర్మాతగా, సినిమా డిస్ట్రిబ్యూటర్ గా సుపరిచితుడే. అయితే ఇన్నాళ్లు మలయాళ సినిమాలను మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసిన మోహన్ లాల్ ప్రస్తుతం పరాభాషా సినిమాల మీద దృష్టి పెట్టాడు. తాను విజయ్ తో కలిసి చేసిన జిల్లా సినిమాతో తొలిసారిగా పరభాషా సినిమాను కేరళలో రిలీజ్ చేసిన మోహన్ లాల్ కంపెనీ ఇప్పుడు వరుసగా ఇతర భాషల సినిమాల మీదే దృష్టి పెడుతోంది. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాను భారీగా రిలీజ్ చేసిన మోహన్ లాల్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన కాబిల్ కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు భారీ బడ్జెట్ తో శంకర్, రజనీకాంత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న రోబో సీక్వల్ రైట్స్ కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ కంప్లీట్ యాక్టర్. నటుడిగా టాప్ పొజీషన్ లో ఉన్న మోహన్ లాల్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గానూ అదే ఫాం చూపించాలని భావిస్తున్నాడు. -
కాబిల్ షూటింగ్‌కు బ్రేక్
మొహెంజోదారో సినిమా తరువాత.. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు కండల వీరుడు హృతిక్ రోషన్. అయితే భారీ యాక్షన్ సీన్స్ ఉన్న మొహెంజోదారో షూట్, ఆ వెంటనే ప్రమోషన్ కార్యక్రమాలు, ఆ వెంటనే కాబిల్ షూట్ ఇలా బిజీ షెడ్యూల్‌తో అలిసి పోయిన హృతిక్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాడు. అందుకే కాబిల్ టీం హృతిక్‌తో చేయాల్సిన షూటింగ్‌ను వాయిదా వేసింది. తీవ్ర జ్వరంతో ఉన్న హృతిక్ కోలుకోవటానికి మరో నాలుగైదు రోజుల సమయం పట్టనుండటంతో ఈ గ్యాప్‌లో హీరో పాత్ర కనిపించని సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే హృతిక్ కూడా షూటింగ్‌కు హాజరవుతారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకుడు. హృతిక్ త్రండి రాకేష్ రోషన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2017 జనవరి 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన విలన్
హృతిక్ రోషన్ హీరోగా సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ సినిమా కాబిల్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రముఖ టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోనిత్ చేతికి తీవ్ర గాయమయ్యింది. తను గాయపడటం వల్ల షూటింగ్ ఆగిపోవద్దన్న ఆలోచనతో కేవలం ప్రాథమిక చికిత్స తీసుకొని వెంటనే తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు రోనిత్. ఈ విషయాన్ని దర్శకుడు సంజయ్ గుప్తా స్వయంగా తెలిపాడు. ప్రమాదం జరిగిన తరువాత 24 గంటలు ఆలస్యంగా ఆపరేషన్ చేయించుకున్నాడు రోనిత్ రాయ్. ఈ ఆపరేషన్‌లో ప్రమాద సమయంలో రోనిత్ చేతిలోకి వెళ్లిన 9 గాజు ముక్కలను బయటకు తీశారు. ఆపరేషన్ తరువాత తన చేతిలోంచి తీసిన గాజుముక్కల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రోనిత్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపాడు. Surgery went well! 9 pieces of glass embedded in my arm removed! Thank you for your love and good wishes. pic.twitter.com/bIZfiBMbME — Ronit Roy (@RonitBoseRoy) 17 May 2016 -
'ఆ చాన్స్‌తో చాలా ఎక్సైటింగ్‌గా ఉంది'
న్యూఢిల్లీ: ఫెయిర్ లవ్లీ యాడ్‌లో మెరిసి.. ఆ తర్వాత 'విక్కీ డోనర్' సినిమాతో తెరపై కనువిందు చేసింది యామీ గౌతమీ. తెలుగులో 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో కనిపించిన ఈ అమ్మడికి ఇప్పటివరకు చిన్నాచితకా అవకాశాలే వచ్చాయి. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన హృత్తిక్ రోషన్‌తో కలిసి నటించే భారీ చాన్స్ రావడంతో ఈ అమ్మడు ఎగిరి గంతేస్తోంది. 'కాబిల్' సినిమాలో హృత్తిక్తో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని యామీ గౌతమి చెప్తోంది. 'ఇది నిజంగా గొప్ప అవకాశం. ఆయనతో కలిసి నటిస్తుండటం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. అదే సమయంలో కొంచెం ఆందోళన కూడా ఉంది. ఆయన చాలా పెద్ద స్టార్ హీరో. ఎప్పుడూ నాలో స్ఫూర్తినింపే నటుడు ఆయన. ఆయనతో కలిసి నటించడం నిజంగా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని యామీ మీడియాతో తెలిపింది. ఇప్పటివరకు 'టోటల్ సిపాయ', 'బద్లాపూర్' వంటి సినిమాలతో మెప్పించిన యామీ త్వరలోనే 'సానమ్ రే' సినిమాతో ప్రేక్షకులను పలుకరించనుంది.