ఆ వార్తలపై ఫైర్ అయిన హృతిక్ | Hrithik Roshan Slams latest rumours | Sakshi
Sakshi News home page

ఆ వార్తలపై ఫైర్ అయిన హృతిక్

Published Tue, Jun 6 2017 2:11 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

ఆ వార్తలపై ఫైర్ అయిన హృతిక్

ఆ వార్తలపై ఫైర్ అయిన హృతిక్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరోసారి తనపై వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యాడు. కొద్ది రోజులు హృతిక్ తన ఫ్యాన్ పట్ల దురుసుగా ప్రవర్తించాడన్న వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. హృతిక్ జిమ్ లో ఉండగా ఓ లేడీ ఫ్యాన్ తన మొబైల్ లో ఫోటోలు తీసిందట. అయితే ఆ ఫోటోలు డిలీట్ చేయాలని హృతిక్ కోరినా ఆమె అందుకు అంగీకరించకపోవటంతో హృతిక్ తన ఫోన్ తీసుకొని మొత్తం డాటా ఫార్మట్ చేశాడని పలు మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ ట్రెండ్ అయ్యింది.

అయితే ఈ వార్తలను ప్రచురించిన ఓ పత్రికపై హృతిక్ రోషన్ సెటైర్ వేశాడు. మీ ఫాంటసీ రచనలు బాగున్నాయి. మీరు ఆ ఊహాలోకం నుంచి తిరిగొచ్చాక కలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు. గతంలోనూ రోగ్ సినిమాలో నటించిన ఏంజెలా క్రిస్ లిన్ స్కీ, హృతిక్ తనకు మెంటర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా హృతిక్ ఘాటుగా స్పందించాడు. ఇటీవల రిలీజ్ అయిన కాబిల్ సినిమాతో మంచి విజయం సాధించిన హృతిక్ రోషన్, త్వరలో క్రిష్ 4ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement